For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు నీటిలో నానబెట్టిన బాదం తినడమే శ్రేయస్కరం, ఎందుకంటే !?

By Super Admin
|

ఆల్మండ్స్ (బాదం) ఒక న్యూట్రీషియన్ డ్రైనట్. వివిధ రకాల డ్రైఫ్రూట్స్ లో బాదం ఒకటి. ఇందులో పోషక విలువలు ఎక్కువగా ఉన్నాయి. బాదం గర్భిణీలు తినడం వల్ల అది తల్లికి మాత్రమే కాదు, బేబికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో నట్స్ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. డ్రై నట్స్ లో ఏఒక్కటి రెగ్యులర్ డైట్ లో చేర్చుకున్నా...ఆరోగ్యానికి గొప్పగా సహాయపడుతాయి. ఈ బాదంలో హెల్తీ ఫ్యాట్స్, న్యూట్రీషియన్స్, విటమిన్స్, మరియు క్యాలరీ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీలో నెలలు నిండే కొద్ది ఇవన్నీ తల్లి బిడ్డకు చాలా అవసరమవుతాయి. కాబట్టి వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం చాలా అవసరం

బాదంను గర్భిణీలు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం ఆరోగ్యానికి మేలు జరగుతుంది. అయితే డ్రైట్స్ అలర్జీ ఉన్నవారు, వీటిని వేరే రూపంలో తీసుకోవడం మంచిది. గర్భిణీలకు ఇతర నట్స్ అలర్జీ కలిగించినా, బాదం అలర్జీ కలిగించదని నిపుణులు సూచిస్తున్నారు. బాదంను నేరుగా అలాగే తీసుకోవడం కంటే ఇతర పదార్థాలైన సలాడ్స్, మిల్క్ షేక్స్ లలో జోడించి తీసుకోవడం మంచిది. బాదంను స్వీట్స్ తయారీలో కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇలాంటి వాటిని కూడా స్నాక్స్ టైమ్ లో తీసుకోవచ్చు. అంతే కాదు, ఎక్కువ ఆకలిగా ఉన్నప్పుడు, నట్స్ తినడం వల్ల పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది.

అయితే బాదంను గర్భిణీలు ఏవిధంగా తినాలి? ఏ సమయంలో తినాలని తెలుసుకుంటే మరింన్ని ప్రయోజనాలను పొందవచ్చు. గర్భిణీలు బాదంను రాత్రిలో నీటిలో నానబెట్టి, ఉదయం వాటి మీద ఉన్నలేయర్ స్కిన్ తొలగించి ఉదయం పరగడపున తింటే మరీ మంచిది. అలాగే తినడం కంటే ఇలా నీటిలో నాబెట్టి తినడం వల్ల ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఇలా తినడం వల్ల పవర్ ఫుల్ న్యూట్రీషియన్స్ అందుతాయి. ఈ న్యూట్రీసియన్స్ తల్లి బిడ్డకు సురక్షితమైనవి. గర్భిణీ స్త్రీలు బాదం తినడం వల్ల పొందే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం...

1. ప్రోటీన్స్ ఎక్కువగా అందుతాయి:

1. ప్రోటీన్స్ ఎక్కువగా అందుతాయి:

బాదంలోఉండే హై ప్రోటీన్ కంటెంట్ పొట్టలో పెరిగే బిడ్డకు మజిల్ మాస్ ఏర్పడుటకు సహాయపడుతుంది. అంతే కాదు తల్లి కూడా ప్రోటీనుల అవసరం చాలా ఉంటుంది. తల్లికి తగినంత ఎనర్జీని అందిస్తుంది. స్టామిన పెరుగుతుంది. డెలివరీ సమయానికి బాడీని స్ట్రాంగ్ గా మార్చుతాయి. బేబీ ఆరోగ్యకరమైన బరువును కలిగి ఉండుటకు సహాయపడుతుంది.

2. ఫైబర్:

2. ఫైబర్:

బాదంలో ఉండే ఫైబర్ కంటెంట్ సులభంగా జీర్ణమవుతుంది. బౌల్ మూమెంట్ ను క్రమబద్దం చేస్తుంది. దాంతో తల్లి బిడ్డలో మలబద్దక సమస్యలుండవు. గర్భధారణ సమయంలో ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తుంటారు. అలాంటి ఫైబర్ ఫుడ్స్ లో ఎంపిక చేసుకోవడానికి బాదం ఎక్సలెంట్ చాయిస్.

