Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
బర్త్ కంట్రోల్ పిల్స్ వాడే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఒకప్పుడు చదువు, ఉద్యోగం, పెళ్లి, పిల్లలు.. ఇది లైఫ్ సైకిల్. పెళ్లైన వెంటనే.. పిల్లలు ఎప్పుడూ అంటూ.. కొత్త జంటను కలవరపెడుతూ ఉంటారు. పెళ్లి తర్వాత పిల్లలే నెక్ట్స్ ప్లాన్ గా ఉండేది. కానీ ప్రస్తుత జనరేషన్ లో పెళ్లి తర్వాత ఎంజాయ్ చేయాలని చాలా మంది కోరుకుంటున్నారు. పెళ్లైన వెంటనే పిల్లలతో బరువు బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. కొన్ని రోజులు కొత్త జీవితాన్ని ఫ్రీగా ఎంజాయ్ చేశాకే.. పిల్లల బాధ్యత తీసుకోవాలని చాలామంది ప్లాన్ చేసుకుంటున్నారు.
పొట్టలో ఉన్నది అబ్బాయా ? అమ్మాయా ? తెలుసుకోవడం ఎలా ?
పిల్లల బాధ్యతను పోస్ట్ పోన్ చేసుకోవడానికి చాలామంది బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకుంటూ ఉంటారు. గర్భం నిలబడకుండా.. అవాంఛిత గర్భాన్ని తొలగించడానికి ఇదో సులువైన మార్గంగా మారింది. కానీ ఈ బర్త్ కంట్రోల్ పిల్స్ పై చాలా అపోహలు, అనుమానాలూ ఉన్నాయి. ఈ మాత్రలు తీసుకోవడం ఎలాంటి ప్రమాదం లేదని చాలా మంది చెబుతూ ఉంటారు. కానీ.. ఈ మాత్రలు ఒక్కొక్కరిపై ఒక్కోలా ప్రభావం చూపుతాయి. వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కలుగుతాయంటున్నారు నిపుణులు. కాబట్టి బర్త్ కంట్రోల్ పిల్స్ తీసుకునే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి.

1. గర్భస్రావం సవ్యంగా జరిగే సమయంలో ఈ మాత్రల రసాయన ప్రభావం ఉంటుంది. ఇది గర్భస్రావం తేలికగా జరగడానికి సహాయపడతాయి. అయితే కొన్ని సందర్భాల్లో వికటించే ప్రమాదమూ ఉంది.
2. ఆస్తమా, డయాబెటిస్, అనీమియా వంటి వ్యాధులు ఉన్నవాళ్లు బర్త్ కంట్రోల్ పిల్స్ వాడకూడదు. అలాగే హెచ్ఐవి ఉన్నవాళ్లు, పొగతాగే అలవాటు ఉన్నవాళ్లకు కూడా ఇవి మంచిది కాదు.
3. ఒకవేళ బర్త్ కంట్రోల్ పిల్స్ వాడే సమయంలో ఎక్కువ రక్తస్రావం అవుతుంటే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. లేదంటే.. దుష్ర్పభావాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక్కోసారి గర్భస్రావ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయి.. ఆ బ్యాక్టీరియా గర్భంలో మిగిలిపోయి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలున్నాయి.
4. కొన్ని సందర్భాల్లో కొంతమంది విషయంలో గర్భస్రావ మాత్రలు మరింత ప్రమాదకరం. ఎందుకంటే.. ఇవి వికటిస్తే.. ఫ్యూచర్ లో మళ్లీ గర్భం ధరించే అవకాశం కూడా కోల్పోయే అవకాశముంది. ఆడవాళ్లు శారీరకంగా, మానసికంగా ఒత్తిడికి గురికావాల్సి వస్తుంది.
5. బర్త్ కంట్రోల్ పిల్స్ వాడాలి అనుకున్నప్పుడు.. మీ ఫ్యామిలీ డాక్టర్ ని సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే.. వాళ్లకైతే.. మీ స్టామినా, మీ శరీరతత్వం, మీ శరరానికి ఎలా పనిచేస్తాయి అన్న విషయం తెలుస్తుంది. కాబట్టి మీకు హాని జరిగే విషయమైతే ముందుగానే హెచ్చరిస్తారు.
6. బర్త్ కంట్రోల్ పిల్స్ వికటిస్తే.. అనవసర సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఫాలోపియన్ ట్యూబ్ ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఫ్యూచర్ లో పుట్టబోయే బిడ్డపై దుష్ర్పభావం కలుగుతుంది. కాబట్టి గర్భస్రావ మాత్రలు ఉపయోగించే ముందు ఒకసారి డాక్టర్ ని సంప్రదించి తగు జాగ్రత్తలు తీసుకోవాలి.



Click it and Unblock the Notifications