Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
గర్భధారణ సమయంలో జలుబు, దగ్గు నివారించే 7 సులభ మార్గాలు ..
గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీకి జలుబు మరియు దగ్గు వంటి సమస్యలు వచ్చినప్పుడు అవి తప్పనిసరిగా గర్బిణీ స్త్రీ ఆరోగ్యం మీద ఆందోళన కలిగిస్తాయి. అయితే గర్భిణీ స్త్రీలు మందులు తీసుకొనే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలి.
ప్రెగ్నెన్సీలో సాధరణ జలుబు, ఇది సింపుల్ హెల్త్ కండీషన్ కాదు. ప్రెగ్నెన్సీ సమయంలో దీన్ని చాలా సులభంగా నివారించవచ్చు. గర్భిణీ రెగ్యులర్ గా దగ్గు, జలుబు సమస్యను ఎదుర్కొంటుంటే, తప్పనిసరిగా గైనకాలజిస్ట్ ను కలవాలని సలహా. పరిక్ష చేసి, వైద్యుడు, అనేక మందులు మాత్రలు ప్రిస్ర్కిప్షన్ గా రాసి ఇస్తారు. జలుబు మరియు దగ్గుతో ఎక్కువ బాధపడుతుంటే, కొన్ని నేచురల్ హోం రెమెడీస్ ను ప్రయత్నించండి. ఇవి గర్భిణీ స్త్రీలకు చాలా సురక్షితం.
మెడికేషన్స్ తీసుకొనే ముందు, గర్భధారణ సమయంలో జలుబు చేసినప్పుడు కొన్ని సింపుల్ హోం రెమెడీస్ ను ప్రయత్నించవచ్చు. ఉదాహరణకు, గర్భధారణ సమయంలో జలుబు, దగ్గు తగ్గించుకోవడానికి గోరువెచ్చని మరియు హాట్ గా ఉండే ద్రవాలను త్రాగడం ఒక ఉత్తమ మార్గం. అంతే కాదు, జలుబుతో పాటు అనుసంధానంగా వచ్చే ఇతర జబ్బులు అంటే, తలనొప్పి, మరియు మెడనొప్పి కూడా తగ్గిస్తుంది.
లక్షణాలు: జలుబు, ముక్కు మూసుకుపోవడం, డిస్చార్జ్, తుమ్ములు మరియు గొంతు నొప్పి, వంటి సమస్యలు సాధారణ జలుబుతో పాటు వస్తాయి. వీటిని నివారించడానికి నేచురల్ హోం రెమెడీస్ గర్భధారణ సమయంలో జలుబు దగ్గును నివారిస్తుంది.

శరీరంను ఎప్పుడూ హైడ్రేషన్ లో పెట్టుకోవాలి:
శరీరం ఎప్పుడూ తేమగా ఉండేలా చూసుకోవాలి. జలుబు దగ్గుతో బాధపడే వారు రోజుకు కనీసం 10 గ్లాసుల నీళ్ళైనా తాగాలి . జలుబుతో బాధపడే వారు 12గ్లాసుల నీళ్ళు కూడా తాగొచ్చు.

స్టీమింగ్:
స్టీమింగ్ చాలా ఎఫెక్టివ్ మరియు నాజల్ బ్లాకేజ్ ను క్లియర్ చేయడానికి స్టీమింగ్ సిస్టమ్ ను సిఫారస్సు చేయబడినది. కానీ ఎలాంటి మందులైనా నీటిలో కలిసిపోతాయి, కాబట్టి డాక్టర్ ను కలవకుండా ఎలాంటి మెడిసిన్స్ స్టీమింగ్ చేసే హాట్ వాటర్లో మిక్స్ చేయకూడదు

సాల్ట్ వాటర్ తో గార్గిలింగ్ చేయాలి:
జలుబు ద్వారా గొంత నొప్పి కూడా వస్తుంది. దీన్ని ఉప్పునీటితో గార్గిలింగ్ చేయడం ద్వారా కొద్దిగా ఉపశమనం కలుగుతుంది. కొద్దిగా ఉప్పును గోరువెచ్చని నీటిలో మిక్స్ చేసి గొంతులో పోసి గార్గిలింగ్ చేయాలి. రోజూ మూడు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఆ నీటిలోనే రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు వేయాలి.

గ్రీన్ వెజిటేబుల్స్ ఫ్రెష్ ఫ్రూట్స్ తినాలి:
మంచి పోషకాహారం తీసుకోవడం వల్ల తల్లి, బిడ్డ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతాయి . ఫ్రెష్ గా ఉండే వెజిటేబుల్స్ మరియు ఫ్రూట్స్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి . ఇవి శరీరంలో కణాలను యాక్టివ్ గా మరియు హెల్తీగా స్ట్రాంగ్ గా ఉంచుతాయి. ఇన్ఫెక్షన్స్ తో పోరాడుతాయి.

రెస్ట్ :
గర్భణీలో దగ్గు జలుబు,వైరల్ ఇన్ఫెక్షన్స్ నివారించుకోవడానికి తగినంత విశ్రాంతి చాలా అవసరం . వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి త్వరగా కోలుకోవాలంటే తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం.

సరైన శుభ్రత పాటించాలి:
గర్భధారణ సమయంలో సరైన శుభ్రతను పాటించడం చాలా అవసరం . దగ్గు జలుబుతో పోరాడే వారు ఎప్పుడూ హైజినిక్ గా ఉండాలి. దగ్గినప్పుడు, తుమ్మినిప్పుడు, చేతులు అడ్డుపెట్టుకోవాలి. అప్పటికప్పుడు చేతులు శుభ్రం చేసుకోవాలి.

శరీరంను వెచ్చగా ఉంచుకోవాలి:
బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు సాద్యమైనంత వరకూ శరీరంను వెచ్చగా ఉంచుకోవాలి . వర్షాకాలంలో బయట తిరగడం మానేయాలి . కాలుష్యం, మరియు దుమ్ము,దూళికి దూరంగా ఉండాలి . కాళ్ళకు సాక్సులు వేసుకొని ఇన్ఫెక్షన్స్ కు కారణమయ్యే సూక్ష్మక్రియుల నుండి రక్షణ కల్పించాలి.



Click it and Unblock the Notifications