For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ సమయంలో ఖచ్చితంగా తినాల్సిన 7 సూపర్ ఫుడ్స్ ..

ప్రెగ్నెన్సీ టైమ్ లో తీసుకొనే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కడుపులో పెరిగే బిడ్డ మీరు తీసుకొనే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో న్యూట్రిషియన్స్ అధికంగా ఉండేట్ల

|

ప్రెగ్నెన్సీ టైమ్ లో తీసుకొనే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కడుపులో పెరిగే బిడ్డ మీరు తీసుకొనే ఆహారం మీదే ఆధారపడి ఉంటుంది. కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో న్యూట్రిషియన్స్ అధికంగా ఉండేట్లు చూసుకోవాలి. తల్లి ఆరోగ్యంగా ఉంటేనే పుట్టే బిడ్డ ఆరోగ్యంగా పుడుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో మీరు తీసుకొనే ఆహారం గురించి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తొమ్మిది నెలల పాటు తల్లికి, కడుపులో ఉన్న బిడ్డకు ఇద్దరికి ఆహారం సరిపడా తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తినాలి.

రోజూ తినే ఆహారం కంటే ఎక్కువ తినాలి. కాల్షియం, ఇనుము అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. వీటితో పాటు పుల్లటి పండ్లు తీసుకోవాలి. పాలు, మాంసం, గుడ్లు,చేపలు, క్రొవ్వు పదార్దాలు ఎక్కువగా తీసుకోవటం మంచిది. మలబద్దకం లేకుండా ఎక్కువ ద్రవపదార్ధాలు, పీచుపదార్ధాలు తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి బిడ్డ క్షేమంగా ఉండేందుకు కొన్ని సూపర్ ఫుడ్స్ తీసుకోవాల్సి ఉంటుంది. గర్బాధరణ సమయంలో శరీరంలో వచ్చే మార్పులకు తగిన విధంగా ఆహారపు అలవాట్లను మార్పు చేసుకోండి. అందుకోసం కొన్న సూపర్ ఫుడ్స్ ...

మరి తల్లులు కాబోయే మహిళలు తీసుకోదగిన 7 సూపర్ ఆహారాలు ఏమిటో పరిశీలించండి.

ఓట్-

ఓట్-

ఓట్లు ఆరోగ్యకరమైన ఆహారం. నేటి రోజులలో ఓట్ గింజలను చాలా మంది అధికంగా తింటున్నారు. వీటిలో కార్బోహైడ్రేట్లు వుంటాయి. కడుపు నింపుతాయి. కరిగే పీచులు మీ శరీరంలోని మలినాలను విసర్జిస్తాయి. టోఫు, సోయాబీన్స్, వాల్ నట్స్ వంటివి కూడా ఆహారంగా ఇస్తే, వాటిలోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు బిడ్డ ఎదుగుదలకు సహకరిస్తాయి.

వెన్నతీసిన పాలు

వెన్నతీసిన పాలు

వెన్న తీసిన పాలు మంచి ప్రొటీన్లు కలిగి వుంటాయి. పాలు కూడా మంచి ఆహారం. దీనిలో కాల్షియం, మరియు విటమిన్ బి 12 ఉంటాయి. ఇవ్ని కూడా గర్భిణీ స్త్రీకి తప్పక అవసరమైన ఆహారాలు. కనుక, మీరు కనుక కొద్ది నెలలలో తల్లి కాబోతూంటే, ఈ సూపర్ ఆహారాలు తిని మీ మరియు మీ బిడ్డ ఆరోగ్యాన్ని పెంచండి.

చికెన్ బ్రెస్ట్ మరియు గుడ్లు -

చికెన్ బ్రెస్ట్ మరియు గుడ్లు -

పెరిగే బిడ్డకు కాబోయే తల్లికి ఇవి సూపర్ ఆహారాలు. ప్రొటీన్లు వీటిలో అధికంగా వుంటాయి. కండరాలు పెరగాలంటే, ప్రొటీన్లు ప్రధానం. ఆరోగ్యకరమైన గుడ్లు, విటమిన్ డి కలిగి చక్కని జీవప్రక్రియను కలిగిస్తాయి. పోషకాలను శరీరానికి వంట పట్టేలా చేస్తాయి.

ఆలివ్ నూనె -

ఆలివ్ నూనె -

హార్మోన్లు ఏర్పడాలంటే కొవ్వులు ఉండాలి. ఆలివ్ ఆయిల్ లో వుండే కొవ్వులు, విటమిన్ ఇ గర్భిణీ స్త్రీకి చాలా మంచిది. కనుక వీటిని సలాడ్లు లేదా ఇతర వంటకాలలో వేసి తింటే అదనపు మంచి కొవ్వు చేరుతుంది.

కిడ్నీ బీన్స్ మరియు బ్రక్కోలి -

కిడ్నీ బీన్స్ మరియు బ్రక్కోలి -

పచ్చటి ఆకు కూరలు, ఇతర కూరగాయలు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి. కిడ్నీ బీన్స్ లో పీచు వుండటమే కాదు, ఐరన్ కూడా వుంటుంది. బేబీలో ఎర్ర రక్తకణాలు పెరగాలంటే ఇది చాలా ప్రధానం. బ్రక్కోలిలో కావలసినంత నీరు విటమిన్ బి కూడా వుంటాయి. అవి కొత్త కణాలను పుట్టిస్తాయి. ఇవి రెండూ చాలకుంటే బిడ్డకు శారీరక లోపాలు వస్తాయి.

పెరుగు:

పెరుగు:

గర్భినీలకు పెరుగు ఒక సూపర్ ఫుడ్ అని చెప్పవచ్చు. లోఫాట్ పెరుగులో విటమిన్ డి మరియు క్యాల్షియం అధికంగా ఉంటాయి. గర్భిణీ స్త్రీలకు ఒక రోజుకు 1000 మిల్లీగ్రాముల క్యాల్షియం అవసరమౌతుంది. అది మనం తీసుకొనే ఆహారంలోనే దొరుకుతుంది కాబట్టి క్యాల్షియం మోతాదు ఎక్కువ ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. కడుపులో పెరుగుతున్న బిడ్డ పెరుగుదలకు, ఎముకలు అభివద్దిచెందడానికి క్యాల్షియం అధికంగా అవసరం ఉంటుంది.

అరటిపండ్లు:

అరటిపండ్లు:

అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. మరియు వెంటనే ఎనర్జీని అందిస్తుంది . ఇవి గర్భధారణ సమయంలో అలసటని తగ్గిస్తుంది. అరటిపండ్లలో పొటాషియం అధికంగా ఉండటం వల్ల బ్లడ్ ప్రెజర్ ను నార్మల్ గా ఉంచుతుంది. ఇది కిడ్నీ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

7 Superfoods For Pregnant Women Should Eat

Women have to be very careful about the foods they eat during pregnancy. The first few weeks of pregnancy are very crucial and require a special care and attention. In the early stages of pregnancy, consuming prenatal power foods rich in folate, fibre, iron, potassium and vitamins are very important for the development of a growing baby. Women have to be more careful during pregnancy in their choice of the right kinds of food. If not, it affects the growth and health of the baby.
Story first published: Saturday, November 12, 2016, 12:59 [IST]
Desktop Bottom Promotion