Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భిణిలు మూడవ నెలలో తీసుకోవల్సిన పోషకాహారాలు
సాధారణంగా మహిళలకు గర్భధారణ ఒక ప్రకృతి ప్రసాధించిన ఒక వరం. ఈ సమయంలో మహిళలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా గర్బ పొందారని నిర్ధారించుకొన్న వెంటనే మీ లైఫ్ స్టైల్ తో పాటు, కొన్ని ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. ముఖ్యంగా గర్భం పొందిన మహిళ మొదటి మూడు నెలలు తీసుకొనే ఆహారం చాలా ప్రధానమైనది. అలాగే మొదటి మూడు నెలల్లో కొన్ని ప్రత్యేకమైన ఆహారాలను కూడా నివారించాల్సి ఉంటుంది. కొన్ని హెల్తీ ఫుడ్స్ ను తీసుకోవాల్సి ఉంటుంది. అటువంటి ఆహారాలను క్రింది లిస్ట్ లో ఇవ్వబడింది. ఈ ఆహారాలను మీ రెగ్యులర్ డైట్లో మీరు తీసుకొన్నట్లైతే మీరు మొదటి త్రైమాసికంను సురక్షితంగా పూర్తి చేయవచ్చు.
గర్భం ధరించిన మొదటి మూడు నెలలో చాలా ముఖ్యమైన దశ. గర్భం ధరించిన ప్రారంభ దశలో శరీరానికి కావల్సిన పోషకాహారాల అవసరాలను గుర్తించి జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా మొదటి మూడు నెలల్లో ప్రత్యేకంగా నిబంధనలతో ప్రెగ్నెన్సీ డైయట్ ను ఫాలో అవ్వాలి. ఎందుకంటే మొదటి మూడు నెలల్లో గర్భం ప్రోటీన్ మరియు క్యాల్షియం ఆహారాలను ప్రధానంగా చేసుకుంటుంది. ఇవి గర్భంలోని బిడ్డ వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. మొదటి మూడు మాసాల్లో తీసుకొనే ఆహారంలో ప్రోటీనులు అధికంగా ఉండేలా చూసుకోవాలి. ప్రోటీనులు ఒక జీవికి ప్రాణం పోస్తుందనడంలో ఆశ్చర్యం కలిగిస్తుంది.

అంతే కాదు మొదటి మూడు నెలల్లో కడుపులో బిడ్డ పరిమాణం కూడా వేగంగా పెరుతుంది. మొదటి మూడు నెలల్లో క్యాల్షియం సమృద్ధిగా ఉన్న ఆహారం చాలా అవసరం. కడుపులో బిడ్డ తల్లి యొక్క రక్తం శోషణ ద్వారా పెరుగుతుంది. అందుచేత మీరు మీ గర్భం ధరించిన ప్రారంభ దశలో అంటే మొదటి త్రైమాసికంలో పూర్తి పోషకాంశాలతో నిండిన హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం చాలా అవసరం. కాబట్టి మొదటి మూడు నెల్లో తీసుకోవల్సినటువంటి అత్యుత్తమ ఆహారాలను ఈ క్రింది స్లైడ్ ద్వారా పరిశీలించండి....
విటమిన్ బి 6: ఆరెంజ్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది తల్లిలో ఏర్పడే ఇన్ఫెక్షన్లతో పోరాడగలిగేందుకు రోగనిరోధక శక్తిని పెంపొంధిస్తుంది. మరియు ఇందులో ఉండే ఫోలిక్ యాసిడ్ పుట్టుకతో వచ్చే లోపాలను నివారించడానికి సహాయపడుతుంది. సిట్రస్ పండ్లలో విటమిన్ సి మరియు ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. అలసట నుండి తక్షణ ఉపశమనం పొందడానికి ఆరోగ్యకరమైన పానీయాలు అంటే ఆరెంజ్ జ్యూస్ వంటివి సేవించాలి.

ఫ్రెష్ ఫ్రూట్స్: ఫ్రెష్ ఫ్రూట్స్ లో విటమిన్స్, మరియు వాటర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది . వీటితో పాటు నేచురల్ షుగర్స్ మరియు ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్ానయి . వీటిని గర్భినీలు డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఆరోగ్యాన్ని పొందుతారు.
కార్బోహైడ్రేట్స్: కార్బోహైడ్రేట్లు, గింజధాన్యాలనుండి అంటే, బ్రౌన్ రైస్, గోధుమ వంటివాటినుండి పొందండి. తెల్లటి బియ్యం, తెల్లటి రవ్వలు వంటివాటిలో పోషకాలు వుండవు. అవి పాలిష్ పట్టబడి వుంటాయి. ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.

ఐరన్ అండ్ ఫొల్లేట్: ఆకుకూరల్లో ముఖ్యంగా పాలకూరలో క్యాల్షియం మరియు ఐరన్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. తల్లి నుండి రక్తం బిడ్డవైపుకు ప్రసరిస్తుంది కాబట్టి, ఆకు కూరలను తినడం వల్ల తల్లికి సరిపడా రక్తాన్ని ఉత్పత్తి చేస్తుంది.
డైరీ మిల్క్: ఉదయం బ్రేక్ ఫాస్ట్ తో పాటు ఒక గ్లాసు పాలు తీసుకోవడం, గర్భిణీకి చాలా ఆరోగ్యకరం. బాగా కాచీ, మీగడ తీసేసిన పాలను తీసుకోవాలి.



Click it and Unblock the Notifications