Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
గర్భిణీ స్త్రీ శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు...
గర్భధారణ సమయంలో గర్భిణీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అనుకోకుండా జరిగే మార్పులు కొంత మంది ఇష్టపడుతారు, కొంత మంది చాలా ఇబ్బందిగా ఫీలవుతారు. అలాంటి వాటిలో స్కిన్ పిగ్మెంటేషన్ అంటే ఎవ్వరూ పూర్తిగా ఇష్టపడరు.
గర్భిణీలో ఉత్పత్తి అయ్యే హార్మోనులు ఎక్కువగా స్కిన్ మరియు హెయిర్ మరియు శరీరంలో ఇతర భాగాల మీద ఎక్కువగా ప్రభావం చూపుతాయి . అలా గర్భిణీ స్త్రీలో ఉత్పత్తి అయ్యే హార్మోనుల్లో ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజె మొదలగునవి గర్భిణీ శరీరంలో చాలా మార్పులను తీసుకొస్తాయి . ముఖ్యంగా ఈ హార్మోన్స్ వల్ల బేబీ పొట్టలో 9నెలల పాటు ఆరోగ్యంగా ఉంటుంది.
హార్మోనుల ప్రభావం వల్ల కొంత మంది మహిళల్లో చర్మంలో అద్భుత మార్పలు వస్తాయి. ముఖ్యంగా చర్మం మెరుస్తుంటుంది మరియు కొంత మందిలో చర్మం డ్రైగా మారడం, దురద కలిగించడానికి కారణం అవుతుంది . అది శరీరంలో ఉత్పత్తి అయ్యే హార్మోనుల రియాక్షన్ బట్టి ఆధారపడి ఉంటుంది.
ఇంకా కొంత మంది మహిళల్లో జుట్టు ఒత్తుగా మరియు స్ట్రాంగ్ గా పెరుగుతుంది. గర్భిణీ స్త్రీలలో చాలా తక్కువ హెయిర్ ఫాల్ ఉంటుంది . కానీ, గర్భధారణ సమయం పూర్తై, ప్రసవించిన తర్వాత ఎక్కువ జుట్టు రాలడం జరుగుతుంది.
ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ యొక్క శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. అలాంటి మార్పులను చూడటమంటే చాలా క్రేజీగా ఉంటుంది. అయితే ఈ మార్పులు ఒక్కో స్త్రీలో , ఒక్కోవిధంగా ఉంటుంది. గర్భిణీ స్త్రీల బాడీలో జరిగే ఇలాంటి క్రేజీ థింగ్స్ ఏంటో తెలుసుకోవాలంటే ఈ క్రింది స్లైడ్ క్లిక్ చేయాల్సిందే...

1. స్ట్రాంగ్ అండ్ షైనీ హెయిర్:
గర్భధారణ సమయంలో జుట్టు ఒత్తుగా , షైనీగా మరియు ఫాస్ట్ గా పెరుగుతుంది మరియు ఈసమయంలో జుట్టు రాలే సమస్య ఉండదు. అందుకు ముఖ్య కారణం గర్భిణీస్త్రీలో ప్రొజెస్టిరాన్ అనే హార్మోను ఎక్కువగా స్రవించడం వల్ల , ఇది బేబీకి మాత్రం అందడం మాత్రమే కాదు, మంచి, ఆరోగ్యకరమైన జుట్టును తల్లి పొందేలా చేస్తుంది.

2. బ్రెస్ట్ మరియు నిప్పల్స్ పెద్దగా అవుతాయి:
ప్రెగ్నెన్సీ సమయంలో , బ్రెస్ట్ కు రక్తప్రసరణ పెరుగుతుంది. ఇతర హార్మోనుల కారణంగా బ్రెస్ట్ పెరుగుతుంది . బ్రెస్ట్ సైజ్ పెరగడంతో పాటు నిప్పల్ సైజ్ పెరుగుతుంది . నిప్పల్ డార్క్ కలర్లోకి మారుతాయి. రొమ్ముల్లో సలుపు మొదలవుతుంది, నొప్పి ఎక్కువగా ఉంటుంది. మొదట త్రైమాసికం పూర్తి అవ్వగానే ఇది తగ్గిపోతుంది.

3. చర్మం బ్యూటిఫుల్ గా మారుతుంది:
కొంత మంది మహిళల్లో చర్మం మరింతగా మెరుస్తుంటుంది. గర్భాధారణ సమయంలో స్రవించే ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్ హార్మోనులు చర్మం మీద ఎక్కువ ప్రభావం చూపి, చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. మరికొంత మందిలో రివర్స్ చేస్తుంది. పింపుల్స్, మచ్చలు, డ్రైస్కిన్ , స్కిన్ అలర్జీలకు గురిచేస్తుంది .

4. చర్మంలో అవాంఛిత రోమాలు:
గర్భధారణ సమయంలో గడ్డం, బుగ్గలు, పైపెదవి, చెవుల దగ్గర, కాళ్ళ మీద, బహుమూలల్లో మరియు పొట్టమీద కూడా అవాంఛిత రోమాలు ఏర్పడుతాయి. అందుకు ముఖ్య కారణం గర్భిణీలో ఆండ్రోజన్ అనే మేల్ హార్మోన్స్ ఎక్కువగా స్రవించడం వల్ల ఇలా జరుగుతుంది,.

5. లాంగ్ అండ్ స్ట్రాంగ్ నెయిల్స్:
బాడీలో అనేక మార్పులో ఇది కూడా ఒకటి. గోళ్ళు వేగంగా మరియు స్ట్రాంగ్ గా పెరుగుతాయి . అదే విధంగా కొంత మంది వ్యతిరేఖంగా ఉంటుంది. మరికొంత మందిలో వీక్ నెయిల్స్, పెళుసుగా విరిగిపోట్లుండే నెయిల్స్ పెరుగుతాయి .

6. పాదాలు పెద్దగా కనబడుతాయి:
గర్భాధారణ సమయంలో పాదాలలో వాపు వల్ల పాదాలు పెద్దగా కనబడుతంటాయి . సాండిల్స్ వేసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఫీలవుతుంటారు . కాబట్టి, సౌకర్యవంతంగా ఉండే స్లిప్పర్స్ ను కొనాల్సి ఉంటుంది.

7. స్కిన్ పిగ్మెంటేషన్:
గర్భధారణ సమయంలో చాలా మంది మహిళల చర్మంలో అనేక మార్పులు వస్తాయి. వాటిలో స్కిన్ పిగ్మెంటేషన్, స్కిన్ స్యాచెస్ కనబడుతాయి. బగ్గల వద్ద మరియు ముక్కు దగ్గర ఇలాంటి సమస్య ఎక్కువగా కనబడుతుంది. అందుకు ప్రధానకారణం చర్మంలో మెలనిన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం వల్ల స్కిన్ పిగ్మెంటేషన్ కు గురి అవుతుంది.



Click it and Unblock the Notifications