For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడితే పిల్లలు పుట్టరా..?

By Super Admin
|

ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించాలి అనుకునేవారికి ఆధునిక వైద్యం అద్భుతంగా పనిచేస్తుంది. రక్తపోటు మందులు, ప్రధమ చికిత్స మార్గాలు, ఇతర ముఖ్యమైన మందుల ఆవిష్కరణతో మనుషులు ఇంతకూ ముందు కంటే ఎక్కువ ఆనందంగా ఉంటున్నారు.

అయితే, దీనికి వ్యతిరేకమైన విషయం కూడా ఉంది, కొన్ని రకాల మందులు వాటిపనిని అవి చేస్తాయి, కానీ శరీరంలో ఇతర భాగాలపై ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తాయి.

అవసరమైన వాటి కంటే ఎక్కువ మందులు వాడడం వల్ల సాధారణంగా ఇలాంటివి జరుగుతాయి. వైద్య పరిరక్షణ లేకుండా మనంతట మనమే మందులను తీసుకోవడం అనేది చాలా ప్రమాదకరం.


ఈరోజుల్లో, ప్రతి చిన్న సమస్యకు 3-4 పరిష్కారాలు ఉంటున్నాయి. తలనొప్పి ఉందా? తలనొప్పి వెంటనే దూరమవడానికి ఒక టాబ్లెట్ తేలికగా వేసుకోవడం!

మీ వెన్నుపూస నొప్పిగా ఉందా? భయపడొద్దు, ఒక టాబ్లెట్ వేసుకోండి 20 నిమిషాల్లో తగ్గిపోతుంది.

తయారీదారులు, మందులను అమ్మేవారు కౌంటర్ లో ఇచ్చే మందులు, స్ప్రే లను సురక్షితంగా ఉపయోగించవచ్చు.

ఇది పూర్తిగా నిజం కాదు, ప్రత్యేకంగా గర్భధారణ కోసం ప్రయత్నిస్తుంటే లేదా అప్పటికే గర్భిణులు అయి ఉంటే దీన్ని ప్రయత్నించవద్దు.


వివిధ వయసులలో ఉన్న స్త్రీలలో వంధత్వానికి అదనంగా తీసుకునే పెయిన్ కిల్లర్లు ఏరకంగా కారణం అవుతాయో కొన్ని కఠినమైన నిజాలను చదివి తెలుసుకోండి.

ఒక చక్కటి పరిశోధనతో కూడిన అధ్యయనం ప్రకారం, అకారణంగా హానిచేయని, కౌంటర్ లో అమ్మబడే మందులు, డిఫెన్ హైడ్రమైన్, ఇబుప్రోఫెన్ వంటి చురుకైన సమ్మేళనాలతో కూడిన ఈ మందులు దాదాపు 75% స్త్రీలలో గర్భాన్ని పొందే అవకాశాలను తగ్గిస్తాయి.

ఇతర మందులతో పాటు, ఈ సమ్మేళనాలు వివిధ వయసులలోని మహిళలలో ఆండోత్సర్గము పనిచేయకపోవడానికి ఒక ప్రధాన కారణంగా చెప్తారు.

పెయిన్ కిల్లర్లు వంధత్వానికి ఎందుకు కారణమో నిరూపించే కారణాలు

ఇబుప్రూఫెన్, డైఫెన్హైడ్రమిన్ వంటి శోధ నిరోధక మందులు ప్రోస్ట గ్లాండ్ఇన్ ఉత్పత్తిని నిరోధించెట్టు చేసి మీ తలనొప్పి మాయమవడానికి అద్భుతంగా పనిచేస్తుంది; అయితే, ఈ మందులను ఎక్కువగా వాడితే ఆండోత్సర్గం పై ఎక్కువ ప్రభావం చూపుతుంది.

ఇబుప్రూఫెన్, వాటిని పోలిన మందులను అదే పనిగా 10 రోజులు వరుసగా తీసుకున్నట్లయితే ఆండోత్సర్గ సైకిల్ ని తాత్కాలికంగా భంగం కలిగిస్తుందని వివిధ అధ్యయనాలు గుర్తించాయి.

వీటిని ఎక్కువ కాలం తీసుకుంటే, వీటి ప్రభావం చాలా ఎక్కువగా, శాశ్వతంగా ఉంటుంది.


గర్భానికి ముందు ఆరోగ్యకర జీవితానికి పరిమితి ముఖ్యం

మీరు అతి త్వరగా గర్భాన్ని పొందాలనే లక్ష్యంతో ఉంటే, సహజ చికిత్సలకు బదులుగా పెయిన్ కిల్లర్లను నిదానంగా తగ్గిస్తూ మీ అందమైన జీవితాన్ని ప్రారంభించండి, వీటివల్ల తలనొప్పి, ఇతర నొప్పుల నుండి మంచి ఉపశమనాన్ని పొందవచ్చు.

మీరు ఇంకో డోస్ పెయిన్ కిల్లర్లు తీసుకునే ముందు, లేదా కౌంటర్ దగ్గర తీసుకున్న మందులు వాడే ముందు మొదటగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.

ప్రత్యామ్నాయంగా, ముఖ్యంగా దీర్ఘకాల ప్రాతిపాదికన, సురక్షితమైన ప్రభావాల కోసం సహజమైన పరిష్కారాలకు మారండి.

English summary

Do Painkillers Cause Infertility?

Modern medicine has done wonders for people who would like to live a healthier and longer life.With the invention of blood pressure pills, first-aid solutions and other important medicines, human beings are happier than ever before.