For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో గర్భిణీల్లో హార్ట్ బర్న్ నివారించే 9 ఎఫెక్టివ్ హోం రెమెడీస్

హార్ట్ బర్న్ ఉన్నప్పుడు, గొంతు నొప్పి, మింగడానికి ఇబ్బందిగా ఉండటం, శ్వాసలో ఇబ్బందిలు, ఆందోళన, మోషన్ లో రక్తం, సడెన్ గా బ్యాక్ పెయిన్ , షోల్డర్ పెయిన్, తలతిరగడం, అజీర్తి అనిపించడం, చెస్ట్ లో నొప్పి వంట

|

మహిళ గర్భం పొందిన తర్వాత ఆమె శరీరంలో మార్పులు సహజంగా ఏర్పడుతుంటాయి. మార్పులతో అసౌకర్యం, వికారం, వాంతులు వాటితో ఇబ్బంది పడుతుంది. సాధారణంగా గర్భిణీలు ఎసిడిటి లేదా అజీర్థి, వికారం వంటి వివిధ రకాల సమస్యల్లో హార్ట్ బర్న్ ఒకటి. సెడన్ గా చాతీలో మంట కలుగుతుంది. హార్ట్ బర్న్ కు చాలా మంది ఆందోళన చెందుతుంటారు. అయితే హార్ట్ బర్న్ ను లక్షణాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే కొన్ని సీరియస్ లక్షణాలు మరింత ప్రమాదకర స్థితికి దారితీస్తాయి. హార్ట్ బర్న్ కు సంబంధించి మొదటి సంకేతం కనబడగానే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది.

గర్భిణీల్లో హార్ట్ బర్న్ కు వివిధ రకాల కారణాలున్నాయి. అసిడిక్ రిఫ్లెక్షన్స్, లేట్ ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకునే ఆహారాలు సరిగా జీర్ణమవ్వకపోవడం వల్ల ఈసోఫోగస్ ట్యూబ్ లో ఉండిపోవటం, తిన్న వెంటనే పుడుకోవడం, సరినైన భంగిమలో పడుకోకపోవడం వంటి కారణాలున్నాయి. వీటినే కార్డియక్ స్పిస్టర్ అని పిలుస్తారు. కార్డియక్ స్పిన్టర్ వల్ల పొట్టలో ఆహారం స్టక్ అవుతుంది. దాంతో హార్ట్ బర్న్ కు దారితీస్తుంది. అలాగే హిటల్ హెర్నియా , ఫిలోరి ఇన్ఫెక్షన్స్, గ్యాస్ట్రిక్, కాంప్లికేటెడ్ మల్టిపుల్డ్ బేబీ ప్రెగ్నెన్సీ, వంటివన్నీ హార్ట్ బర్న్ కు ముఖ్య కారణాలు.

అలాగే ఓవర్ వెయిట్, స్మోకింగ్, ఆయిల్ ఫుడ్స్, స్పైసీ ఫుడ్స్, ఆల్కహాల్, కెఫిన్, మెరికేషన్స్, మలబద్దకానికి తీసుకునే మందులు వంటి సహజ ఆహారపు అలవాట్లు కూడా హార్ట్ బర్న్ కు దారితీస్తుంది. హార్ట్ బర్న్ ఉన్నప్పుడు, గొంతు నొప్పి, మింగడానికి ఇబ్బందిగా ఉండటం, శ్వాసలో ఇబ్బందిలు, ఆందోళన, మోషన్ లో రక్తం, సడెన్ గా బ్యాక్ పెయిన్ , షోల్డర్ పెయిన్, తలతిరగడం, అజీర్తి అనిపించడం, చెస్ట్ లో నొప్పి వంటి లక్షణాలు కనబడుతాయి.

గర్భధారణ సమయంలో హార్ట్ బర్న్ నివారించుకోవడానికి వివిధ రకాల హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా నయం చేస్తాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం...

