Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
గర్భిణీల్లో ఫ్లూ.. బేబీ బ్రెయిన్ డెవలప్ మెంట్ పై ప్రభావం చూపుతుందా ?
చిన్న చిన్న వైరల్ ఎటాక్స్ అంటే ఫ్లూ వంటివి సోకినప్పుడు గర్భిణీలు డాక్టర్ ని సంప్రదించాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతుంటారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలకే ఎక్కువగా మందులు వాడటం వల్ల తల్లికే కాదు బిడ్డ ఆరోగ్యానికి, ఎదుగుదలకు ప్రమాదమని హెచ్చరిస్తుంటారు.

కానీ కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు, జ్వరం వంటి సమస్యలు కడుపులో బిడ్డ బ్రెయిన్ డెవలప్ మెంట్ పై దుష్ర్పభావం చూపుతాయని.. తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఫస్ట్ ట్రైమ్ స్టర్ ప్రెగ్నన్సీలో తల్లులకు ఫ్లూ వంటి ఇన్ఫెక్షన్స్ సోకడం వల్ల బేబీలో మనోవైకల్యం రిస్క్ తెచ్చిపెడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఒకవేళ తల్లికి ఫ్లూ ఉంటే.. ఖచ్చితంగా బిడ్డకు మనోవైకల్యం ఉంటుందని కాదు. కానీ.. రిస్క్ ఎక్కువగా ఉంటుందని వివరిస్తున్నారు. ఈ మనోవైకల్యం లక్షణాలు కూడా బిడ్డకు 15 ఏళ్ల తర్వాత చూపించవచ్చని తాజా అధ్యయనాలు నిరూపిస్తున్నాయి. ఇమ్యున్ సిస్టమ్ చాలా వీక్ ఉన్న తల్లులకు పుట్టిన పిల్లల్లో మెదడు నరాల్లో అసమతుల్యతలు ఎక్కువగా ఉంటాయట.

ట్రిప్టోఫాన్ అనే ఎమినో యాసిడ్ ఇమ్యున్ సిస్టమ్ ని యాక్టివేట్ చేస్తుంది. దీనివల్ల ప్లేసంటాలో సెరోటనిన్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. శిశువు బ్రెయిన్ డెవలప్ మెంట్ కి సెరోటనిన్ చాలా అవసరం. అయితే ఈ సెరోటనిన్ అనేది ప్లేసంటా నుంచి రావాలి. అయితే ఈ సెరోటనిన్ అనేది కూడా సరైన మోతాదులో ఉండాలి. మరీ ఎక్కువ అయితే.. ప్రమాదం. బ్రెయిన్ డెవలప్ అవకుండా అడ్డుకునే అవకాశం ఉంది. కాబట్టి గర్భ ధారణ సమయంలో.. జ్వరం, ఇన్ఫెక్షన్స్ సోకకుండా.. జాగ్రత్తలు తీసుకోవాలి. దానికి సీజనల్ గా వ్యాక్సినేషన్స్ వేసుకోవడం వ్లల.. పుట్టే పిల్లల్లో అనారోగ్య సమస్యలను నివారించవచ్చు.



Click it and Unblock the Notifications