Latest Updates
-
గోళ్లు బలంగా, అందంగా ఉండాలంటే.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
లక్ష్మణ రేఖ వద్దు, కెమికల్ స్ప్రేలు వద్దు..వంటగదిలో చీమలను తరిమికొట్టే చిట్కా! -
ఈ ఫ్రూట్స్ తింటున్నారా.. కిడ్నీలో రాళ్లు ఉన్నవారు ఒక్కసారి వీటి రేటింగ్స్ తెలుసుకుంటే బెటర్.! -
శుక్రవారం ఈ పూజలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట.. ఇంట్లో ధనం, శుభం పెరుగుతాయా? -
Viral Video: నైట్ మార్కెట్ లో టవల్ కట్టి డాన్స్ చేసిన మహిళ..ఊడిపోతున్నా కూడా.. -
బ్యూటీ పార్లర్‌కి వెళ్లే పనిలేదు.. పాతకాలం టిప్స్‌తో మృదువైన జుట్టు, మెరిసే ముఖం మీ సొంతం.! -
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు!
ప్రెగ్నెన్సీ సమయంలో బాధించే మొటిమల నివారణకు 3 సులభ మార్గాలు
మహిళ జీవితంలో అత్యంత అందమైన , సంతోషకరమైన క్షణాలు ప్రెగ్నెన్సీ! బిడ్డకు జన్మనివ్వడం అద్భుతం, మహిళకు సంపూర్ణ పరిపూర్ణత సాధించే ఆ క్షణాలు ప్రతి ఒక్క మహిళ జీవితంలో మదురైన ఘట్టం.
మహిళ గర్భం పొందిన తర్వాత వారి జీవితంలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. ఇంటర్నల్ గా మరియు ఎక్సటర్నల్ గా అనేక మార్పులు జరుగుతాయి. ఎక్సటర్నల్ గా మొటిమలు మరిు మచ్చలు, స్కార్స్ ఏర్పడుతాయి. కాబోయే తల్లి త్వరలో బడ్డకు జన్మనివ్వబోతున్న తల్లుల కోసం, వారి గర్భధారణ కాలంలో ఎలాంటి మార్పులు చేసుకుంటాయన్న విషయం మీద చిన్న ప్రశ్న , జవాబుల్లాంటి విషయాలను ఈ క్రింది విధంగా వివరించడం జరిగింది?

మొటిమలు ఎక్కువగా ఎవరికి వస్తుంటాయి?
గర్భధారణ సమయంలో ప్రతి ఇద్దరి గర్భిణీ స్త్రీలో ఒకరు ఖచ్చితంగా మొటిమల సమస్యను ఎదుర్కుంటుంటారు. చాలా మంది అనుభవం ప్రకారం, మొటిమల కారణంగా స్కిన్ కాంప్లెక్షన్ సమస్యలు ఏర్పడుతాయని కనుగొన్నారు. గర్భం దాల్చక ముందు మొటిమలు మరియు మచ్చల సమస్యలున్నారు. గర్భధారణ కాలంలో మరింత ఎక్కువగా ఇవి బాధిస్తుంటాయి.

మొటిమలు ఎప్పుడు వస్తాయి?
మొటిమలు లేదా మచ్చలు మొదటి త్రైమాసికంలో ఏర్పడి, మూడవ త్రైమాసికం కనబడకుండా పోతాయి. మొదటి త్రైమాసికంలో మొటిమలు రాకపోతే, తర్వాత రెండు త్రైమాసికంలో మొటిమలు ఏర్పడే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. సాధారణంగా మొదటి త్రైమాసికంలో , శరీరంలో హార్మోనుల అసమతుల్యతల వల్ల మొటిమల సమస్యకు దారితీస్తుంది. వీటితో పాటు మరికొన్ని మార్పులు కూడా చోటు చేసుకుంటాయి.

