For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో వీక్ నెస్ తగ్గించి ఎనర్జీ అందించే అద్భుత మార్గాలు..!

మహిళ గర్భం పొందిన తర్వాత ఎంత బిజీగా ఉన్నా.. కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. గర్భంతో ఉన్న తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా, నీరసం, అలసట వల్ల ఎనర్జీ లెవల్స్ తగ్గిపోకుండా ఉండాలన్నా, తప్పనిసరిగా

|

మహిళ గర్భం పొందిన తర్వాత, ప్రతి ఒక్క మహిళ వివిధ రకాల ఆరోగ్య సమస్యలను ఫేస్ చేస్తుంటారు. గర్భం పొందిన తర్వాత కనిపించే మొదట లక్షణం, మొదటి సమస్య అలసట. నీరసం, మూడ్ స్వింగ్స్ (తరచు మూడు మారుతుండటం)

ఈ సమస్య నుండి బయటపడాలంటే కొన్ని హెల్తీ ఫుడ్స్ తప్పనిసరిగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. అలాగే గర్భిణీలు అలసట నుండి బయటపడి, ఎనర్జీ లెవల్స్ పెంచుకోవాలంటే కొన్ని మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి.

కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. మహిళ గర్భం పొందిన తర్వాత ఎంత బిజీగా ఉన్నా.. కొంత సమయం విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. గర్భంతో ఉన్న తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలన్నా, నీరసం, అలసట వల్ల ఎనర్జీ లెవల్స్ తగ్గిపోకుండా ఉండాలన్నా, తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే..

నిద్ర :

నిద్ర :

నిద్రలేమి వల్ల ప్రెగ్నెన్సీ అసట, ఎనర్జీ లేనట్లు ఫీలవుతారు. అందువల్ల 7 నుండి 9 గంటల నిద్ర తప్పనిసరి. రోజంతా ఉల్లాసంగా, ఎనర్జిటిక్ గా ఉండాలంటే తగినంత నిద్ర, విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి:

ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినాలి:

బాడీలో ఎనర్జీ లెవల్స్ నేచురల్ గా పెంచుకోవాలంటే, ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. పాలు, చీజ్, గుడ్డు, డ్రైడ్ ఫ్రూట్ట్స్, నట్స్, సీడ్స్, వంటి ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ఎక్కువ ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల పుట్టబోయే బిడ్డలో రీప్రొడ్యూసింగ్ సెల్స్ పెరుగుతాయి.

స్నాక్స్ :

స్నాక్స్ :

హెల్తీ స్నాక్స్ తీసుకోవడం వల్ల, అలసట, నీరం తగ్గుతుంది. కాంప్లెక్స్ కార్బో హైడ్రేట్స్ అధికంగా ఉండే ఆహారాలను స్నాక్స్ గా తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అధికంగా ఉన్న ఆహారాలు, స్నాక్స్ తీసుకోవడం వల్ల ఫీటస్ కు పోషణను అందిస్తుంది. ఎనర్జీ బూస్టర్ గా పనిచేస్తుంది. క్రాకర్స్, ఫ్రెష్ ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవడం మంచిది.

వాటర్ :

వాటర్ :

గర్భధారణ సమయంలో ఇన్ స్టాంట్ గా, నేచురల్ గా ఎనర్జీ లెవల్స్ పెరగాలంటే వాటర్ ఎక్కువగా తాగాలి. డీహైడ్రేషన్ వల్ల అలసట, ఇరిటేష్ పెరుగుతుంది. కాబట్టి రోజుకు సరిపడా నీళ్ళు ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో రక్తం, ఆక్సిజన్ సప్లే మెరుగుపడుతుంది. దాంతో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి.

పండ్లు :

పండ్లు :

గర్భిణీలు ఫ్రెష్ ఫ్రూట్స్ తినడం వల్ల శరీరంలో ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. ప్రసవానికి కావల్సిన ఎనర్జీని పొందడానికి గర్భం పొందిన సమయం నుండి ఫ్రెష్ ఫ్రూట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

సన్నీ వాక్ :

సన్నీ వాక్ :

శరీరంలో ఎనర్జీ వెల్స్ పెరగాలంటే శరీరానికి విటిమన్ డి కూడా అవసరం అవుతుంది. విటమిన్ డిని ఎండ ద్వారా పొందుతారు. కాబట్టి రోజూ కొంత సమయం ఎండలో(ఉదయం లేత కిరణాలు పడే సమయంలో)మంచిది. ఎండలో చిన్న పాటి నడక లేదా ఎండలో కొద్ది సమయం కూర్చోవడం చేయాలి. ఇలా చేయడం వల్ల శరీరానికి కావల్సిన విటమిన్ డి అందిస్తుంది.

చిన్న పాటి వ్యాయామాలు:

చిన్న పాటి వ్యాయామాలు:

ఎక్కువ అలసటా ఉన్నప్పుడు, ఒక గ్లాసు నీళ్ళు తాగడంతో పాటు, కొన్ని చిన్న పాటి వ్యాయామాలు చేయడం వల్ల మజిల్స్ కదలికల వల్ల బాడీ మొత్తం రక్తప్రసరణను మెరుగుపడుతుంది. అంతే కాదు గర్భధారణ సమయంలో యాక్టివ్ గా కనబడుతారు.

ప్రశాంతత:

ప్రశాంతత:

గర్భం పొందిన తర్వాత ఎప్పుడూ అసటగా, వీక్ గా ఉన్నట్లు అనిపిస్తే, నేచురల్ గా ఎనర్జీ లెవల్స్ పెంచుకోవాలంటే, మెడిటేషన్,యోగా వంటివి చేయాలి. మెడిటేషన్ వల్ల అలసట తగ్గుతుంది.

వెయిట్ కంట్రోల్ :

వెయిట్ కంట్రోల్ :

గర్భాధారణ కాలంలో చిన్న పాటి వ్యాయామాల వల్ల , గర్భధారణ సమయంలో కూడా బరువు కంట్రోల్లో ఉంటుంది. గర్భం పొందిన తర్వాత కొంత బరువు పెరగడం సహజం అలాగని ఎక్కువ పౌండ్ల బరువు పెంచుకుంటే హెల్త్ రిస్క్ ఉంటుంది. ప్రసవం కష్టం అవుతుంది. తల్లి అధిక బరువు వల్ల బేబీ గ్రోత్ మీద ప్రభావం చూసుతుంది. కాబట్టి, గర్భాధారణ సమయంలో హెల్తీ ప్రెగ్నెన్సీని మెయింటైన్ చేయడం మంచిది.

డైట్ చాలా ముఖ్యం:

డైట్ చాలా ముఖ్యం:

గర్భధారణ సమయంలో హెల్తీగా మరియు ఫిట్ గా ఉండాలంటే హెల్తీ డైట్ ను ఫాలో అవ్వాలి. హెల్తీగా ఉన్నప్పుడు, అలసట పొందరు. రెగ్యులర్ డైట్ లో ఫ్రెష్ వెజిటేబుల్స్, గ్రీన్ కలర్ వెజిటేబుల్స్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల ఎనర్జీ బూస్టర్ గా సహాయపడుతాయి .

English summary

10 Ways to Boost Your Energy During Pregnancy

During pregnancy, every woman faces certain common problems. Getting tired is the first thing a woman experiences during pregnancy and the best way to beat the mood is to consume a list of healthy foods. But here are some other ways to boost your energy levels during pregnancy...
Desktop Bottom Promotion