For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు ఖచ్చితంగా తినాల్సిన 10 హెల్తీ ఫుడ్స్ ..!!

గర్భవతి ప్రతిరోజూ మంచి పోషకవిలువలు కలిగిన సరైన ఆహారాన్ని సరైన మొత్తంలో తీసుకోవాలి. ఆమె తీసుకొనే ఆహారం, ఆమెకే కాక, పుట్టబోయే బిడ్డకు సైతం ఆరోగ్యాన్నిస్తుంది. తేలికగా డెలివరీ అవుతుంది. బేబీ పుట్టిన తర్వ

|

మహిళకు గర్భనిర్ధారణ జరిగినప్పటినుండి ఆమె ఆహారం పట్ల అధిక శ్రధ్ధ తీసుకోవాలి. మొదటగా తాను ఆరోగ్యంగా ఉండాలి. అందుకుగాను తన శరీరం సహకరించే రీతిలో తగు ఆహారాలను ఎప్పటికపుడు మారుస్తూ తినాలి. రెండవదిగా ఆమె తన గర్భంలోని పిండం ఎదుగుదల కొరకు కూడా కొన్ని ప్రత్యేక ఆహారాలు తినాలి. ఆమె ఇప్పటినుండి తినే ఆహారం బిడ్డ పుట్టిన తర్వాత తిరిగి ఆమె మరోమారు సాధారణ స్ధితికి చేరే వరకు బలాన్ని కలిగించాలి.

గర్భవతి ప్రతిరోజూ మంచి పోషకవిలువలు కలిగిన సరైన ఆహారాన్ని సరైన మొత్తంలో తీసుకోవాలి. ఆమె తీసుకొనే ఆహారం, ఆమెకే కాక, పుట్టబోయే బిడ్డకు సైతం ఆరోగ్యాన్నిస్తుంది. తేలికగా డెలివరీ అవుతుంది. బేబీ పుట్టిన తర్వాత మరల మహిళ కోలుకోవాలంటే కూడా, గర్భస్ధ దశలో తినే పోషక విలువల ఆహారం పాత్ర అధికంగానే వుంటుంది. గర్భవతి అయిన తర్వాత బరువు ఎక్కువకావటం సహజమే.

అయితే, ఈ బరువు బిడ్డ బరువుకు తగినట్లుగా వుందా లేదా అనేది ఎప్పటికపుడు ఆమె చెక్ చేయించుకోవాలి. ఇలా చేస్తే, బిడ్డ పుట్టిన తర్వాత కూడా మహిళకు అధికబరువు సమస్యలుండవు. సాధారణంగా బిడ్డ కడుపులో వున్నపుడు మహిళ 9 నుండి 14 కిలోలవరకు అధికంగా బరువు ఎక్కే అవకాశం వుంటుంది. సరైన బరువు పొందిన మహిళకు గర్భస్ధ దశ ఎంతో తేలికగా ఉంటుంది. అంతేకాక ఆమెకు తగిన వ్యాయామం, ఆహారాలతో ఏరకమైన ఆరోగ్య సమస్యలు లేకుండా సహజ కాన్పు కూడా అయ్యట్లుగా ఉండగలదు.

గర్భవతి ప్రతిరోజూ తినే పోషకాహారంలో ఫోలిక్ యాసిడ్ తగినంత పరిమాణంలో తప్పని సరిగా వుండాలి. ఫోలిక్ యాసిడ్ లోపిస్తే కడుపులో వున్న బిడ్డకు శారీరక అంగవైకల్యాలు, లేదా ఇతర లోపాలు సంభవించే ప్రమాదం వుంది. ఫోలిక్ యాసిడ్ సాధారణంగా ఆచుపచ్చని ఆకు కూరలలో కావలసినంత దొరుకుతుంది. ప్రతిరోజూ తాజాగా వున్న ఆకు కూరలు వండి తింటే ఆమెకు ఈ సమస్య వుండదు.

అంతే కాక ప్రొటీన్ అధికంగా వుండే మాంసాహారాలు, చికెన్, చేప, బీన్స్, పాలు, గుడ్లు మొదలైనవి కడుపులో వున్న బేబీకి కండరాలు, జుట్టు, చేతి గోళ్ళు, ఎముకలు, బ్రెయిన్ టిష్యూలు, రక్తం మొదలైనవి ఏర్పడటానికి బాగా సహకరిస్తాయి. గర్భవతి బిడ్డ ఎముకల ఎదుగుదల, పటిష్టతలకు గాను ప్రతిరోజు సుమారు 1200 గ్రాముల కాల్షియం తప్పక తీసుకోవాలి. తాజా పాలు ఉత్పత్తులు, పాలు బాగా తీసుకుంటే ఎముకలకు అవసరమైన కాల్షియం అందుతుంది. బిడ్డ బరువు ఆరోగ్యకరంగా వుంటుంది.. గర్భినీలు ఖచ్చితంగా తినాల్సిన కొన్ని హెల్తీ ఫుడ్స్ ఈ క్రింది విధంగా..

