Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
మోలార్ ప్రెగ్నన్సీ గురించి తెలుసుకోవాల్సిన 7 వాస్తవాలు..
గర్భిణీ స్త్రీలు ఒక నిమిషం హ్యాపీగా ఆలోచిస్తూ ఉంటారు.. అంతలోనే మరో నిమిషం.. ఆందోళన, హెల్త్ కాంప్లికేషన్స్.. మరింత భయపెడతాయి. అనేక అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. వాటిలో అబార్షన్ ఒకటి. అలాగే పొట్టలో బేబీ అంగవైకల్యంతో ఉండే అవకాశాలు ఉంటాయి. అలాంటి సమస్యే మోలార్ ప్రెగ్నన్సీ.
మోలార్ ప్రెగ్నన్సీ అనేది చాలా అరుదుగా వస్తుంది. ఇది వెయ్యి మందిలో ఒకరు ఫేస్ చేస్తారు. ఈ మోలార్ ప్రెగ్నన్సీని గెస్టేసనల్ ట్రోఫోబ్లాస్టిక్ డిసీజ్ అని పిలుస్తారు. అసలు మోలార్ ప్రెగ్నన్సీ అంటే.. ప్లేసాంటాలో అసాధారణత ఏర్పడుతుంది. అంటే ఎగ్, స్ప్మెర్స్ కలిసిపోయి.. ఫెర్టిలైజేజన్ అయినప్పుడు.. దాన్ని మోలార్ ప్రెగ్నన్సీ అని పిలుస్తారు.
మోలార్ ప్రెగ్నన్సీ అనేది.. ఫెర్టిలైజేషన్ సమయంలో జెనెటిక్ ఎర్రర్ కి కారణమవుతుంది. దీనివల్ల గర్భాశయంలో టిష్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే.. నార్మల్ గా కంటే.. మోలార్ ప్రెగ్నన్సీలో గర్భంలో మెటీరియల్ చాలా వేగంగా గ్రోత్ అవుతుంది. మరో షాకింగ్ విషయం ఏంటంటే.. మోలార్ ప్రెగ్నెన్సీలలో కేవలం ప్లేసాంటాకి సంబంధించిన భాగాలు మాత్రమే ఉంటాయి,.. కానీ.. బేబీ ఉండదు. స్పెర్మ్ ఖాళీ ఎగ్ లో ఫెర్టిలైజ్ అవుతుంది. ఎగ్ ఖాళీగా ఉండటం వల్ల.. బేబీ ఫార్మ్ అవదు.
చాలా మందికి పరిచయం లేని ఈ మోలర్ ప్రెగ్నెన్సీ గురించి మీకు తెలియని విషయాలపై.. ఖచ్చితంగా అందరూ అవగాహన కల్పించుకోవడం మంచిది. మోలర్ ప్రెగ్నెన్సీ గురించి 7 వాస్తవాలేంటో చూద్దాం..

గర్భం దాల్చిన లక్షణాలు
మోలార్ ప్రెగ్నన్సీ పొందిన మహిళ.. గర్భం దాల్చిన లక్షణాలు ఫేస్ చేస్తుంది. మార్నింగ్ సిక్ నెస్, పీరియడ్స్ మిస్ అవడం, సున్నితమైన బ్రెస్ట్ లు.. అనేవి సాధారణ లక్షణాలు.

లక్షణాలు గుర్తించడం
మొదట్లో.. సాధారణ గర్భమా లేదా మోలార్ ప్రెగ్నన్సీ నా అని.. లక్షణాలను గుర్తించడం మహిళకు చాలా కష్టం. ఎందుకంటే.. రెండూ ఒకేలా ఉంటాయి.

ఇతర లక్షణాలు
మోలర్ ప్రెగ్నన్సీ లక్షణాల్లో కొన్ని కొత్తగా కనిపిస్తాయి. గర్భంలో డవలప్ అయిన తర్వాత కొన్ని రోజులకు బ్లీడింగ్, ఇర్రెగ్యులర్ హార్ట్ బీట్, చెమట, వికారం, గర్భాశయం పెరగడం వంటి సంకేతాలు కనిపిస్తాయి.

తీసేయడం
ఒకసారి.. పొందిన గర్భం మోలార్ ప్రెగ్నన్సీ అని తెలియగానే.. వెంటనే దాన్ని తీసేయాలి. లేదంటే.. తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఆ మహిళ ఎదుర్కోవాల్సి వస్తుంది.

తరచుగా డాక్టర్ దగ్గరకు
మోలార్ ప్రెగ్నన్సీని తొలగించిన తర్వాత.. మహిళ రెగ్యులర్ గా.. డాక్టని సంప్రదిస్తూ ఉండాలి. టెస్ట్ లు చేయించుకుని.. రిస్క్ నుంచి బయటపడిందా లేదా అన్నది తెలుసుకోవాలి.

మళ్లీ కన్సీవ్ అవడానికి
మోలార్ ప్రెగ్నన్సీ తీసేసిన తర్వాత ఆ మహిళ మళ్లీ కన్సీవ్ అవడానికి కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. తాను సంప్రదిస్తున్న డాక్టర్ మళ్లీ గర్భం పొందడానికి హెల్తీగా ఉందని చెప్పిన తర్వాతే.. మళ్లీ ప్రయత్నించడం మంచిది.

యుటెరైన్ క్యాన్సర్ రిస్క్
మోలార్ ప్రెగ్నన్సీ చాలామంది మహిళల్లో యుటరైన్ క్యాన్సర్ రిస్క్ తీసుకొస్తుంది. కాబట్టి.. మోలార్ ప్రెగ్నన్సీ ఎదురైన మహిళలు.. రెగ్యులర్ గా చెక్ చేయించుకుని, అవసరమైన మందులు వాడటం చాలా అవసరం.



Click it and Unblock the Notifications