Latest Updates
-
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి! -
యదా యదా హి ధర్మస్య.. శ్రీకృష్ణుడి స్ఫూర్తితో మీ బంధుమిత్రులకు జన్మాష్టమి శుభాకాంక్షలు చెప్పండిలా! -
బుధ గ్రహ గోచారం: అదృష్టం అంటే వీరిదే.. సెప్టెంబర్ 7 నుంచి ఈ నాలుగు రాశుల వారికి గోల్డెన్ డేస్.!
అలర్ట్: గర్భిణీ స్త్రీలను అవాయిడ్ చేయాల్సిన డేంజరెస్ ఫుడ్స్
మహిళ జీవితంలో ఒక మధుర ఘట్టం గర్భధారణ. మొదటి సారి మహిళ గర్భం పొందితే ఇక ఆమె జీవితం ఒక కొత్త మలుపు తిరుగుతుంది . పొట్టలో ఏదో ఒక కొత్త ప్రపంచం . కదలికలు, మార్పులు అన్నీ కొత్తగా అగుపిస్తాయి. దానికి తగ్గట్టుగానే ఆమె అలవాట్లు , ముఖ్యంగా మంచి లేదా చెడులను మీద నేరుగా ప్రభావం చూపుతుంది. ఆమె అలవాట్లు, ఆరోగ్యం కడుపులో పెరిగే బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుంది.
కాబట్టి, హెల్తీ లైఫ్ స్టైల్ ను అలవాటు చేసుకోవడం కొత్తగా తల్లైన వారికి చాలా ముఖ్యం. ముఖ్యంగా గర్భిణీ మహిళలు వారు రెగ్యులర్ గా తీసుకొనే ఆహారాల్లో క్రమంగా మార్పులు చేసుకోవడం చాలా అవసరం.
సహజంగా ఆమె తీసుకొనే డైట్ లో సెడెన్ గా మార్పులు చేసుకోవడం అనేది కొద్దిగా కష్టమైనా, కడుపులో పెరిగే బిడ్డకోసం మార్పులు చేసుకోక తప్పదు. ఆహారణ నిపుణుల అభిప్రాయం ప్రకారం గర్భిణీ మహిళలు ఇద్దరికి సరిడా ఆహారం తీసుకోవాలని సూచిస్తుంటారు. కానీ మీకు తెలుసా కొన్ని రకాల ఆహారాలు గర్భిణీ స్త్రీలకు హాని కలిగిస్తాయి.
గర్భణీ స్త్రీలు ఎలాంటి ఆహారాలను తమ డైట్ లో చేర్చుకోవాలన్న విషయం చాలా ముఖ్య విషయం . ఆమె తీసుకొనే ప్రతి ఆహారం బిడ్డ మీద ప్రభావం చూపుతుంది . దాన్ని బట్టే కడుపులో పెరిగే శిశువు యొక్క ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది . కొన్ని ఆహారపదార్థాలు మహిళ ఆరోగ్యం మీద సీరయస్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటాయి. ఆమె తీసుకొనే ఆహారాల వల్ల గర్భస్రావం, పుట్టబోయే బిడ్డలో లోపాలు, ఇన్ఫెక్షన్స్, ప్రీమెచ్యుర్ బర్త్ కు మొదలగు సమస్యలకు దారితీస్తుంది.
కాబట్టి, కొన్ని నేచురల్ ఫుడ్స్ ను ఇక్కడ లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. వీటికి గర్భిణీ స్త్రీలు దూరంగా ఉండటమే మంచిది . వీటిని ఖచ్చితంగా వారి రెగ్యులర్ డైట్ నుండి నివారించాలి. అప్పుడే తల్లి బిడ్డ సురక్షితం..మరి నివారించాల్సిన ఆహారాలేంటో చూద్దాం...
తల్లి బిడ్డకు హాని కలిగించే డేంజరెస్ ఫుడ్స్..

