Latest Updates
-
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఎండలో ఉంటున్నా.. ట్యాబ్లెట్లు వాడుతున్నా విటమిన్-D పెరగట్లేదా? అసలు కారణం ఇదే! -
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే!
గర్భిణీ ఆరోగ్యానికి సురక్షితమైన హోం రెమెడీస్ ..!
గర్భధారణ బ్యూటిఫుల్ ఎక్స్ పీరియన్స్. ఈ అద్భుతమైన క్షణాలు గర్భినీ నెలలు డిచే కొద్ది తగ్గుతుంది. ఎందుకంటే గర్భిణీలో వచ్చే మార్పులు ఆమెకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. మార్నింగ్ సిక్ నెస్, హెమరాయిడ్స్, ఈస్ట్ ఇన్ఫెక్షన్స్, వెరికోస్ వీన్స్, ఎడిమా, మరియు బ్యాక్ పెయిన్ వంటి సమస్యలు సహజం. గర్భిణీలో వచ్చే ఈ సెడన్ మార్పు ఆమెకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఈ సమస్యల నుండి బయటపడాలంటే కొన్నిహెర్బ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. అయితే గర్భిణీలకు అన్ని రకాల హెర్బ్స్ సురక్షితమైనవి కావు. గర్భిణీలకు సురక్షితమైన పది మూలికలను ఎంపిక చేసి , ఈ క్రింది విధంగా అందివ్వడం జరిగింది.
ప్రెగ్నెన్సీకి బెస్ట్ హెర్బ్ మరియు ప్రయోజనాలు:

1. మార్నింగ్ సిక్ నెస్ నివారించే అ్లలం:
గర్భిణీలో మార్నింగ్ సిక్ నెస్ సహజం. జింజర్ క్యాప్స్యూల్,పౌడర్ లేదా ఫ్రెష్ జింజర్ టీ తీసుకోవడం వల్ల ఖచ్చితంగా మార్నింగ్ సిక్ నెస్ నుండి ఉపశమనం పొందవచ్చు.ఫ్రెష్ జింజర్ తో తయారుచేసిన డికాషిన్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి తీసుకుంటే వాంతులు రావు.

2. ప్రసవం సులభమవ్వడానికి రెడ్ రాస్బ్రెర్రీ:
రెడ్ రాబ్బెర్రీలో విటమిన్స్, ఐరన్, క్యాల్షియం పుష్కలంగా ఉన్నాయి. . యూట్రస్ ను టోన్ చేసి, ప్రసవం సులభం చేయడానికి ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. మూడవ త్రైమాసికంలో తీసుకోవడం వల్ల ప్రసవానికి మేలు చేస్తుంది. దీన్ని టాబ్లెట్ రూపంలో లేదా టీ రూపంలో తీసుకోవచ్చు. రోజ్ హిప్ మరియు పుదీనా చేర్చి తీసుకోవచ్చు.

3.జలుబు తగ్గించుకోవడానికి ఎచినాషియ:
ఎచినాషియ హెర్బ్ లో యాంటీ కోల్డ్ ప్రొపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి . ఈ హెర్బ్ గర్భిణీలు ఎలాంటి నెగటివ్ లక్షణాలకు గురిచేయదు. అందువల్ల గర్భిణీలు దీన్ని తీసుకోవడం వల్ల జలుబు మరియు దగ్గును నివారిస్తుంది.

4. యూటిఐనివారించడానికి క్రాన్ బెర్రీస్:
క్రాన్ బెర్రీలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. క్రాన్ బెర్రీ క్యాప్స్యూల్స్, జ్యూస్ లేదా ఫ్రూట్ తీసుకోవచ్చు.

5.నిద్రకు చమోమెలీ టీ:
గర్భిణీ లో పొట్టే పెరిగే కొద్ది అసౌకర్యంతో నిద్రలేమి సమస్యలుంటాయి. ఈ సమస్యను నివారించుకోవడానికి చమోమెలీ టీ తాగాలి. ఈ టీ తాగడం వల్ల మజిల్స్ రిలాక్స్ అవుతాయి మరియు నాడీవ్యవస్థను ప్రశాంతపరుస్తుంది. రిలాక్స్అయ్యి నిద్రబాగా పడుతుంది.

6. నాటెల్ లీవ్స్ :
నాటిల్ లీవ్స్ న్యూట్రీషియన్స్ కు పవర్ హౌస్ వంటిది. ఇందులో విటమిన్ ఎ, సి, కె మరియు పొటాషిం, మినిరల్స్ అధికంగా ఉన్నాయి. ఇంకా ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువ . ఇవి బ్రెస్ట్ మిల్క్ ఉత్పత్తి చేస్తాయి. కిడ్నీలను స్ట్రాంగ్ గా ఉంచుతాయి . శరీరంలో ఫ్లూయిడ్ రిటెన్షన్ తగ్గిస్తుంది, వేరికోస్ వీన్స్ మరియు హెమరాయిడ్స్ సమస్యను తగ్గిస్తుంది.

7. డాండలైన్ రూట్ టీ:
డాండలైన్ రూట్ టీ జీర్ణరసాలను ఉత్పత్తి చేస్తుంది . దాంతో జీర్ణక్రియ బెటర్ గా ఉంటుంది. ఇంకాఇది లివర్ డిటాక్సిఫై చేస్తుంది. బలాన్నిస్తుంది. క్యాల్షియం మరియు ఐరన్ కు మంచి మూలం. మదర్ మరియు బేబీలో ముఖ్యపాత్రను పోషిస్తాయి.

8. ఆల్ఫాల్ఫా:
ఆల్ఫాల్ఫా లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ ఉన్నాయి. క్లోరో ఫిల్ మరియు విటమిన్ కె బ్లడ్ క్లాట్స్ ను నివారిస్తుంది. గర్భిణీలు ఆల్ఫాల్ఫా టీ తాగడం వల్ల పోస్ట్ మాట్రమ్ బ్లీడింగ్ ను నివారిస్తుంది . హెమరేజ్ ను నివారిస్తుంది. అలాగే బ్రెస్ట్ మిల్క్ క్వాలిటీ మరియు క్వాంటింటి మెరుగుపరుస్తుంది.

9. పెప్పర్ మింట్ లీఫ్ :
పుదీనా మార్నింగ్ సిక్ నెస్ మరియు ఆపానవాయువు నివారించడంలో నేచురల్ యాంటీడోట్. అయితేదీన్ని లిమిట్ గా తీసుకోవాలి.

10. ఓట్స్ మరియు ఓట్స్ స్ట్రూ:
ఇందులో క్యాల్షియం మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉంది. ఇది విశ్రాంతి కలిగిస్తుంది. ఆందోళ మరియు స్కిన్ ఇరిటేషన్ తగ్గిస్తుంది. లెగ్ క్రాంప్ తగ్గిస్తుంది, జీర్ణ శక్తినిపెంచుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరుస్తుంది.



Click it and Unblock the Notifications











