Latest Updates
-
మహిళలను వేధిస్తున్న పీసీఓఎస్ సమస్య.. వాళ్లు ఏం చేయాలి ఏం చేయకూడదో తెలుసా.? -
శరవణ భవన్ స్టైల్ వెన్ పొంగల్..కొబ్బరి చట్నీతో తింటే మర్చిపోలేరు! -
తప్పతాగి రోడ్డుకి అడ్డంగా పడుకున్న యువతి.. ఒక చేతిలో సిగరెట్, పక్కనే మందు బాటిల్తో రచ్చ.! -
మెరిసే ముఖం కోసం ఇంట్లోనే ఫేస్ ఆయిల్.. రోజూ ఉదయం ఇలా చేస్తే చాలు.! -
అమ్మాయిల గురించి మీకు తెలియని 7 షాకింగ్ నిజాలు! -
శిల్పా శెట్టి స్పెషల్..పంచదార లేని పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం.. టేస్ట్ అదుర్స్! -
షుగర్ పేషెంట్లకు రోజులో ఎక్కువ డేంజరస్ టైం ఏది? బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ కి ఈజీ చిట్కాలు.. -
వర్క్ ఫ్రం హోంలో పెరుగుతున్న ఒత్తిడి.. ఆందోళన తగ్గేందుకు ఇలా చేయండి.! -
మెనోడివోర్స్ అంటే ఏంటి? నడివయసులో దాంపత్యం దారితప్పడానికి కారణమిదే.. -
పప్పులకు పురుగులు పడుతున్నాయా? ఈ ఒక్కటి వేస్తే చాలు ఏడాదైనా పాడవ్వవు!
పీరియడ్స్ టైమ్ లో.. రతిలో పాల్గొంటే గర్భం పొందే అవకాశం ఉంటుందా..?
రుతుక్రమం జరిగేటప్పుడు గర్భం దాల్చడం సాధ్యమేనా అని ఆశ్చర్యపోతున్నారా? తెలుసుకోవడానికి చదవండి.
రుతుక్రమం జరిగేటప్పుడు గర్భం దాల్చడం సాధ్యమేనా అని ఆశ్చర్యపోతున్నారా? తెలుసుకోవడానికి చదవండి.
నిజానికి, చాలా మంది స్త్రీలు బిడ్డ కోసం ప్రయత్నిస్తున్నా లేకున్నా తాము రుతుక్రమంలో వున్నప్పుడు గర్భం దాల్చడం సాధ్యమేనా కాదా అని అనుకుంటూ వుంటారు. సరే, మనకి తెలిసినట్లుగా, శృంగారంలో చురుగ్గా వుండే స్త్రీలు తాము రుతుక్రమంలో వుంటే గర్భం దాల్చినట్లు కాదని ఖచ్చితమైన సూచన. నిజానికి, చాలా సందర్భాల్లో రక్షణ లేని శృంగారంలో పాల్గొని, ఇప్పట్లో పిల్లల్ని కనాలని అనుకోని స్త్రీలు చాలా ఆత్రుతగా తమ రుతుక్రమం కోసం వేచి చూస్తారు, దీనివల్ల తాను గర్భం దాల్చలేదని ఆమెకు తెలుస్తుంది.

తన రుతుక్రమంలో వున్న స్త్రీ గర్భం దాల్చగలదా?
రుతుక్రమం లేదా బహిష్టు అంటే నెలకో సారి - స్త్రీ శరీరంలోని ఫలదీకరణ చెందని అండం గర్భాశయ పొరతో పాటు వ్యవస్థలోంచి బయటకు తోసివేయబడడం. ఆ అండం ఫలదీకరణ చెందితే ఆమె గర్భం దాల్చినట్టు, శిశు జననం వరకు తన రుతుక్రమం తప్పుతుంది. అందువల్ల తన రుతుక్రమంలో వున్న స్త్రీ అరక్షిత శృంగారంలో పాల్గొంటే గర్భం దాలుస్తుందా అనేది ప్రశ్న.

సరే, దీనికి సమాధానం ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
"సురక్షితమైన సమయం" ఏది? ప్రతి స్త్రీకి ఓ నెలలో ఒక సమయం వుంటుంది - దీన్ని అ౦డోత్సర్గ సమయం అంటారు - ఈ సమయంలో స్త్రీ శరీరంలో అండం విడుదలై వీర్యంతో కలిసి ఫలదీకరణం జరగడానికి సిద్ధంగా వుండడం వల్ల ఆమె గర్భం దాల్చే అవకాశం వుంటున్జ్ది. అందువల్ల రుతుక్రమంలో వున్నప్పుడు ఫలదీకరణం జరగని అండ౦ శరీరం నుంచి బయటకు తోసివేయ బడుతుంది, పైగా తదుపరి ఫలదీకరణ సమయం మరి కాస్త దూరంలో ఉంటుంది కనుక స్త్రీ రుతుక్రమం "సురక్షిత సమయం"గా పరిగణించబడుతుంది - అంటే ఆ సమయంలో గర్భధారణకు అవకాశం చాలా తక్కువ.

రుతుక్రమంలో వున్న స్త్రీ గర్భం దాలుస్తుందా?
అయితే, రుతుక్రమంలో వున్న స్త్రీలు కూడా శృంగారం చేసినప్పుడు గర్భం ధరించిన సందర్భాలు వున్నాయి. అయినా ఇదెలా సాధ్యం అయింది అనుకుంటున్నారా? సరే, ఓ వీర్యకణం శరీరంలో అయిదు రోజుల వరకు జీవంతో వుంటుంది!

రుతుక్రమంలో వున్న స్త్రీ గర్భం దాలుస్తుందా?
అందువల్ల, తన రుతుక్రమం చివరిలో వున్న స్త్రీ శృంగారంలో పాల్గొంటే ఆమె తరువాతి కొద్ది రోజుల్లో గర్భం దాల్చే అవకాశం ఉన్నట్టే, ఎందుకంటే ఆమె శరీరంలో జీవంతో వున్న వీర్యకణం అండాన్ని ఫలదీకరణ చేయగలదు.
మొత్తమ్మీద, రుతుక్రమంలో వున్న స్త్రీ అరక్షిత శృంగారంలో పాల్గొంటే గర్భం ధరించేందుకు చాలా కొద్ది అవకాశాలు వుంటాయి. అందువల్ల మీరు బిడ్డలు వద్దనుకుంటే సురక్షిత శృంగారం చేయడం మంచిది!



Click it and Unblock the Notifications