For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు పనసతొనలు తినడం ఆరోగ్యానికి సురక్షితమా..కాదా?

గర్భిణీలు పనసతొనలు తినడం ఆరోగ్యానికి సురక్షితమా..కాదా?

By Lekhaka
|

గర్భిణీలకు ఆహారాల మీద కోరికలు ఎక్కువ అంటుంటారు. ఖచ్చితంగా నిజమనే చెప్పవచ్చు. ఎప్పుడూ తినని ఆహారాలను కూడా ఈ సమయంలో ఇష్టపడుతుంటారు. గర్భిణీలు గర్భధారణ సమయంలో ఫ్రూట్స్ ఎక్కువ ఇష్టపడుతుంటారు. అయితే ఎలాంటి పండ్లు తినాలి? ఎలాంటి పండ్లు తినకూడదన్న సందేహం కూడా ఉంటుంది. ముఖ్యంగా బొప్పాయి, ద్రాక్ష, పైనాపిల్ , పనసకాయ తినకూడదన్న సందేహంచాలా మందిలో ఉంది. అయితే అది అక్షరాల అబద్దం అనే చెప్పవచ్చు. గర్భం దాల్చిన తర్వాత మితంగా ఏ పండు తిన్నా ఆరోగ్యానికి హాని జరగదు.

గర్భిణీలు జాక్ ఫ్రూట్ (పనసకాయ) తినడం వల్ల వండర్ ఫుల్ బెనిఫిట్స్ పొందుతారు. అయితే పరిమితంగా మాత్రమే తీసుకోవాలి. పరిమితంగా తీసుకోవడం వల్ల ఎలాంటి గర్భశ్రావాలు జరగవు. గర్భిణీలు గర్భధారణ కాలంలో పనసకాయ ఎందుకు తినాలన్నదానికి, శాస్త్రీయ నిర్ధారణలు కూడా ఉన్నాయి . అయితే మీకు ఇప్పటికీ అనుమానం ఉంటే మీ గైనిక్ ను సంప్రదించి తర్వాత తీసుకోవడం మంచిది

కొంత మంది గైనకాలజిస్ట్ ల అభిప్రాయం ప్రకారం , గర్భిణీలు అన్ని రకాల ఫ్రూట్స్ తినవచ్చని సూచిస్తున్నారు. అయితే ఓవర్ గా మాత్రం తీసుకోకూడదని, ముఖ్యంగా హీట్ ను జనరేట్ చేసే పండ్లను పరిమితంగా మాత్రం తీసుకోవాలని సూచిస్తుంటారు. గైనకాలజిస్ట్ ప్రకారం జాక్ ఫ్రూట్ ను కూడా పరిమితంగా తీసుకుంటే ఎలాంటి ప్రమాధం ఉండదు. పనసకాయలో బిటమిన్ బి6 మరియు ఇతర న్యూట్రీషియన్స్, పొటాషియం, యాంటీఆక్సిడెంట్స్ లు ఎక్కువగా ఉంటాయి. పనసకాయ త్వరగా జీర్ణమవుతుంది.వీటితో పాటు మరికొన్ని ప్రయోజనాలు ఈ క్రింది విధంగా..

1. హర్మోన్స్ :

1. హర్మోన్స్ :

పనసకాయను మితంగా తీసుకోవడం వల్ల హార్మోన్స్ ను క్రమబద్దం చేస్తుంది.

2. స్ట్రెస్:

2. స్ట్రెస్:

పనసతొనలు పరిమితంగా తినడం వల్ల ప్రీనేటల్ మరియు పోస్ట్ నేటల్ స్ట్రెస్ ను తగ్గిస్తుంది.

3. ఫీటల్ డెవలప్ మెంట్:

3. ఫీటల్ డెవలప్ మెంట్:

జాక్ ఫ్రూట్ తినడం విటమిన్ ఎ ఇంప్రూవ్ అవుతుంది, ఇది పిండం డెవలప్ అవ్వడానికి, కళ్ళు, బాడీలో కణాలు ఏర్పాటుకుసహాయపడుతుంది.

4. జాక్ ఫ్రూట్ :

4. జాక్ ఫ్రూట్ :

పనసతొనల్లో సోడియం ,సాచురేటెడ్ ఫ్యాట్స్ తక్కువ.

5. ఫైబర్:

5. ఫైబర్:

పనసతొనలు పరిమితంగా తీసుకోవడం వల్ల జీర్ణశక్తికి అవసరమయ్యే ఫైబర్ ను అందిస్తుంది.

6. అల్సర్ :

6. అల్సర్ :

పనసతొనలు మితంగా తీసుకుంటే అల్సర్ తగ్గిస్తుంది. ఇంకా ఇందులో హైపర్ సెన్సిటివ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి.

7. ఎనర్జీ :

7. ఎనర్జీ :

పనసతొనల్లో విటమిన్ ఎ, బి, సి మరియు డిలున్నాయి. ఇది శరీరానికి అవసరమయ్యే ఫైబర్ ను ఎక్కువగా అందిస్తుంది. కార్బోహైడ్రేట్స్ , 95K కాలరీలను అందించి ఎనర్జీ లెవల్స్ పెంచుతుంది.

8. న్యూట్రీషియన్స్ ఎక్కువ :

8. న్యూట్రీషియన్స్ ఎక్కువ :

హెల్తీ ప్యాకేజ్. జాక్ ఫ్రూట్ లో బీటా కెరోటిన్, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్, పొటాషియం, మరియు మెగ్నీషియం ఎక్కువగా .

9. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

9. బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:

జాక్ ఫ్రూట్ బ్లడ్ ప్రెజర్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

9 Benefits of Jackfruit During Pregnancy

The fruit is mostly available during the summer months. This fruit contains high quantity of saponins, lignans, phytonutrients, and isoflavones. All these properties make Jackfruit an anti-cancer element, which helps in the removal of the free radicals from cells that aids in the process of cancer growth reduction.
Desktop Bottom Promotion