For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మహిళల్లో సంతాన లోపంను జయించే 7 అద్భుత హోం రెమెడీస్

|

ప్రస్తుత మోడ్రన్ యుగంలో పిల్లలు కలగకపోవడమనేది ఒక శాపంగా మారింది. అనేక జంటలు ఇన్ ఫెర్టిలిటితో బాధపడుతున్నారు. వంధ్యత్వం అనేది మహిళలు ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య. వంధ్యత్వం మహిళల్లో గర్భం పొందే సార్థ్యం లేకపోవడాన్ని సూచిస్తుంది. అయితే వంధ్యత్వం మహిళల్లో మాత్రమే కాదు, పురుషుల్లో కూడా ఈ పరిస్థి ఉండటం వల్ల మహిళలు గర్భం పొందలేకపోవచ్చు. ఒక జంట రెగ్యలర్ కాంటాక్ట్స్(ఇంటర్ కోర్స్) ఉన్నాకూడా ఒక సంవత్సరంలోపు గర్భం ధరించకపోతే వంధ్యత్వంగా భావిస్తారు. వంధ్యత్వానికి దోహదపడే అంశాలు చాలా ఉన్నాయి . ఇది మీ వయస్సు , ఆహారం , జీవనశైలి , ఒత్తిడి,డ్రింకింగ్, స్మోకింగ్ ఒబేసిటి, వయస్సు పైబడటం, పోషకాల లోపం, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వంటి పరిస్థితులు లేదా వృత్తి ఎక్స్పోషర్ వంటివి కారణాల వల్ల కూడా వంధ్యత్వం ఏర్పడవచ్చు. ఇటువంటి పరిస్థితులు స్త్రీల మొత్తం ఆరోగ్యం మీద మాత్రమే కాదు, సంతానోత్పత్తి మీద కూడా ప్రభావం చూపుతుంది.

మహిళల్లో పిల్లలు కలగకపోవడానికి 10 కారణాలు

మేయో క్లినిక్ , యుఎస్ఎ నివేధిక ప్రకారం వంధ్యత్వానికి 40 % నుండి 50% కేసలు మహిళల్లో సమస్యలు కారణంగా ఉన్నాయి. చాలా కేసుల్లో మహిళల్లో వంధ్యత్వానికి జన్యు సమస్యలు , అండోత్సర్గము లోపాలు , హార్మోన్ అసమానతలను , అధిక బరువు మరియు శరీర నిర్మాణం, ఎండో మెట్రీయాసిస్, ఫెలోపియన్ ట్యూబ్ సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, అనీమియా, యుటరేన్ ఫైబ్రాయిడ్స్, పిసిఓయస్, మరికొన్ని ఇతర కారణాలు మహిళల్లో వంధ్యత్వానికి కారణమవుతున్నాయి. అటువంటి కేసులకు చికిత్స చేయవచ్చు, ఇతరములు కాదు. ఈ క్లిష్టమైన ప్రపంచంలో వంధ్యత్వానికి చికిత్స చేయించుకోవడం కంటే, మహిళల్లో వంధ్యత్వాన్ని ఎలా నివారించాలో తెలుసుకోవాలి.

స్త్రీ-పురుషుల్లో సంతానలేమి సమస్యను నిరోధిండం ఎలా

మహిళల్లో ఇన్ఫెర్టిలిటిని జయించాలంటే కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. అయితే మెడికల్ హిస్టరీ ఉన్నవారు, ఈ హోం రెమెడీస్ ను ప్రయత్నించడానికి ముందు డాక్టర్ ను సంప్రదించడం మంచిది.కరెంట్ హెల్త్ కండీషన్ గురించి మరియు శరీరంలోని ఇతర ఫ్యాక్టర్స్ గురించి తెలుసుకోవడం మంచిది. డాక్టర్ సూచనలతో పాటు ఈ క్రింది హోం రెమెడీస్ ను ప్రయత్నించండి...

