For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నన్సీ టైంలో డయేరియా నివారించే ఎఫెక్టివ్ హోం రెమిడీస్

ప్రెగ్నన్సీ టైంలో డయేరియా సమస్యకు హార్మోనల్ చేంజెస్ కారణంగా జీర్ణక్రియ ఫంక్షన్ లో మార్పుల కారణంగా వస్తుంది. డైట్ లో మార్పులు, ఒత్తిడి కూడా డయేరియాకి కారణమవుతుంది.

By Swathi
|

మీరు త్వరలో తల్లి కాబోతున్నారా ? అయితే డయేరియా అనేది కామన్ గా కనిపించే సమస్య. ఒకవేళ మీరు ఈ సమస్యతో బాధపడుతుంటే.. కొన్ని సింపుల్ టిప్స్ ఉన్నాయి. ఇవి ప్రెగ్నన్సీ టైంలో డయేరియా నివారించడానికి ఎఫెక్టివ్ గా సహాయపడతాయి.

ప్రెగ్నన్సీ టైంలో మహిళలు రకరకాల లక్షణాలు కనిపిస్తాయి. హార్మోనల్ చేంజెస్,శరీరంలో రకరకాల మార్పులు కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటు డయేరియా, కాన్ట్సిపేషన్, వాంతులు, వికారం అనేది చాలా సాధారణంగా కనిపించే సమస్యలు.

diarreah

గర్భిణీ మహిళల శరీరం 9నెలలపాటు శిశువు పెరుగుదల కోసం.. పోషణ అందిస్తుంది. దీంతో న్యాచురల్ గా హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయి. ఆమె శరీరం పెద్దగా మారుతుంది. ముఖ్యంగా హిప్ చుట్టూ, పొట్ట భాగంలో శరీరం ఎక్కువ పెరుగుతుంది.

చాలామంది గర్భిణీ స్త్రీలలో మార్నింగ్ సిక్ నెస్, వికారం, బరువు పెరగడం వంటి లక్షణాలు గర్భం పొందిన మొదట్లో ఎదుర్కొనే సమస్యలు. డయేరియా కూడా.. చాలామందిలో కనిపించే సమస్య. ముఖ్యంగా ఫస్ట్, సెకండ్ ట్రైమ్ స్టర్స్ లో.. డయేరియా సమస్య కనిపిస్తుంది.

ప్రెగ్నన్సీ టైంలో డయేరియా సమస్యకు హార్మోనల్ చేంజెస్ కారణంగా జీర్ణక్రియ ఫంక్షన్ లో మార్పుల కారణంగా వస్తుంది. డైట్ లో మార్పులు, ఒత్తిడి కూడా డయేరియాకి కారణమవుతుంది. అయితే దీన్ని నివారించే చాలా సింపుల్ హోం రెమెడీస్ మీకు సహాయపడతాయి.

stay hydrated

హైడ్రేట్ గా ఉండటం
డయేరియా సమస్యతో బాధపడే గర్బిణీ స్త్రీలు... ఖచ్చితంగా సరిపడా ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. అయితే ప్రెగ్నన్సీ టైంలో డీహైడ్రేషన్ కి దూరంగా ఉండటం చాలా అవసరం. లేదంటే బేబీపై దుష్ప్రభావం చూపుతుంది. గర్భిణీల శరీరంలో ఎలక్ట్రోలైట్స్ కోల్పోవడం వల్ల డయేరియా సమస్య వస్తుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తీసుకోవాలి. అప్పుడే మినరల్స్ శరీరం కోల్పోకుండా ఉంటుంది.

diet

డైట్
ప్రెగ్నన్సీ టైంలో డయేరియా చాలా డేంజరస్. ఎందుకంటే మినరల్స్ కోల్పోవడం, డీహైడ్రేషన్ వల్ల డయేరియా సమస్య ఎదురై.. తల్లీ, బిడ్డకు హాని చేస్తుంది. కాబట్టి.. ఒకవేళ ప్రెగ్నన్సీ టైంలో డయేరియాతో బాధపడుతుంటే.. హెల్తీ ఫుడ్ తీసుకోవడం అవసరం. అన్ హెల్తీ డైట్ సమస్యను మరింత తీవ్రం చేస్తుంది. హెల్తీ ఫుడ్స్, ఫ్రూట్ జ్యూస్ లు తీసుకోవడం వల్ల డయేరియా నుంచి ఉపశమనం పొందవచ్చు.

diarrhea during pregnancy

డాక్టర్ ని సంప్రదించడం
రెండుమూడు రోజులైనా డయేరియా తగ్గకపోతే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్ ని సంప్రదించాలి. ఫ్లూయిడ్స్, ఎలక్ట్రోలైట్స్ శరీరం కోల్పోతే.. అబార్షన్ వంటి సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి.. సరైన సమయంలో చికిత్స అవసరం. డాక్టర్ ని సంప్రదించి వెంటనే సరైన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

English summary

3 Best Tips To Deal With Diarrhea During Pregnancy

3 Best Tips To Deal With Diarrhea During Pregnancy. Suffering from diarrhea during pregnancy? If yes, then follow these tips!
Story first published: Thursday, December 1, 2016, 10:52 [IST]
Desktop Bottom Promotion