Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
త్వరగా గర్బం పొందడానికి 7 సూపర్ ఫుడ్స్
పెళ్లైన ప్రతి ఒక్క మహిళా కోరుకొనేది పిల్లలు కావాలని, కోరుకుంటారు. గతంలో ఆడపిల్లలకు 18నుండి 20ఏళ్ల లోపు పెళ్ళిళ్లు జరిగేవి. ఆవయస్సులో వారికి ఎటువంటి ఒత్తిడి ఉండకపోవడం, నిండు ఆరోగ్యంగా ఉండటం వల్ల వెంటవెంటనే పిల్లలు కలిగే వారు. కానీ, ప్రస్తుత మోడ్రన్ ప్రపంచంలో అబ్బాయిలతో పాటు అమ్మాయిలు ఎక్కువ చదువులు, కెరీర్ , ఉద్యోగం, అంటూ పెళ్లి వాయిదా వేయడం వల్ల వయస్సు ఎక్కువ అవ్వడం, సరైన టైమ్ కు పెళ్లికాకపోవడం ఒక సమస్య అయితే, ఒత్తిడితో కూడిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, ఆరోగ్యం మీద, మహిళల్లో ప్రత్యుత్పత్తి మీద ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి.
అయితే, మహిళ ఎప్పుడైతే గర్భం పొందడం కష్టంగా భావిస్తుందో, అప్పుడు అది సవాలుగా తీసుకోవాలి. చాలా వరకూ నిపుణుల అంచనా ప్రకారం మహిళలు సరైన ఆహారంను తీసుకోవడం వల్ల చాలా సింపుల్ గా ఎఫెక్టివ్ గా ఈ సమస్య నుండి భయటపడవచ్చని తెలుపుతున్నారు. ఈ ఆహారాలు హార్మోనుల అసమతుల్యతను క్రమబద్దం చేయడం మాత్రమే కాదు, మహిళ త్వరగా గర్బం పొందడానికి కూడా సహాయపడుతుంది . అందుకు సహాయపడే కొన్ని టాప్ 7 ఫెర్టిలిటి ఫుడ్స్ ను డైటీషియన్ మరియు పోషకాహార నిపుణులైన డాక్టర్ నేహా సాన్ వాల్కా తెలుపుతున్నారు, గర్భం పొందాలని కోరుకొనే ప్రతి ఒక్క మహిళ వారి రెగ్యులర్ డైట్ లో వీటిని తప్పకుండా చేర్చుకోవాలని సూచిస్తున్నారు. మరి ఆహారాలేంటో ఒకసారి చూద్దామా...

1. గ్రీన్ టీఫీ వెజిటేబుల్స్ :
డాక్టర్ నేహా అభిప్రాయం ప్రకారం ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలంగా ఉన్న గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ తీసుకోవడం వల్ల, ఒక బలమైన ఎండోమెట్రియల్ లైనింగ్ ఏర్పడుతుందని (యూట్రస్ యొక్క లోపని పొర) , ఐరన్ అండం ఈ పొరకు బలంగా అంటిపెట్టుకోవడానికి సహాయపడుతుందని తెలుపుతున్నారు.
2. బ్రొకోలి: గర్బం పొందాలని కోరుకొనే మహిళలకు ఇది ఒక సూపర్ ఫుడ్ గా సూచిస్తారు . ఎందుకంటే ఇందులో ఫోలిక్ యాసిడ్, మరియు అత్యధిక పోషకాంశాలుండుటం వల్ల ఇది ఒక పుష్కలమైన ఆహారంగా భావిస్తారు. అంతే కాదు ఇందులో ఇంకా, విటమిన్ సి ఎక్కువగా ఉండే, ఓవెరీస్ లో అండం ఉత్పత్తి అవ్వడానికి ఓవెలేషన్ కొరకు సహాయపడుతాయి.

3. బంగాళదుంపలు: గర్భం పొందాలనే ప్రతి మహిళా కోరుకుంటుంది, గర్భం కోసం ప్రయత్నించే వారు, వారి రెగ్యులర్ డైట్ లో బేక్ చేసిన బంగాళదుంపలను చేర్చుకోవాలి. బంగాళదుంపలో విటమిన్ బి మరియు విటమిన్ ఇ, పుష్కలంగా ఉండటం వల్ల ఇది కణాల యొక్క ఉత్పత్తిని పెంచి, ఆరోగ్యకరమైన ఓవమ్ ను ఉత్పత్తి చేయడానికి సహాయపడుతుంది.
4. పండ్లు: గర్భం పొందడానికి సహాయపడే పండ్లను తప్పనిసరిగా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

5. సిట్రస్ పండ్లు: పండ్లు ప్రతి ఒక్క మహిళ ఆరోగ్యంలో అత్యంత ప్రధానమైన ఆహారం . గర్భం పొందడానికి తయారుచేసే డైట్ ప్లాన్ లో తప్పనిసరిగా ఉండాల్సిన ఆహారాల్లో పండ్లు అత్యంత ముఖ్యమైనవి. విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవడం వల్ల ఓవరీస్ లోకి అండం విడుదల అవ్వడానికి సహాయపడుతుంది.
6. దానిమ్మ: దానిమ్మల్లో గొప్ప ఆరోగ్యప్రయోజనాలు కలిగి ఉండటంతో పాటు, మహిళలు మరియు పురుషుల్లో అవసరమనంత సెక్స్ హార్మోనులను పెంచుతుంది.

7. అరటి పండ్లు: ఎవరికైతే రుతుక్రమంలో ఎటువంటి సమస్యలుండవో అటువంటి వారిలో రిస్క్ చాలా తక్కువగా ఉంటుంది మరియు గర్భం పొందడం సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందువల్ల, గర్భం పొందాలని కోరుకొనే వారు విటమిన్ బి6 అధికంగా ఉండే అరటిపండ్లను రెగ్యులర్ గా తీసుకోవడం చాలా అవసరం. గర్భం పొందాలని కోరుకొనే మహిళలు, అరటి పండ్లను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రుతుక్రమం కరెక్ట్ గా వస్తుంది, మరియు ఫెర్టిలిటిని మెరుగుపరుస్తుంది.



Click it and Unblock the Notifications