మక రూట్ :

మక రూట్ :

హార్మోనుల అసమతుల్యతను నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఇన్ ఫెర్టిలిటికి ఇది గ్రేట్ రెమెడీ. ఒక కప్పు గోరువెచ్చని పాలు తీసుకుని, అందులో మాక రూట్ పౌడర్ న మిక్స్ చేయాలి. తర్వాత పాలను తాగాలి. గర్భం పొందిన తర్వాత దీన్ని వాడకూడదు.

డేట్స్ :

డేట్స్ :

ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకునే వారు రెగ్యులర్ డైట్ లో డేట్స్ చేర్చుకోవడం వల్ల ఐరన్, విటమిన్ బి, ఎ, మరియు ఇలు ఎక్కువగా తీసుకోవాలి. డేట్స్ గర్భం పొందే చాన్స్ ను పెంచతుంది. ఇంకా బిడ్డ పుట్టడానికి డెలివరీ సమయంలో అవసరమయ్యే న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. ప్రతి రోజూ 5నుండి 6 ఖర్జూరాలను తినాలి.

దాల్చిన చెక్క:

దాల్చిన చెక్క:

ఒక టీస్పూన్ దాల్చిన చెక్క పొడిని ఒక కప్పు వేడి నీటిలో మిక్స్ చేయాలి. దీన్ని రోజుకు ఒక కప్పు తీసుకుంటే ఓవేరియన్ ఫంక్షన్ ను మెరుగుపరుస్తుంది, ఫెర్టిలిటి పెంచుతుంది. యుటేరియన్ ఫైబ్రాయిడ్స్ మరియు ఎండోమెట్రియాసిస్ ను నివారిస్తుంది. అయితే ఒక రోజుకు ఒక టీస్పూన్ కంటే ఎక్కువ తీసుకోకూడదు.

అశ్వగంథ:

అశ్వగంథ:

అశ్వగంథను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల హార్మోనులను సమతుల్యం చేస్తుంది. స్త్రీలలో పునరుత్పత్తి వ్యవస్థ చాలా ఎఫెక్టివ్ గా పనిచస్తుంది. ఇంకా స్ట్రెస్ తగ్గిస్తుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీస్పూన్ అశ్వగంథ పౌడర్ ను మిక్స్ చేసి, రోజుకు రెండు సార్లు తాగాలి. అయితే మీరు దీన్ని ఉపయోగించడానికి ముందు డాక్టర్ ను సంప్రదించాలి.

 విటమిన్ డి:

విటమిన్ డి:

ఇన్ ఫెర్టిలిటికి కారణం విటమిన్ డి లోపం. అందువల్ల ప్రతి రోజూ ఉదయం కొంత సమయంలో ఎండలో ఉండటం మంచిది. అలాగే రెగ్యులర్ డైట్ లో గుడ్డు చేర్చుకోవడం, సాల్మన్ ఫిష్ ను తినడం మంచిది.

యోగ:

యోగ:

ఫెర్టిలిటి సమస్యలను నివారించుకోవడానికి యోగ గ్రేట్ గా సహాయపడుతుంది. కొన్ని రకాల యోగ భంగిమలను ఇన్ ఫెర్టిలిటిని జయిస్తుంది. బటర్ ఫ్లై ఫోజ్, యోగ నిద్ర, కూర్చొని ముందుకు వెనకకు బెండ్ అవ్వడం వంటి భంగిమలు ఫెర్టిలిటి పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి . . అయితే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వారు, నిపుణులు సమక్షంలో యోగ చేయడం మంచిది.

 దానిమ్మ:

దానిమ్మ:

బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంలో దానిమ్మ గ్రేట్ గా సహాయపడుతుంది. రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ కు రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గర్భస్రావాలను తగ్గిస్తుంది. ఫీటల్ డెబలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతుంది. దానిమ్మ జ్యూస్ ను తాగడం మంచిది.

English summary

7 Remedies For Female Infertility

7 Remedies For Female Infertility,Infertility is about the inability to conceive a baby even after participating in intercourse without using any birth control methods. If regular intercourse for more than a year doesn't result in pregnancy, then it could be infertility.
Desktop Bottom Promotion