Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మార్నింగ్ సిక్ నెస్ ను నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్
మార్నింగ్ సిక్ నెస్‌లో పేరుకు తగ్గట్టుగానే ఉదయం లేచిన వెంటనే కడుపులో వికారం, అనారోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. వాంతి కూడా అవుతుంది. ఉదయమే కాకుండా మిగిలిన వేళల్లో కూడా వాంతులవుతాయి. ఈ వాంతులు పసరు కలిగి ఉంటాయి. ఈ వాంతుల వల్ల ఆరోగ్యమేమీ చెడిపోదు. సుమారు మూడు నెలల పాటు ఈ వాంతుల వల్ల ఇబ్బంది ఎదురవుతుంది. తర్వాత నెమ్మదిగా తగ్గుముఖంపడతాయి. రెండో రకం అంతే తీవ్రమైన వాంతులలో ఆరోగ్యం కొద్దిగా దెబ్బతింటుందట.
గర్భవతుల్లో సుమారుగా 50 శాతం మహిళలు మార్నింగ్ సిక్ నెస్ లేదా ఉదయ వేళ వికారంతో బాధ పడుతూంటారు. కొంతమందికి ఇది తీవ్రంగా వుంటుంది. పేరుకు ఇది మార్నింగ్ సిక్ నెస్ అయినప్పటికి రోజులో ఏ సమయంలోనైనా రావచ్చు. వికారం, చూపు మందగించుట, ఆకలి లేకపోవుట దీని లక్షణాలు.
గర్భవతులకు మొదటి త్రైమాసికంలో ఇది వస్తుంది. మార్నింగ్ సిక్ నెస్ ఒక్కోసారి డీహైడ్రేషన్ కూడా కలిగించి కడుపులో వున్న బేబీకి హాని కలిగించగలదు. మార్నింగ్ సిక్ నెస్ అనేది చాలా సాధారణ సమస్య . దీని గురించి భయపడాల్సిన అవసరం లేదు. మార్నింగ్ సిక్ నెస్ వల్ల వచ్చే వాంతులు, వికారంను నివారించుకోవడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ ఎఫెక్టివ్ గా సహాయపడుతాయి. మరి అవేంటో చూద్దాం...

నిమ్మరసం :
వికారంను తగ్గించడంలో నేచురల్ రెమెడీ నిమ్మరసం. నిమ్మరసంను ఒక గ్లాసు నీటిలో మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం తాగడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ వల్ల ఉపశమనం కలుగుతుంది.

అల్లం:
అల్లం రూట్ లో జింజరోల్ మరియు షోగోల్స్ అనే కెమికల్స్ ఉండటం వల్ల గర్భిణీలో వాంతులు మరియు వికారం నుండి ఉపశమనం కలిగిస్తాయి.
5చుక్కల అల్లం రసంలో ఒక చెంచా తేనె మిక్స్ చేసి నిద్రలేచిన తర్వాత అవసరం అయినప్పుడు కొద్దికొద్దిగా తాగుతుండాలి.

కరివేపాకు:
కరివేపాకు ను మెత్తగా పేస్ట్ చేసి, రసం తియ్యాలి. దీనికి కొద్దిగా నిమ్మరసం, పంచదార మిక్స్ చేసి తీసుకోవడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ కారణంగా వికారం, వాంతులు నుండి ఉపశమనం కలుగుతుంది.

మింట్ లీవ్స్:
పింపర్ మింట్ లో అనెస్తిటిక్ లక్షణాలు పుష్లకంగా ఉన్నాయి . అందువల్ల పొట్టవిశ్రాంతి మరియు వికారంను తగ్గిస్తుంది: .
కొద్దిగా పుదీనా ఆకలు తీసుకొని ఒక కప్పు నీటిలో వేసి బాయిల్ చేయాలి. 10 నిముషాల తర్వాత వడగట్టి, కొద్దిగా పంచదార, తేనె మిక్స్ చేసి అవసరమయినప్పుడు తాగడం వల్ల వాంతులు వికారం నుండి ఉపశమనం కలుగుతుంది.

సోంపు:
సోంపులో ఆరోమాటిక్ మరియు లికోరైస్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఇది పొట్టకు ఉపశమనం కలిగిస్తుంది. ఫ్యాట్ గా రిలీఫ్ అందిస్తుంది . ఫెన్నల్ టీ తాగడం వల్ల వికారం వాంతులు తగ్గతాయి.

క్రాకర్స్:
క్రాకర్స్ మంచి ఉపాయం. వికారంగా ఉన్నప్పుడు క్రాకర్స్ తో దినచర్యను ప్రారంభించడం మంచిది . అలాగే నిద్రించే ముందు కూడా కొద్దిగా తినడం వల్ల వాంతులు వికారంను తగ్గించుకోవచ్చు.

పొటాటో చిప్ప్:
ఎటువంటి సందేహం లేకుండా పొటాటో చిప్స్ ను తినవచ్చు, వీటిని తనడం వల్ల పొట్టకు ఉపశమనం. ఎక్కువ లాలాజలం ఉత్పత్తి కావడం వల్ల వికారంను తగ్గిస్తుంది.

వాటర్:
గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా రోజుకు సరిపడా నీరు త్రాగాలి. సాధ్యమైనంత వరకూ బాడీని హైడ్రేషన్ లో ఉంచుకోవాలి . దాంతో మార్నింగ్ సిక్ నెస్ ను నివారించుకోవచ్చు.



Click it and Unblock the Notifications