మొటిమలు మరియు మచ్చలకు ముఖ్యకారణాలు:
మొటిమలు మరియు మచ్చలకు ముఖ్య కారణం హార్మోనుల అసమతుల్యత. మొదట, యవ్వనారంభ దశలో ప్రతి ఒక్కరూ హార్మోనుల అసమతుల్యత వల్ల మొటిమల ఏర్పడటానికి అది ఒక సమయం. అదే విధంగా , గర్భం పొందే వారిలో కూడా హార్మోనుల మార్పుల వల్ల మొటిమలకు కారణమవుతుంది.

కాబట్టి, గర్భధారణ ప్రారంభ దశలో వచ్చే మొటిమలను ఎలా నివారించాలి? ఎలా దూరం చేసుకోవాలి?
గర్భధారణ ప్రారంభ దలో మొటిమలు చాలా తక్కువగా ప్రారంభమై, తర్వాత ఎక్కువ అవుతాయి. . కాబట్టి, ఇలాంటి సమయంలో మీరేం చేయాల్సిన పనిలేదు. అవి వచ్చి నా వాటంతటవే వెళ్లిపోతాయి. కానీ మొటిమలు ఎక్కువైతే మాత్రం వెంటనే డాక్టర్ ను కలవడం వల్ల తగిన సలహాలు , సూచనలిస్తారు. మొటిమలు, మరియు మచ్చలకు ఉపయోగించే మెడికేషన్స్ ఎక్సటర్నల్ గా మరియు ఇంటర్నల్ గా పిల్స్ వాడటం వల్ల పుట్టబోయే బిడ్డలో సమస్యలకు కారణమవుతుంది. మెడికేషన్ మరియు క్రీముల వల్ల పుట్టే బిడ్డలో కొన్ని లోపాలకు గురిచేస్తుంది. కాబట్టి, ఎప్పుడూ డాక్టర్ తప్పనిసరిగా కలవాలి.

గర్భధారణ కాలంలో మొటిమలను నేచురల్ గానే తగ్గించుకోవచ్చు..
గర్భధారణ సమయంలో మొటిమలు మచ్చలు రెగ్యులర్ గా బాధిస్తుంటే, వాటి నివారణకోసం 3 సులభమైన ఎఫెక్టివ్ హోం రెమెడీ , ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని రెగ్యులర్ గా ఉపయోగించడం వల్ల మొటిమలు నివారించబడుతాయి, బేబీకి కూడా సురక్షితం..

నిమ్మ:
నిమ్మరసం మొటిమలను నివారించడంలో నేచురల్ పదార్థం. అందుకే దీన్ని వివిధ రకాల మొటిమల నివారణ ఉత్పత్తుల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నిమ్మరసంను గాలి చొరబడని డబ్బలో నిల్వ చేసుకుని రాత్రి పడుకునే ముందు మొటిమల మీద మాత్రమే అప్లై చేయాలి . ఫ్రెష్ గా ఉండే నిమ్మరసం చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది, కొద్ది నీరువేసి మిక్స్ చేసి మొటిమల మీద మాత్రమే అప్లై చేయాలి.

అలోవెర:
అలోవెర జెల్ వండర్ ఫుల్ నేచురల్ రెమెడీ, ఇది వివిధ రకాల చర్మసమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అలోవెరజెల్ మొటిమలను మరియు మచ్చలను ఎఫెక్టివ్ గా తగ్గిస్తుంది.

ఎసెన్సియల్ ఆయిల్స్ :
ఎసెన్సియల్ ఆయిల్స్ లో ల్యావెండర్ ఆయిల్, టీట్రీ ఆయిల్ వంటివి మొటిమలు మచ్చలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. ఒక్కొక్కరిలో ఒక రకమైన చర్మ తత్వం కలిగి ఉంటారు. ఇతరులకు పనిచేసేటివి మరొకరికి పనిచేయకపోవచ్చు. కాబట్టి, కొన్ని ట్రిక్స్ ఉపయోగించి మొటిమలను నివారించుకోవాలి. మొటిమలను గిల్లడం, గోకడం , పదే పదే ముట్టడం చేయకూడదు. చర్మంను క్లియర్ గా ఉంచుకోవాలి.



Click it and Unblock the Notifications