For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారు ఖచ్చితంగా మానుకోవల్సి కొన్ని అలవాట్లు..!

|

బేబి కోసం ప్రయత్నిస్తున్నారా..? మీ సమాధానం అవును అన్నట్లైతే.. అప్పుడు మీరు ప్రెగ్నెన్సీకోసం మానసికంగా మరియు శారీరకంగా రెడీగా ఉండాలి. అలా ఉండాలంటే మంచి పౌష్టకాహారంను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. రెగ్యులర్ వ్యాయామాలు చేయాలి. అధిక బరువు ఉన్నవారైతే బరవు తగ్గంచుకోవాలి. ఇంకా కొంత మంది కొన్నిచెడు అలవాట్లు కలిగి ఉంటారు. వాటిని మానుకోవాలి.

మహిళ జీవితంలో గర్భధారణ అనేది చాలా సున్నితమైన అంశం. మహిళ గర్భం పొందితే ఇంటర్నల్ గా ను మరియు ఎక్సటర్నల్ గాను ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. గర్భధారణ సమసయంలో మహిళ శరీరం మరో ప్రాణికి సరైన స్థలంను పొట్టలో ఏర్పాటు చేస్తుంది. బేబీ పెరిగే కొద్ది, నెలలు నిండే కొద్ది పుట్టబోయే బిడ్డకు తగిన పోషకాలు అవసరం అవుతాయి. ఇవి పొట్టలో ఉన్న బేబీకి రక్షణ కల్పిస్తాయి . హెల్తీ గ్రోత్ ను ప్రోత్సహిస్తాయి.

ఇవన్నీ హెల్తీగా జరగాలంటే, గర్భిణీ స్త్రీ ఆరోగ్యంగా ఉండాలి. గర్భిణీల ఆరోగ్య స్థిని, లైఫ్ స్టైల్ ను బట్టి, బిడ్డ ఆరోగ్య ఆధారపడి ఉంటుంది. అందుకు హెల్తీ డైట్ ను ఫాలో అవ్వడంతో పాటు, వ్యాయామం చేయడం,రెగ్యులర్ డైట్ లో ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్ , డ్రై ఫ్రూట్స్ చేర్చుకోవడం వల్ల హెల్తీ ప్రెగ్నెన్సీని పొందుతారు. ఇంకా హెల్తీ ప్రెగ్నెన్సీ పొందాలంటే కొన్ని అలవాట్లకు దూరంగా ఉండాలి. కొన్ని చెడు అలవాట్ల వల్ల గర్భిణీ స్త్రీలకు మాత్రమే కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా హాని కలిగిస్తుంది.

ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకుంటున్న వారు, ఈ క్రింద తెలిపిన చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి..

స్మోకింగ్

స్మోకింగ్

ప్రెగ్నెన్సీకి ముందు స్మోకింగ్ అలవాటు ఉన్నట్లైతే అది మహిళ ఆరోగ్యం మీద మాత్రమే కాదు, పుట్టబోయే బిడ్డలో ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుంది. స్మోకింగ్ వల్ల గర్భం ధరించడం కూడా కష్టమవుతుంది.

ఆల్కహాల్

ఆల్కహాల్

గర్భం పొందడానికి ముందే ఆల్కహాల్ అలవాటును మానేయాలి. గర్భధారణ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, ఇది ఖచ్చితంగా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. గర్భస్రావానికి కారణమవుతుంది. అంతే కాదు, ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ కు దారితీస్తుంది.

 కొన్ని మందులు

కొన్ని మందులు

గర్భం పొందడానికి ముందు మానుకోవల్సిన మరో అలవాటు కొన్ని పిల్స్ ను తీసుకోవడం మానేయాలి. కొన్ని రకాల మెడికేషన్స్ ప్రెగ్నెన్సీకి హాని కలిగిస్తాయి. ప్రెగ్నెన్సీ ప్లానింగ్ లో ఉన్నవారు, ఏలాంటి మెడిసిన్స్ తీసుకోవాలన్నా, డాక్టర్ ను సంప్రధించాలి.

కెఫిన్

కెఫిన్

రీసెర్చ్ ప్రకారం కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, ఎనర్జీ డ్రింక్స్ తాగడం వల్ల గర్భస్రావం మరియు ప్రీమెచ్యుర్ బర్త్ ను సమస్యలను పెంచుతుంది. కాబట్టి, కెఫిన్ కు దూరంగా ఉండటం మంచిది.

షుగర్ ఫుడ్స్

షుగర్ ఫుడ్స్

గర్భం పొందడానికి ముందు మానుకోవల్సిన మరో అలవాటు షుగర్ ఫుడ్స్, ఈ అలవాటు వల్ల తల్లి మరియు బిడ్డలో డయాబెటిక్ రిస్క్ పెరుగుతుంది.

ఓవర్ ఎక్సర్ సైజ్

ఓవర్ ఎక్సర్ సైజ్

ఫిట్ నెస్ కోసం కొంత మంది ఓవర్ ఎక్సర్ సైజ్ లు చేస్తుంటారు. ఈ అలవాటు వల్ల తల్లి బిడ్డకు ప్రమాధం కలిగిస్తుంది. గర్భస్రావానికి దారితీస్తుంది.

స్ట్రెస్

స్ట్రెస్

ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారు మొదట స్ట్రెస్ తగ్గించుకోవాలి. స్ట్రెస్ వల్ల గర్భం పొందడం కష్టమౌతుంది. స్ట్రెస్ వల్ల హార్మోనుల్లో అసమతుల్యతలు ఏర్పడటు వల్ల గర్భం పొందడం కష్టం అవుతుంది.

English summary

7 Bad Habits To Stop Before Getting Pregnant

7 Bad Habits To Stop Before Getting Pregnant,Are you a woman who is planning on having a baby in the near future? If yes, then you need to prepare your body for pregnancy and childbirth and so, you need to quit a few bad habits before pregnancy.
Story first published: Friday, September 16, 2016, 11:08 [IST]
Desktop Bottom Promotion