Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
పీరియడ్స్ మిస్ అయిన మొదటి వారంలో కనిపించే 8 ప్రెగ్నెన్సీ లక్షణాలు
గర్భం పొందిన మొదటి వారంలో ఎలాంటి శారీరక మార్పులు ఉండవు, ఇంటర్నల్ గా పాజిటివ్ మార్పులు మాత్రమే ఉంటాయి. అందులో కొన్ని కామన్ లక్షణాలు గ్యాస్, మలబద్దకం, వంటి జీర్ణ సమస్యలు , బ్రెస్ట్ లో టెండర్ నెస్, అలసట,
తల్లి కాబోతున్నానన్న విషయం తెలియగానే ప్రతి మహిళ సంతోషం అంతా ఇంతా కాదు. ఆ ఆనందం ఒకవైపుంటే, మరోవైపు రోజుకో కొత్త రకం సమస్య వచ్చిపడుతుంది. మొదటిసారి గర్భం దాల్చినవాళ్ల అయోమయానికైతే అంతే ఉండదు. ఏం తినాలో తెలియదు. ఏం తినకూడదో తెలియదు. పనులేమీ చేయొద్దు రెస్ట్ తీసుకోవాలని కొందరు చెప్తే, అన్నీ పనులు చేస్తేనే సుఖ ప్రసవం అవుతుందని ఇంకొందరి సలహా. సందేహాలు, సమస్యల సుడిగుండంలో గర్భవతి అయోమయానికి గురవుతుంది. గర్భం దాల్చిన సమయంలో శరీరంలో ఎప్పుడు ఎలాంటి మార్పులు వస్తాయి, ఎందుకు వస్తాయో తెలిస్తే ఈ ఆందోళన ఉండదు. ఆ సందేహాలను తీర్చుకోవడానికే ఈ ఆర్టికల్
ఆందోళనలు, సందేహాలకు తెర వేయాలంటే మొదట గర్భ నిర్ధాన చేసుకోవాలి. గర్భ నిర్ధారణ లక్షణాలు ఒక్కొక్క మహిళలలో ఒక్కో విధంగా ఉంటాయి. ఇద్దరు మహిళలు ఒకే నెలలో గర్భం పొందినా, లక్షణాలు ఒకే విధంగా అయినా ఉంటాయి, లేదా వేరు వేరుగా కూడా ఉంటాయి. మరో ఫన్నీ విషయమేమిటంటే కొంత మందికి గర్భం పొందిన విషయమే మూడు నెలల వరకూ తెలియదు. చాలా రేర్ కేసుల్లో ప్రసవ సమయానికి గుర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి.
గర్భం పొందిన మొదటి వారంలో ఎలాంటి శారీరక మార్పులు ఉండవు, ఇంటర్నల్ గా పాజిటివ్ మార్పులు మాత్రమే ఉంటాయి. అందులో కొన్ని కామన్ లక్షణాలు గ్యాస్, మలబద్దకం, వంటి జీర్ణ సమస్యలు , బ్రెస్ట్ లో టెండర్ నెస్, అలసట, మూడ్ స్వింగ్స్ , సిక్ నెస్ , హార్మోనుల్లో మార్పులు జరుగుతాయి. ఈ మార్పులు గర్భిణీలందరిలో సహజంగా కనబడుతాయి.
గర్భధారణ జరిగిన మరుసటి రోజుననే గర్భవతి అయినట్లు తెలియచేసే లక్షణాలు బహిర్గతం అవని ఎడల, ముందుగా కనిపించే గర్భధారణ లక్షణాల ద్వారా మీరు ఒక నిర్ణయానికి రావటానికి వీలవుతుంది. ఇలాంటి ముందస్తపు లక్షణాలు మొదటి వారం లేదా నాలుగవ వారంలో కనిపించవచ్చు. మీరు గర్భవతి అయినట్లు మీకు అనిపించిన వెంటనే డాక్టరును సంప్రదించండిఅయితే గర్భం పొందడానికి గర్భం పొందిన మొదట వారంలో నిర్ధారణ చేసుకోవడానికి కొన్ని ప్రెగ్నెన్సీ లక్షణాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

బ్లీడింగ్ :
మీకు పీరియడ్ అయినట్లే అనిపిస్తుంది? కానీ ఇది సాధారణంగా కంటే తేలికైనదిగా ఉంటుంది, మరియు మీరు అనుకొన్నకొన్ని రోజుల ముందు అలా అగుపిస్తుంది. అది మీ గర్భాశయంలో గుడ్డు ఫలదీకరణ చెండి గర్భాశయ గోడ అంటిపెట్టుకొని ఉన్నప్పడు మరియు కొద్దిగా రక్తస్రావం అయినట్లు అనుభూతిని కలిగిస్తుంది. మీలో పీరియడ్స్ అయిందనే బావన కలుగుతుంది.