బాదం:

బాదం:

హార్ట్ బర్న్ నివారించడంలో బాదం గొప్పది. ఇందులో ఆయిల్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది హార్ట్ బర్న్, స్టొమక్ యాసిడ్స్ ప్రొడక్షన్ తగ్గిస్తుంది.

అలోవెర జ్యూస్ :

అలోవెర జ్యూస్ :

కలబందలో నయం చేసే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. అలోవెర జెల్ ను తీసీ, ఒక టీస్పూన్ రెగ్యులర్ గా తింటుంటే సమస్య త్వరగా నయం అవుతుంది, మరియు ఇతర సమస్యలను నివారిస్తుంది. చర్మంలో గ్లో వస్తుంది.

కోకనట్ వాటర్ :

కోకనట్ వాటర్ :

కోకనట్ వాటర్ లో ఉండే న్యూట్రీషియన్స్, ఎలక్ట్రోలైట్స్ హార్ట్ బర్న్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. యాసిడ్స్ న్యూట్రలైజ్ చేయడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. గర్భిణీలకు కొబ్బరి నీళ్ళు తాగడం మంచిది.

సోంపు:

సోంపు:

సోంపు వివిధ రకాల వంటల్లో జోడిస్తుంటారు. మంచి ఫ్లేవర్ మాత్రమే కాదు, హార్ట్ బర్న్ నివారించడంలో కూడా ఇది గ్రేట్ గా సహాయపడుతుంది. ఒక కప్పు వేడి నీటిలో అరటీస్పూన్ సోంపు వేసి 10 నిముషాలు మరిగించాలి. హార్ట్ బర్న్ నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

ఆపిల్ సైడర్ వెనిగర్ :

ఆపిల్ సైడర్ వెనిగర్ :

వెనిగర్ చాలా టేస్ట్ గా మరియు రుచికరంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల పొట్టలో యాసిడ్స్ తక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇది హార్ట్ బర్న్ వెంటనే తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

అల్లం:

అల్లం:

అల్లంలో అనేక ఔషధ గుణాలున్నాయి. దీన్ని నేచురల్ అసిడస్ గ్యాస్ట్రోఇన్ టెన్సినల్ ట్రాక్ లో విడుదతలవుతాయి, ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు జింజర్ టీ తాగడం వల్ల హార్ట్ బర్న్ నుండి ఉపశమనం పొందవచ్చు.

హెర్బల్ టీ:

హెర్బల్ టీ:

హార్ట్ బర్న్ నివారించడంలో ఒక స్పెషల్ టీ . బెస్ట్ రెమెడీ. ఇది కొన్ని స్టోర్స్ లో అందుబాటులో ఉంటుంది. కొన్ని రకాల హెర్బల్ సీడ్స్, లీవ్స్ తీ తయారు చేసి ఉంటారు. ఇది హార్ట్ బర్న్ చాలా ఎఫెక్టివ్ గా నివారిస్తుంది.

బొప్పాయి:

బొప్పాయి:

బాగా పండిన బొప్పాయి డైజెస్టివ్ సిస్టమ్ కు గ్రేట్ గా బెనిఫిట్స్ అందిస్తుంది. దాంతో హార్ట్ బర్న్ తగ్గించుకోవచ్చు.

ఫ్రెష్ లిక్విడ్స్ :

ఫ్రెష్ లిక్విడ్స్ :

హార్ట్ బర్న్ నివారించడానికి లిక్విడ్స్ కంటే మరేదీ గొప్పగా నయం చేయవు. కాబట్టి ఎప్పటికప్పు ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్ మరియు వాటర్ ను ఎక్కువగా తాగాలి.

English summary

9 Effective Home Remedies To Cure Heartburn During Pregnancy

Heartburn is one problem that is very common for women during pregnancy. Most pregnant women feel a burning sensation in the chest, usually behind the sternum or breastbone.Thankfully, there are some natural cures for heartburn while pregnant which can help you reduce the problem considerably.
Story first published: Thursday, December 8, 2016, 11:41 [IST]
Desktop Bottom Promotion