3. విటమిన్ ఇ:

3. విటమిన్ ఇ:

బాదంలో ఉండే విటమిన్ ఇ కంటెంట్ బేబీలో హెల్తీ స్కిన్ అండ్ హెయిర్ ఏర్పడుటకు సహాయపడుతుంది. తల్లికి కూడా గ్రేట్ గా సహాయపడుతాయి. హెల్తీ స్కిన్ అండ్ హెయిర్ ను ప్రోత్సహిస్తుంది.

4. క్యాల్షియం :

4. క్యాల్షియం :

బాదంలో ఉండే హైలెవల్ క్యాల్షియం గర్భధారణ సమయంలో తల్లిలో హైబపర్ టెన్షన్ తగ్గిస్తుంది మరియు నిద్రలేమి సమస్యలను తగ్గిస్తుంది. క్యాల్షియం పుట్టబోయే బిడ్డలో దంతాలు, ఎముకలు స్ట్రాంగ్ గా ఉంటాయి

5. మ్యాంగనీస్ :

5. మ్యాంగనీస్ :

బాదంలో మ్యాంగనీస్ తల్లి, బిడ్డలో హెల్త్ బాడీని క్రమబద్ద చేయడానికి సహాయపడుతుంది. అలాగే తల్లి బిడ్డలో స్ట్రాంగ్ అండ్ హెల్తీ బోన్స్ ఏర్పాటుకు సహాయపడుతుంది.

6. రిభోఫ్లోవిన్:

6. రిభోఫ్లోవిన్:

బాదంలో ఉండే రిభోఫ్లోవిన్ బేబీలో ద్రుష్టి లోపాలను తగ్గిస్తుంది. బాదంలో ఉండే రిబోఫ్లోవిన్ బేబికి అసవరమయ్యే ఎనర్జీ లెవల్స్ ను అందిస్తుంది.

7. మెగ్నీషియం :

7. మెగ్నీషియం :

బాదంలో ఉండే మెగ్నీషియం బేబీ సెంట్రల్ నెర్వస్ సిస్టమ్ (ప్రధాణ నాడీ వ్యవస్థ) స్ట్రాంగ్ గా ఏర్పడుటకు సహాయపడుతుంది. అలాగే రెగ్యులర్ బౌల్ మూమెంట్ కు సహాయపడుతుంది.

8. ఫొల్లెట్ :

8. ఫొల్లెట్ :

బాదంలో ఉండే ఫొల్లెట్ లేదా విటమిన్ బి9 బేబీలో బ్రెయిన్ మిరయు సెట్రల్ నెర్వస్ సిస్టమ్ ఫార్మేషన్ కు సహాయపడుతుంది. ఫొల్లెట్ బేబీగ్రోత్ కు సహాయపడుతుంది . నేచురల్ ట్యూబ్ డిఫెక్ట్స్ ను నివారిస్తుంది. బేబీ ఆరోగ్యంగా పెరగడానికి సహాయపడుతుంది.

9. ఫోలిక్ యాసిడ్ :

9. ఫోలిక్ యాసిడ్ :

రాత్రంతా నీటిలో నానబెట్టిన బాదం తీసుకోవడం వల్ల ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా అందుతుంది. ఇది కడుపులో పెరిగే బిడ్డకు కూడా చాలా మేలు చేస్తుంది. ఇది కడుపులో పెరిగే బిడ్డ యొక్క మొదడుకు, నాడీవ్యవస్థకు చాలా ఉపయోగపడుతుంది. బాదం నానబెట్టినవి తినడం వల్ల తేలికగా జీర్ణమవుతుంది కాబట్టి, గర్భిణీలు నానబెట్టిన బాదం తీసుకోవడం శ్రేయస్కరం..

10. హైబ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

10. హైబ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

గర్భిణీలో బ్లడ్ ప్రెజర్ సమస్య సాధారణంగా ఉంటుంది. హైబ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేయడానికి బాదం గ్రేట్ గా సహాయపడుతాయి. నానబెట్టిన బాదంలో టోకోఫెరల్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది.

English summary

9 Amazing Benefits Of Eating Almonds During Pregnancy

Almonds contain some essential nutrients vital for the healthy development of your baby. Having nuts during pregnancy is important. Nuts contain essential healthy fat, nutrients, vitamin and calories that pregnant women necessarily require to cope with growing needs each trimester.
Desktop Bottom Promotion