ఒక రకమైనటువంటి రుచి:
నోరు రుచి మారుతుంది. మీ నోటిలోని లాలాజలం రుచిమారుతుంది. దీని కారణంగా టీ, కాఫీ వంటివి గతంలో కంటే విభిన్నమైన రుచిగా వుంటాయి.

కలలు:
గర్భం పొందిన మొదటి వారంలో మహిళలు ఎక్కువగా కలలు కంటారని పరిశోధనల్లో వెల్లడించారు. కాబట్టి, పీరియడ్స్ మిస్ అయిన తర్వాత ఎక్కువగా కలలు కంటున్నట్లైతే ఇది గర్భనిర్ధారణకు ఒక సంకేతంగా గుర్తించండి..

ముఖంలో డార్క్ స్పాట్స్:
గర్భసమయంలో చాలా రకాల చర్మ సమస్యలకు గురి అవ్వవలసి వస్తుంది. మీ ముఖం పైన నల్లటి మచ్చలు లేదా శరీర భాగాల పైన అధిక చర్మం పెరగటం గమనిస్తారు. ముఖ్యంగా చర్మం రావటం లేదా చర్మం వేలాడటం వంటివి చేతుల పైన లేదా బాహ్యమూలాలలో కనపడుతుంది. దీనికి గల కారణం- మీ శరీరంలో అదనపు 'మెలనిన్' ఉత్పత్తి చెందటం, నల్లటి మచ్చలు ఏర్పడటం మరియు హార్మోన్'ల ప్రభావం వలన కూడా కలుగవచ్చు.

అలసట:
గర్భధారణ ప్రారంభ లక్షణాల్లో ఇది ఒక సాధారణ ప్రెగ్నెన్సీ లక్షణం. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. రక్తపోటు పెరగడం లేదా తగ్గడం వల్ల అలా జరగవచ్చు మరియు వెయిట్ లాస్ డైట్ కూడా అలసటకు కారణం కావచ్చు. అయితే, అసురక్షితమైన లైంగిక ప్రక్రియ కలిగి ఉన్నా మైకంతో బాధపడుతుంటారు. అటువంటప్పుడు, డాక్టర్ ను సంప్రదించండి. గర్భం ధరించిన స్త్రీలు త్వరగా, తరచుగా అలసిపోతుంటారు. ఎలాంటి కారణం లేకుండా తరచుగా అలసి పోతున్నారా! అయితే మీరు గర్భం ధరించారని అర్థం.

యూరిన్ సమస్యలు:
మూత్రం అధికమవుతుంది. ప్రొజెస్టిరోన్ స్ధాయి పెరిగి పిండం హెచ్సిజి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. కటి ప్రదేశానికి రక్త సరఫరా పెరిగి తరచుగా మూత్రం వస్తుంది. మీరు హఠాత్తుగా మీకు ఒక అనుభూతి కలుగుతుంది. మీకు రాత్రి సమయంలో హఠాత్తుగా మూత్ర విసర్జనకు వెళ్ళాలనిపిస్తుంది. ఇది కూడా ఇక లక్షణం కావచ్చు. గర్భాధారణ సమయంలో మీ శరీరం అదనపు ద్రవాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది మీ పిత్తాశయమును పని అధికం చేస్తుంది - మరియు మీరు చాలా సార్లు మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తుంది.

తలనొప్పి:
గర్భం ధరించడానికి ప్రారంభ దశలో మీ శరీరంలోని హార్మోనులు మార్పుల వల్ల తలనొప్పి అధికంగా ఉంటుంది.గర్భధారణకు తలనొప్పి కూడా ఒక కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే, సాధారణ మహిళల్లో కంటే, గర్భదారణ పొందే స్త్రీలలో తలనొప్పి ఒక సాధారణ చిహ్నంగా ఉంటుంది.

మూడ్ స్వింగ్స్ :
మీరు కొద్దిగా హార్మోన్ల ఫీలింగ్ అనుభూతి కలిగుతుంది, ఎందుకంటే మీ శరీరం బాగా , కొత్త హార్మోన్లుకు సర్దుబాటు చేసుకుంటుంది. తర్వాత చిన్న చిన్న విషయాలకు అందోళన లేదా ఉన్నట్లుండి మనసు మార్చుకోవడం జరుగుతుంటుంది.



Click it and Unblock the Notifications