Latest Updates
-
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
గర్భిణీ స్త్రీలు డార్క్ చాక్లెట్స్ తినడానికి ఖచ్చితమైన కారణాలు...
మీరు గర్భం పొందారా?మీకు చాక్లెట్స్ తినడం అంటే మహా ఇష్టమా?అయితే మీకు ఒక శుభవార్త!గర్భధారణ సమయంలో గర్భిణీలు డార్క్ చాక్లెట్ తినడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలు పొందుతారని కొన్ని పరిశోధనలు నిర్ధారించాయి. డార్క్ చాక్లెట్ గర్భిణీలకు చాలా బారీగా ఉపయోగపడుతుందని తెలిపారు. ఈఆర్టికల్లో గర్భిణీలు డార్క్ చాక్లెట్ తినడానికి గల 5 ముఖ్య కారణాలను వివరించింది.
గర్భిణీ స్త్రీలు గర్భధారన సమయంలో ఎదుర్కొనే కొన్ని సమస్యలను డార్క్ చాక్లెట్ తినడం వల్ల చాలా ఎఫెక్టివ్ గా నివారించుకోవచ్చని నిర్ధారించారు. వాటిని గురించి గర్భిణీలు తెలుసుకోవడం చాలా అవసరం. మరీ ముఖ్యంగా, గర్భిణీల్లో స్ట్రెస్ లెవల్స్ ను తగ్గించి ప్రశాంత పరిచే కొన్ని అతి ముఖ్యమైనటువంటి ఎలిమెంట్స్ ఈ చాక్లెట్ లో ఉన్నట్లు కనుగొన్నారు. అలాగే ఇది గర్భిణీ స్త్రీలలో డిప్రెషన్ కూడా తగ్గిస్తుంది.
మరి గర్భిణీస్త్రీలు, డార్క్ చాక్లెట్ తినడానికి గల కారణాలను ఈ క్రింది విధంగా ఉన్నాయి. వీటిని తెలుసుకొని గర్భాధారణ సమయంలో డార్క్ చాక్లెట్ తినడానికి ప్రయత్నించండి.,...

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది
డార్క్ చాక్లెట్ ను కోకోతో తయారుచేస్తారు. ఇందులో థియోబ్రొమైన్ కలిగి ఉండి ఇది రక్తప్రసరణను పెంచుతుంది. మరియు ఈ థియోబ్రోమైన్ కడుపులో పెరిగే శిశువుకు కూడా అవసరం అయ్యే రక్తప్రసరణను అందిస్తుంది. గర్భిణీ స్త్రీలకు డార్క్ చాక్లెట్ వల్ల ఇది ఒక అత్యంత ముఖ్యమైనటువంటి ఆరోగ్యప్రయోజనం.

యాంటీఆక్సిడ్స్
డార్క్ చాక్లెట్ లో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో ఫ్రీరాడికల్స్ ను తొలగించడంలో సహాయపడుతాయి. అలాగే కడుపులో పెరిగే శిశువు కూడా హానికరమైన ఫ్రీరాడికల్స్ నుండి రక్షింపబడుతుంది. ఇది కూడా ఒక మంచి కారణం.

ఐరన్ అండ్ మెగ్నీషియం
డార్క్ చాక్లెట్ లో ఐరన్ మరియు మెగ్నీషియం పుష్కలంగా ఉండి, గర్భిణీలో ఇది హీమోగ్లోబిన్ కౌంట్ ను మెయింటైన్ చేయడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా మెగ్నీషియం ఖచ్చితంగా ఫ్యాటీయాసిడ్స్ యొక్క మెటబాలిజం రేటు పెంచుతుంది.

హార్ట్ డిసీజ్
డార్క్ చాక్లెట్ తినడం వల్ల గర్భిణీ స్త్రీ యొక్క గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది. ఎలాంటీ గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఎదుర్కొంటుంది. కాబట్టి, గర్భిణీలు డార్క్ చాక్లెట్ తినడానికి ఇది కూడా ఇక ఖచ్చితమైనటువంటి కారణంగా ఉంది.

కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది
డార్క్ చాక్లెట్ లో షుగర్ మరియు ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల గర్భిణీలలో కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.

ఒత్తిడి తగ్గిస్తుంది
గర్భిణీలు డార్క్ చాక్లెట్ తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ రెగ్యులేషన్ వల్ల మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండుట వల్ల మహిళల్లో స్ట్రెస్ లెవల్స్ తగ్గిస్తుంది.

గర్భాశయం మరింత స్ట్రాంగ్ గా మారుతుందని క
ఇంకా, చాక్లెట్స్ తినడం వల్ల గర్భాశయం మరింత స్ట్రాంగ్ గా మారుతుందని కనుగొన్నారు. ఆరోగ్యకరమైన బేబీ పుట్టుకకు ఈ గర్భశయ ఆరోగ్యం అత్యంత ముఖ్యమైనది.

ఫీటల్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతుంది
చాక్లెట్స రెగ్యులర్ గా తినడం వల్ల ఫీటల్ డెవలప్ మెంట్ కు గ్రేట్ గా సహాయపడుతుంది, అంతే కాదు గర్భిణీ స్త్రీకి కూడా ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.

ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు
ఇతరులతో పోల్చినప్పుడు గర్భణీలు డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. గర్భిణీ స్త్రీలు వారంలో 5 డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల మరిన్ని ఎక్కువ ప్రయోజనాలు పొందుతారని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో వెల్లడి చేశారు!



Click it and Unblock the Notifications