1. చీజ్:
అన్ పాచ్చురైజ్డ్ పాల నుండి తయారుచేసిన చీజ్ . ఇది గర్భిణీల మహిళలకు చాలా హానికరం . ఎందుకంటే ఇందులో ఇ కోలి ఉంటి ఉంటుంది. ఇది తల్లి బిడ్డకు ఇన్ఫెక్షన్స్ మరియు బలహీనతగా మార్చుతుంది.

2. చేపలు:
కొన్ని రకాల చేపల్లో మెర్క్యురి అధికంగా ఉండటం వల్ల ఇది నెగటివ్ ఎఫెక్ట్స్ ను కలిగి ఉంటుంది .ఇది పుట్టబోయే బిడ్డలో లోపాలకు గురిచేస్తుంది. మెకరెల్, స్వార్డ్ ఫిష్ టైల్ ఫిష్, షార్క్, మొదలగునవి తినకుండా నివారించాలి.

3. స్మోక్డ్ సీఫుడ్:
సీఫుడ్స్ రిఫ్రిజరేటర్లో నిల్వచేస్తుంటారు. దాని తర్వాత హీట్ చేయడం లేదా గ్రిల్డ్ చేయడం వల్ల , వాటిలోప ఉండే బ్యాక్టీరియా తల్లి మరియు పుట్టబోయే బిడ్డలో వివిధ రకాల వ్యాధులకు గురిచేస్తుంది.

4. కెఫిన్:
కెఫిన్ అధికంగా ఉండే కాఫీ మరియు ఎనర్జీ డ్రింక్స్ కు గర్భిణీ స్త్రీలు దూరంగా ఉండటం చాలా మంచిది . కెఫిన్ ఫీటల్ డెత్ , స్టిల్ బర్త్ గురిచేస్తుంది మరియు శిశువు తక్కువ బరువుతో పుట్టడానికి కారణం అవుతుంది.

5. చామంతి:
చమోమెలీ గర్భాధరణ సమయంలో నివారించాలి . ఇది ప్రీమెచ్య్యూర్ ర్త్ కు కారణం అవుతుంది మరియు బేబీస్ ఫిజికల్ డెవలప్ మెంట్ లో ఆలస్యం జరుగుతుంది. అలాగే బేబీకి ఎక్కువ వేడి కలిగిస్తుంది.

6. పచ్చిబొప్పాయి:
పచ్చిబొప్పాయిని తీసుకోవడం వల్ల ఇది శరీరంలో అధిక వేడిని కలిగిస్తుంది. ఇది గర్భస్రావానికి లేదా ప్రీమెచ్యుర్ బర్త్ కు కారణం అవుతుంది .

7. సరిగా ఉడకని మాంసాహారం:
మాంసాహరం తల్లిలో జీర్ణక్రియకు ఇబ్బంది కలిగిస్తుంది. ముఖ్యంగా సరిగా ఉడికించని మాంసాహారంలో ఇ. కోలీ, ఉండటం వల్ల ఇది వివిధ రకాల ఇన్ఫెక్షన్స్ మరియు వ్యాధులను దారిస్తుంది . దాంతో తల్లి బిడ్డకు ఇద్దరికీ హాని కలిగిస్తుంది.

8. లివర్:
ఈడిబుల్ లివర్ . మాంసాహారాల్లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది తల్లి మరియు బిడ్డకు హాని కలిగిస్తుంది . విటమిన్ ఎ మోతాదుకు మించి తసుకోవడం వల్ల పుట్టే బిడ్డలో లోపాలు ఉంటాయి.

9. కలబంద:
కలబంద , గర్భధారణ సమయంలో తీసుకోవడం , లేదా ఉపయోగించడం వల్ల గర్భస్రావానికి గురిచేస్తుంది . గర్భిణీలో అసాధారణంగా బ్లీడింగ్ అవుతుంది.

10. హెర్బల్ టీ:
కొన్ని రకాల హెర్బల్ టీలను గర్భిణీ స్త్రీలు తాగకపోవడమే మంచిది. ముఖ్యంగా జెన్సింగ్, యారో, లికోరైస్, రూట్ మొదలగునవి , ఇవి ప్రెగ్నెన్సీ హార్మోనుల మీద తీవ్రప్రభాన్ని చూపుతుంది . వ్యతిరేకంగా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications