For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైల్డ్ బర్త్ తర్వాత, పొట్ట మీద స్ట్రెచ్ మార్క్స్ ను నివారించే 7 ఫుడ్స్

|

సహజంగా శరీరం మీద ముఖ్యంగా చెతులు, మోకాళ్ల మీద, తొడల వద్ద స్ట్రెచ్ మార్క్స్ ఉన్నట్లైతే చాలా ఇబ్బందిగా ఫీలవుతుంటారు. గర్భిణీల్లో స్ట్రెర్చ్ మార్క్స్ సహజం. గర్భధారణ సమయంలో హార్మోనుల ప్రభావం, కడుపులో బిడ్డ పెరిగే కొద్ది పొట్ట స్ట్రెచ్ (విస్తరించడం)వల్ల పొట్ట మీద చారలు ఏర్పడటం సహజం. ముఖ్యంగా ప్రసవించిన తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవడానికి వివిధ మార్గాలున్నాయి. నేచురల్ రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి.

గర్భధారణ సమయంలో స్ట్రెచ్ మార్క్స్ ప్రతి గర్భిణీ స్త్రీలో సహజం. గర్భిణీ శరీరంలో జరిగే కొన్ని ఫిజికల్ చేంజెస్ వల్ల స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. ఈ స్ట్రెచ్ మార్క్స్ ముఖ్యంగా గర్భిణీబాడీలో బ్రెస్ట్, స్టొమక్, హిప్, బుటక్స్ మీద ఎక్కువగా ఏర్పడుతాయి. పొట్టలో బేబీ పెరిగే కొద్ది గర్భిణీ శరీరం విస్తరంచడం వల్ల ఇలా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి.

అలాగే గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీ క్రమంగా బరువు పెరగడం వల్ల కూడా స్కిన్ స్ట్రెచ్ అవుతుంది. బాడీలో ముఖ్యంగా స్కిన్ మీద స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడితే చూడటానికి అసహ్యాంగా కనబడుతుంది. గర్భిణిలో ఆందోళనకు గురిచేస్తుంది. గర్భం పొందిన తర్వాత చాలా మంది స్త్రీలలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటం సహజం.

కాబట్టి, అలా అసహ్యంగా కనిపించే స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకుని, సాప్ట్ స్కిన్ పొందాలంటే శరీరం గురించి కొన్ని మార్పులు చేసుకోవాలి. ప్రసవం తర్వాత స్ట్రెచ్ మార్స్ నివారించుకోవడానికి కొన్ని నేచురల్ లేదా హెర్బల్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి చౌకైనవి వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చైల్డ్ బర్త్ (ప్రసవం)తర్వాత స్ట్రెచ్ మార్క్స్ నివారించుకోవడానికి కొన్ని కొన్ని నేచురల్ ఫుడ్స్ కూడా సహాయపడుతాయి. అవేంటో తెలుసుకుందాం...

 ఆరెంజ్ :

ఆరెంజ్ :

ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవడానికి విటమిన్ సి ఫుడ్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది స్కిన్ ఎలాసిటి పెంచుతుంది మరియు స్ట్రెచ్ మార్క్స్ ను తొలగిస్తుంది.

డేట్స్ :

డేట్స్ :

బిడ్డ పుట్టిన తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవడానికి డేట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. ప్రసవం తర్వాత డేట్స్ తినడం వల్ల స్కిన్ సెల్స్ కు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. చర్మంను టైట్ చేస్తుంది.

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటోలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇందులో న్యూట్రీషియన్ అధికంగా ఉంటాయి. ఇది స్కిన్ స్ట్రక్చర్ ను మెరుగుపరుస్తుంది. పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత స్కిన్ స్ట్రక్చర్ ను తగ్గిస్తుంది.

పాలు

పాలు

స్ట్రెచ్ మార్క్స్ ను నివారించడానికి మరో నేచురల్ రెమెడీ పాలు, ఇందులో విటమిన్ ఇ, క్యాల్షియం మరియు పొటాషియం ఎక్కువగా ఉన్నాయి. ఇది కొల్లాజెన్ ప్రొడక్షన్ ప్రోత్సహిస్తుంది. దాంతో స్ట్రెచ్ మార్క్స్ తొలగిపోతాయి .

అవొకాడో

అవొకాడో

పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత స్ట్రెచ్ మార్క్స్ ను నివారించడంలో మరో అద్భుత రెమెడీ అవొకాడో, ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి, ఇది స్కిన్ ఎలాసిటిని పెంచుతుంది.

గుడ్డు

గుడ్డు

స్ట్రెచ్ మార్క్ నివారించడంలో మరో నేచురల్ రెమెడీ గుడ్డు, గుడ్డులో ఉండే ప్రోటీన్స్ చర్మంను స్మూత్ గా మరియు టైట్ గా మార్చుతుంది.

నీళ్ళు:

నీళ్ళు:

చివరగా, నీళ్ళు బెస్ట్ రెమెడీ. పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత ఇది స్ట్రెచ్ మార్క్ నివారించడంలో నీళ్ళు గ్రేట్ గా సహాయపడుతుంది, ఇది స్కిన్ ను హైడ్రేషన్ చేస్తుంది, దాంతో స్ట్రెచ్ మార్క్స్ ను కనబడకుండా చేస్తుంది.

English summary

7 Foods To Reduce Stretch Marks After Child-Birth

If you are a woman who has recently given birth to a child and if you have developed stretch marks on your body, then you must know that there are a few natural remedies for stretch marks post child-birth.
Story first published: Wednesday, September 7, 2016, 17:39 [IST]
Desktop Bottom Promotion