Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
ప్రెగ్నన్సీ టైంలో నిర్లక్ష్యం చేయకూడని సమస్యలు..!
గర్భధారణ సమయంలో.. అసాధారణ లక్షణాలు, సంకేతాలకు వెంటనే అలర్ట్ అవడం చాలా అవసరం. డాక్టర్ సంప్రదించి.. సరైన మందులు తీసుకోవాలి. తల్లి, బిడ్డ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడూ.. గమనిస్తూ ఉండాలి.
ప్రెగ్నన్సీ సమయంలో.. ప్రతి రోజూ, ప్రతి నిమిషం చాలా ముఖ్యమైనది. ప్రతి రోజూ.. తమ ఆరోగ్యంపై జాగ్రత్త తీసుకుంటూ ఉండాలి. అలాగే.. డెలివరీ వరకు.. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం మార్పు కనిపించినా.. వెంటనే అలర్ట్ అవ్వాలి.

గర్భధారణ సమయంలో.. అసాధారణ లక్షణాలు, సంకేతాలకు వెంటనే అలర్ట్ అవడం చాలా అవసరం. డాక్టర్ సంప్రదించి.. సరైన మందులు తీసుకోవాలి. తల్లి, బిడ్డ ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడూ.. గమనిస్తూ ఉండాలి.
గర్భం పొందిన తర్వాత.. ఎప్పుడైనా, ఎక్కడైనా.. కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా మొదటి మూడునెలల్లో కనిపించే.. ఈ లక్షణాలను, సమస్యలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మరి అవేంటో చూద్దాం..

బ్లీడింగ్
ప్రెగ్నన్సీ టైంలో బ్లీడింగ్ అయిందంటే.. మీరు ఖచ్చితంగా డాక్టర్ ని సంప్రదించాలి. ఇది అబార్షన్ కి సంకేతం కావచ్చు. ఒకవేళ 7 లేదా 8వ నెలలో నొప్పితో పాటు, బ్లీడింగ్ అయిందంటే.. ప్లేసాంటాలో సమస్య అయి ఉండవచ్చు.

వాంతులు
ప్రెగ్నన్సీ టైంలో వాంతులు చాలా కామన్ అనుకుంటాం. కానీ ఒకవేళ ఏమీ తిననివ్వకుండా, తాగనివ్వకుండా.. వాంతులు ఇబ్బంది పెడుతుంటే.. మాత్రం అలర్ట్ అవ్వాలి. డీహైడ్రేట్ అవుతారు. దీనివల్ల పోషణ తగ్గుతుంది. కాబట్టి.. డాక్టర్ ని సంప్రదించాలి.

బేబీ యాక్టివిటీ
గర్భంలో బేబీ యాక్టివిటీ ఎలా ఉందనేది చాలా ముఖ్యం. కాబట్టి.. ఒకవేళ మీరు.. బేబీ కిక్స్ ని గ్రహించలేకపోతుంటే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

కాంట్రాక్షన్స్
చివరి ట్రైమ్ స్టర్ లో సంకోచాలు కనిపించాయి అంటే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించడం చాలా ముఖ్యం. లేదంటే.. తల్లీ , బిడ్డ ఇద్దరికీ ప్రమాదమే.

వైట్ డిశ్చార్జ్
కొంతమంది మహిళల్లో అనుకోకుండా.. యూరిన్ లీక్ అవుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు.. కూడా డాక్టర్ ని సంప్రదించాలి. నిర్లక్ష్యం చేయకూడదు.

తలనొప్పి, పొట్ట నొప్పి
ఒకవేళ హై బ్లడ్ ప్రెజర్, తీవ్ర తలనొప్పి చివరి ట్రైమ్ స్టర్ లో కనిపించాయంటే.. ప్రీఎక్లంప్సియాకి సంకేతం. కాబట్టి.. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

ఫ్లూ
గర్భిణీ స్త్రీలు.. చాలా త్వరగా.. ఫ్లూ బారిన పడే అవకాశాలుంటాయి. ఒకవేళ మీరు ఫ్లూ లక్షణాలను గమనించినట్లైతే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.



Click it and Unblock the Notifications
