Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
గర్భిణీ స్త్రీలు స్వైన్ ఫ్లూ వాక్సిన్ తీసుకోవడం వల్ల పుట్టే పిల్లల్లో ఏమన్నా లోపాలు వస్తాయా?
గర్భిణీ స్త్రీలుగా ఉన్నపుడు పుట్టబోయే బిడ్డలా గురించి మనకు చాలా భయాలు ఉంటాయి కదా? అందువల్ల, గర్భం దాల్చి ఉన్నపుడు స్వైన్ ఫ్లూ వాక్సిన్ తీసుకుంటే పుట్టబోయే పిల్లల్లో లోపాలు వస్తాయేమోనని మనలో చాలామంది భ
గర్భిణీ స్త్రీలుగా ఉన్నపుడు పుట్టబోయే బిడ్డలా గురించి మనకు చాలా భయాలు ఉంటాయి కదా? అందువల్ల, గర్భం దాల్చి ఉన్నపుడు స్వైన్ ఫ్లూ వాక్సిన్ తీసుకుంటే పుట్టబోయే పిల్లల్లో లోపాలు వస్తాయేమోనని మనలో చాలామంది భయపడుతూ ఉంటాము.
ఇక, వివిధ రోగాలకు ఇచ్చే వాక్సిన్ల గురించి చాలా అపోహలు ప్రచారంలో ఉన్నాయి.

వాక్సిన్లు తీసుకోవడ౦ వల్ల దీర్ఘకాలంలో ప్రయోజనాలకన్నా నష్టాలే ఎక్కువ ఉంటాయని కొందరు వాదిస్తారు.
వ్యాధులను అరికట్టేందుకు కొన్ని వ్యాధికారక క్రిములకు వ్యతిరేకంగా నిరోధక శక్తి పెంపొందించేందుకు నరాలద్వారా యాంటీ జేనిక్ పదార్ధాన్ని శరీరంలోకి ఇవ్వడాన్ని వాక్సినేషన్ అని చెప్పుకోవచ్చు.
వాక్సినేషన్ ప్రయోజనాల వల్ల ఆటలమ్మ లాంటి చాలా ప్రమాదకరమైన జబ్బులను నిరోధించడం సాధ్యపడింది.
ఈమధ్య, స్వైన్ ఫ్లూ, అనే ఒక వైరల్ వ్యాధి బాగా ఎక్కువగా ఉంది. జ్వరం, దగ్గు, గొంతునొప్పి, అలసట మొదలైనవి స్వైన్ ఫ్లూ లక్షణాలు.
పిల్లలు, గర్భిణీ స్త్రీలలో రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది కనక, వారు త్వరగా స్వైన్ ఫ్లూ బారినపడే ప్రమాదం ఉంది.
అందువల్ల, గర్భిణీ స్త్రీలకూ స్వైన్ ఫ్లూ వాక్సిన్ ఇస్తే పుట్టబోయే పిల్లల్లో లోపాలు తలెత్తుతాయా? తెలుసుకుందాం.

గర్భిణీ స్త్రీల మీద వాక్సిన్ ప్రభావం
స్వైన్ ఫ్లూ వాడకం పిల్లల్లో లోపలకు దారితీస్తుందా
ప్రస్తుతం, ప్రపంచవ్యాప్తంగా గర్భిణీ స్త్రీలకూ వాక్సిన్లు ఇవ్వడం వల్ల పిల్లలమీద ఎలాంటి దుష్ప్రభావాలు ఉంటాయి అన్న విషయంపై చాలా పెద్ద చర్చే జరుగుతుంది.
అలాగే, పసిపిల్లలకు ఎమ్ ఎమ్ ఆర్ వాక్సిన్ ఇవ్వడం వల్ల వారిలో ఆటిజం ఏర్పడే అవకాసం ఉందని కొందరి నమ్మకం.
అయితే, ఇవన్నీ బలమైన శాస్త్రీయ ఆధారాలు లేని వాదనలు మాత్రమే. నిపుణుల పర్యవేక్షణలో సరైన మోతాదులో గర్భిణీ స్త్రీలకూ గాని, పిల్లలకు గాని వాక్సిన్లు ఇచ్చిన పక్షంలో దీర్ఘకాల దుష్ప్రభావాలు ఉండవని నిపుణులు వాదిస్తున్నారు.

స్వైన్ ఫ్లూ వాక్సిన్ వల్ల జనన లోపాలు వస్తాయా?
స్వైన్ ఫ్లూ వాక్సిన్ వల్ల పిల్లల్లో జనన లోపాలు తలెత్తుతాయా?
గర్భిణీ స్త్రీలకూ హెచ్ 1 ఎన్ 1 జ్వరం (స్వైన్ ఫ్లూ) తేలికగా వచ్చే అవకాసం ఉంది కనక ఆ వ్యాధిని నిరోధించేందుకు వైద్యులు గర్భిణీ స్త్రీలను స్వైన్ ఫ్లూ వాక్సిన్ తీసుకోమని సూచిస్తారు.
అలాగే, గర్భధారణ సమయంలో స్వైన్ ఫ్లూ వాక్సిన్ ఉపయోగించిన 7000 మంది స్త్రీలతో ఇటీవల నిర్వహించిన సర్వేలో వారి పిల్లల్లో వాక్సిన్ సంబంధించిన లోపాలేవీ తలెత్తలేదని గమనించారు.
అందువల్ల, చివరిగా తేలేదేమంటే గర్భిణీ స్త్రీలకూ స్వైన్ ఫ్లూ వాక్సిన్ ఇవ్వడం వల్ల పుట్టబోయే శిశువులలో లోపాలు తలెత్తుతాయి అనడానికి ఎలాంటి ఆధారాలు లభించలేదు.



Click it and Unblock the Notifications