Latest Updates
-
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా..
గర్భిణీ స్త్రీలలో సమ్మర్ డీహైడ్రేషన్ నివారించే వాటర్ మెలోన్ ..!
గర్భిణీ స్త్రీలు ఆరోగ్యంగా ఉండాలని వైద్యనిపుణులు సూచిస్తుంటారు. ముఖ్యంగా ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకుంటే ఎంతో శ్రేయస్కరం. గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన ఆరోగ్యకరమైన ఆహారాల్లో పుచ్చకాయ ఒకటి.
వేసవికాలంలోపుచ్చకాయ చాల విరివిగా దొరుకుతుంది. పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అందుకే గర్భిణీ స్త్రీలు దీన్ని ఎక్కువగా తీసుకోవచ్చు . అంతే కాదు పుచ్చకాయలో విటమిన్ సి, విటిమన్ బి కాంప్లెక్స్, మరియు విటమిన్ ఎ లు కూడా అదికంగా ఉన్నాయి. వీటితో పాటు పొటాషియం మరియు మెగ్నీషియం కూడా అధికం ఉన్నాయి కాబట్టి, ఇవి హార్ట్ కు మరియు స్టొమక్ కు ఇవి చాల గ్రేట్ గా సహాయపడుతాయి.
గర్భధారణ సమయంలో గర్భిణీలు పుచ్చకాయను తినడం వల్ల ఇది మలబద్దకాన్ని నివారిస్తుంది, కాళ్ళు, చేతుల వాపులను నివారిస్తుంది. మరియు మార్నింగ్ సిక్ నెస్ ను ఎదుర్కొంటుంది. మరియు గర్భధారణ సమయంలో మరిన్ని ప్రయోజనాలను కూడా అందిస్తుంది:
గర్భిణి స్త్రీలు, మితంగా తీసుకోవచ్చు . ఎక్కువ తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ ను పెంచుతుంది.
మరి గర్భిణీ స్త్రీలకు పుచ్చకాయ తినడం వల్ల పొందే మరికొన్ని ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం....

1. డీహైడ్రేషన్ నివారిస్తుంది:
గర్భిణీ స్త్రీలలో డీహైడ్రేషన్ కు గురిఅయితే ప్రీమెచ్చుర్ బర్త్ మరియు యూట్రస్ సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, పుచ్చకాయను తీసుకోవడం వల్ల శరీరానికి అవసరం అయ్యే ద్రవాలు, మరియు విటమిన్స్ పుష్కలంగా అందిస్తాయి.

2. విటమిన్స్ పుష్కలం:
వాటర్ మెలోన్లో విటమిన్స్ అధికంగా ఉన్నాయి . ముఖ్యంగా ఇందులో విటమిన్ ఎ మరియు సిలు మరియు ఇతర న్యూట్రీషియన్స్ అధికంగా ఉన్నాయి . ఈ విటమిన్స్ మరియు మినిరల్స్ గర్భిణీ స్త్రీలకు చాలా అవసరం . కాబట్టి, గర్భిణీలు రోజూ పుచ్చకాయ తినడం చాలా అవసరం.

3. టాక్సిన్స్ తొలగిస్తుంది:
గర్భిణీలు వేసవిలో వాటర్ మెలోన్ తినడానికి వివిధ కారణాలున్నాయి .వాటర్ మెలోన్ లో అధికంగా నీరు ఉండటం వల్ల శరీరంలోని టాక్సిన్స్ తొలగించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది . అలాగే అలసటను నివారిస్తుంది.

4. విటమిన్ బి6 మరియు మెగ్నీషియం పుష్కలం:
గర్భిణీ స్త్రీలకు మరియు పొట్టలో పెరిగే బేబీలకు న్యూట్రీషియన్స్ అధికంగా అవసరం అవుతాయి . కాబట్టి, డాక్టర్ ను అడిగి వాటర్ మెలోన్ ను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి.

5. హార్ట్ బర్న్ తగ్గిస్తుంది:
హార్ట్ బర్న్ మరియు ఎసిడిటిని నివారిస్తుంది: గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు, ఎసిడిటి మరియు జీర్ణ సంబంధిత సమస్యలు వంటి సాధరణ సమస్యలను నివారిస్తుంది. హార్ట్ బర్న్ కు కారణం అయ్యే వాటర్ మెలోన్ ఎసిడిటి మరియు ఎసిడిక్ రిఫ్లెక్షన్ నివారిస్తుంది. పొట్ట మరియు జీర్ణవాహికకు చల్లదనం కలిగిస్తుంది.

6. మజిల్ క్రాంప్ తగ్గిస్తుంది:
ప్రెగ్నెన్సీలో మరో సాధారణ సమస్య మజిల్ క్రాంప్స్ . వాటర్ మెలోన్ లో ఉండే పొటాషియం, మెగ్నీషియం మరియు ఇతర మినిరల్స్ మజిల్ క్రాంప్స్ నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ముఖ్యంగా మూడో నెలలో మజిల్ క్రాంప్స్ ను నివారిస్తుంది.

7. లైకోపిన్ అధికం:
గర్భిణీ స్త్రీలు వాటర్ మెలోను తప్పనిసరిగా తీసుకోవాలి. ఎందుకంటే ఇందులో లికోపిన్ అధికంగా ఉంటుంది. ఇది మార్నింగ్ సికెనెస్ ను నివారిస్తుంది . వికారం ఉండదు. అంతే కాకుండా మెడికల్ రీసెర్చ్ ప్రకారం పుచ్చకాలో ఉండే లికోపిన్ ప్రెగ్నెన్సీ క్లాంపియాను నివారిస్తుందని వెల్లడి చేస్తున్నారు .



Click it and Unblock the Notifications