గుడ్డు:

గుడ్డు:

గుడ్లు గర్భంలో పిండం ఏర్పాటు విటమిన్ ఎ మరియు విటమిన్ డి, పుష్కలమైన పోషకాలు చాలా అవసరం. కాబట్టి, వారంలో ఒకసారి లేదా రెండు సార్లు గుడ్డును తినడం చాలా అవసరం.

 అవొకాడో:

అవొకాడో:

గర్భినీ స్త్రీల ఆహారంలో అవొకాడో చాలా గ్రేట్ ఫుడ్ . అవొకాడోలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది బేబీ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అలాగే తల్లి ఆరోగ్యానికి కూడా మంచిది. అవొకాడోలో ఉండే విటమిన్ సి బిడ్డలో వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది. గర్భిణీలు అవొకాడో తినడం వల్ల మార్నింగ్ సిక్నెస్ , అలసట నివారించుకోవచ్చు. గర్భధారణ సమయంలో డైట్ లో చేర్చుకోవాల్సిన మరో హెల్తీ ఫుడ్ అవకాడో. ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ లభించడం వల్ల.. కడుపులో డెవలప్ అవుతున్న బేబీకి పోషణ అందుతుంది.

సీసాల్ట్:

సీసాల్ట్:

గర్భిణీలు నార్మల్ సాల్ట్ తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ పెరుగుతుంది. కాబట్టి, వారి రెగ్యులర్ డైట్ లో సీసాల్ట్ చేర్చుకోవడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుంది. ఫీటల్ డెవలప్ మెంట్ మెరుగ్గా ఉంటుంది.

ఆకుకూరలు:

ఆకుకూరలు:

విటమిన్ కె ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది. నెలలో ఒకసారి ఎండిన ఆకుకూరలు ఉడికించి ఒక కప్పు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిది. ఇది పుష్కలమైన విటమిన్ కె ను అంధిస్తుంది. గర్భాధారణ సమయంలో విటమిన్ కె పొందడానికి, ఆకుకూరలు అతి చౌకగా లభించే అన్ని పోషక విలువలుగల ఆహారం.

నట్స్:

నట్స్:

డ్రై నట్స్ లో పుష్కలమైన విటమిన్ ఇ ఉంటుంది. ఒక గుప్పెడు నట్స్ (బాదాం మరియు పిస్తా)వంటి వాటిని తప్పని సరిగా తినాలి. ఈ నట్స్ బేబీకి ఆరోగ్యానికి మాత్రమే కాదు, తల్లి ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

క్యారెట్స్ :

క్యారెట్స్ :

గర్భిణీ స్త్రీలు ఆకలి అనిపించినప్పుడు, ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ లేదా హాఫ్ బాయిల్ చేసిన క్యారెట్ ముక్కలను తీసుకోవాలి. వీటి నుండి విటిమన్ ఎ పుష్కలంగా శరీరానికి అందుతుంది.

మామిడి:

మామిడి:

మామిడి పండ్లు మంచి రుచి కలిగి ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. మామిడి పండ్లలో విటమిన్ ఎ మరియు సిలు అధికంగా ుంటాయి . ఇది ఫీటల్ డెవలప్ మెంటకు సహాయపడుతాయి, మరియు ఇందులో ఉండే విటమిన్ సి కూడా ఫీటల్ డెవలప్ మెంట్ మరియు బ్లడ్ సర్క్యులేషన్ మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మామిడి పండ్లు బ్లడ్ సర్క్యులేషన్ పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది శరీరంలో ఇమ్యూనిటి పెంచుతుంది, స్ట్రెస్ తగ్గిస్తుంది.

 పాప్ కార్న్:

పాప్ కార్న్:

గర్భిణీలు తినాల్సిన ఫుడ్స్ లో పాప్ కార్న్ కూడా ఒకటి. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిని గర్భిణీలు తినడం ఆరోగ్యానికి చాలా సురక్షితం.

 చికెన్:

చికెన్:

మార్నింగ్ సిక్ నెస్(కడుపులో తిప్పడం, నీరసంగా ఉండటం, వాంతి వచ్చేట్లు ఉండటం) ఉన్నట్లైతే చికెన్ బెస్ట్ ఆప్షన్ గా చెబుతారు. ఇందులో అధిక శాతంలో ఐరన్ ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిని నిర్వహించడానికి ఇది చాలా బాగా సహాయపడుతుంది.

పెరుగు:

పెరుగు:

గర్భినీ పొట్టలో ఉండే శిశువు నాడీవ్యవస్థ ఆరోగ్యంగా ఉండాలంటే, ఎక్స్ ట్రా ప్రోటీన్స్ ను తీసుకోవాలి . అందుకు పెరుగు వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ను తీసుకోవాలి . గర్భధారణలో క్యాల్షియం కూడా ఎక్కువ అవసరం అవుతుంది.

English summary

Foods For Pregnant Women

Pregnancy is a time when women suffer from unusual cravings and experience endless hunger problems. Here are some of the best foods that should be eaten by a pregnant woman.
Story first published: Saturday, November 5, 2016, 16:44 [IST]
Desktop Bottom Promotion