Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భణీ మహిళలు లెమన్ గ్రాస్ తింటే పొందే ప్రయోజనాలు
లెమన్ గ్రాస్(నిమ్మ గడ్డి), పెరినియల్ గ్రాస్ అని కూడా పిలుస్తుంటారు. గర్భిణీల ఆహారంలో తప్పనిసరిగి చేర్చుకోవాల్సిన వాటిలో లెమన్ గ్రాస్ ఒకటి . ఎందుకంటే లెమన్ గ్రాస్ లో ఫోలిక్ యాసిడ్, జింక్, మెగ్నీషియం, కాపర్, ఐరన్, క్యాల్షియం , మెగ్నీషియం, విటమిన్ ఎ, ఫాస్పరస్ మరియు విటమిన్ సిలు పుష్కలంగా ఉన్నాయి.
లెమన్ గ్రాస్ బహువిధాలుగా సహాయపడుతుంది. ఎందుకంటే లెమన్ గ్రాస్ లో అనాల్జిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఆస్ట్రిజెంట్, కార్మినేటివ్, యాంటీ బ్యాక్టీరియల్, మరియు యాంటీ క్యాన్సేరియస్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . ఇది బహుప్రయోజనాలను అందించే మూలిక . ముఖ్యంగా ఎవరైతే గర్భంతో ఉంటారో వారికి మరియు పాలిచ్చే తల్లులకు ప్రయోజనకరం.
అంతే కాదు, గర్భధారణ సమయంలో కూడా లెమన్ గ్రాస్ తీసుకోవడం గర్భిణీ మహిళలకు సురక్షితమే . కానీ మితంగా మాత్రమే తీసుకోవాలి . అధిక రక్తస్రావం వల్ల గర్భస్రావం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది.
ఇంకా, లెమన్ గ్రాస్ లో మరిన్ని ఇతర ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి . ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, యాంటీ క్యాన్సేరియస్ గుణాలను కలిగి ఉంది, ఒత్తిడి తగ్గిస్తుంది. శరీరాన్ని డిటాక్సిఫై చేస్తుంది మరియు కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తుంది.
అదే విధంగా , లెమన్ గ్రాస్ వల్ల గర్భిణీలకు మరికొన్ని ఇతర సురక్షితమైన ఆరోగ్యప్రయోజనాలు కూడా ఉన్నాయి . మరి అవేంటో ఒక సారి తెలుసుకుందాం..

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: గర్భధారణ సమయంలో జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది . లెమన్ గ్రాస్ లో ఉండే కాంపౌండ్స్ ప్రేగుల్లో , జీర్ణవాహికలోఉండే బ్యాక్టీరియాను నాశనం చేసి, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది: లెమన్ గ్రాస్ లో యాంటీ కొలెస్ట్రాల్ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరంలో ఎక్సెస్ కొలెస్ట్రాల్ ను శరీరం నుండి తొలగిస్తుంది . దాంతో పాటు ఎల్ డిఎల్ కొలెస్ట్రాల్ ఆక్సిడేషన్ కు సహాయపడుతుంది.

శరీరం డిటాక్సిఫై చేస్తుంది: లెమన్ గ్రాస్ ను తీసుకోవడం వల్ల శరీరంను శుభ్రపరస్తుంది . శరీరంలోని టాక్సిన్స్ ను శరీరం నుండి బయటకు నెట్టివేస్తుంది . ముఖ్యంగా శరీరంలో బ్లాడర్, కిడ్నీలో ఉన్న వ్యర్థాలను తొలగించడంలో మరియు వీటికి సరిగా రక్తప్రసరణ అందివ్వడంలో గొప్పగా సహాయపడుతుంది.
ఒత్తిడి తగ్గిస్తుంది: లెమన్ గ్రాస్ ఆయిల్ మంచి సువాసన కలిగి ఉంటుంది . దాంతో డిప్రెషన్ , ఆందోళన మరియు మనస్సు మారడం వంటి లక్షణాలను తగ్గించుకోవచ్చు . మరియు బాగా నిద్రపట్టేలా చేస్తుంది.

క్యాన్సర్ తో పోరాడుతుంది: లెమన్ గ్రాస్ ఫ్రీరాడికల్స్ తో పోరాడుతుంది మరియు శరీరంలో క్యాన్సర్ సెల్స్ పెరగకుండా వ్యతిరేకిస్తుంది . కాబట్టి, ఇది ఒక యాంటీ క్యాన్సేరియస్ ఏజెంట్ గా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications