For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ నివారించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..!

ప్రెగ్నెన్సీ సమయంలో.. పొట్ట, తొడలు, ఛాతీభాగాలలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. ఒక్కసారి స్రెచ్ మార్క్స్ ఏర్పడ్డాయంటే వాటిని తొలగించడం చాలా కష్టం. ప్రెగ్నెన్సీ తరువాత వచ్చే స్ట్రెచ్ మార్క్స్‌ స్త్రీలను చ

|

చాలా మంది మహిళలల్లో శరీరంలోని కొన్ని భాగాల్లో చారలు ఏర్పడి ఉండటం సాధారణంగా చూస్తుంటాం. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలలో ఈ సమస్య ఎక్కువగా కనబడుతుంటుంది. గర్భవతులలో చర్మం చాలా మార్పులు, చేర్పులకు గురవుతుంది. చర్మం పొడిగా లేదా జిడ్డుగా తయారవుతుంది. చర్మంలో స్ట్రెచ్ మార్క్స్ కు ఎక్కువగా కనబడుతాయి. సాధారణంగా అధికబరువు, సెడెన్ గా బరువు తగ్గడం వల్ల ఏర్పడుతుంటాయి.ఫ్యాట్ కణాలు ఎక్కడ చేరుతాయో అక్కడ స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. గర్భధారణ సమయంలో నార్మల్ డెలివరీనా, సిజేరియన్ అనా తేడా లేకుండా స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడుతాయి. స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడటం సహజం సమస్యే. అయితే వీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవడం మంచిది.

Get Rid Of Pregnancy Stertch Marks

ప్రెగ్నెన్సీ సమయంలో.. పొట్ట, తొడలు, ఛాతీభాగాలలో స్ట్రెచ్ మార్క్స్ ఏర్పడతాయి. ఒక్కసారి స్రెచ్ మార్క్స్ ఏర్పడ్డాయంటే వాటిని తొలగించడం చాలా కష్టం. ప్రెగ్నెన్సీ తరువాత వచ్చే స్ట్రెచ్ మార్క్స్‌ స్త్రీలను చాలా ఆందోళనకు గురిచేస్తుంటాయి. వాటిని కనిపించకుండా చేయడం కోసం వాళ్లు నానా తంటాలు పడుతుంటారు. అయితే అవి పూర్తిగా తొలగిపోకున్నా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా కనిపించకుండా చేసుకోవచ్చు. ప్రసవం తర్వాత పొట్ట మీద కనిపించే స్ట్రెచ్ మార్క్స్ ను కనబడనివ్వకుండా చేసుకోవడానికి కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ఈక్రింది విధంగా ఉన్నాయి..

స్ట్రెచ్ మార్క్స్ ను నివారించేందుకు కొన్ని నేచురల్ హోం రెమెడీస్ :

అలోవెర:

అలోవెర:

పోస్ట్ ప్రెగ్నెన్సీ తర్వాత గర్భిణీలో ఏర్పడే స్ట్రెచ్ మార్క్ ను తొలగించుకోవడానికి అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది . దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తుంటే స్ట్రెచ్ మార్క్స్ కనపడకుండా చర్మంలో కలిసిపోతాయి . అంతే కాదు, ఇతర స్కిన్ సమస్యలను నివారించడంలో అలోవెర గ్రేట్ గా సహాయపడుతుంది. స్ట్రెచ్ మార్క్స్ ఉన్నప్రదేశంలో అలోవెర జెల్ అప్లై చేసి డ్రై అయిన తర్వాత శుభ్రం చేసుకోవాలి

పొటాటో జ్యూస్:

పొటాటో జ్యూస్:

పొటాటో జ్యూస్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్ట్రెచ్ మార్క్స్ ను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. బంగాళదుంపను కంట్ చేసి తురుముకోవాలి. తురిమిన బంగాళదుంపను ఒక క్లాత్ లో వేసి స్క్వీజ్ చేయాలి. రసం తీశాక దీన్ని స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తుంటే స్ట్రెచ్ మార్క్స్ సులభంగా తొలగిపోతాయి. ఈ పొటాటో జ్యూస్ ను ఒక సారి అప్లై చేసిన తర్వాత , డ్రై అయిన తర్వాత చల్లటి నీటితో కడిగేసుకోవాలి.

ఆముదం:

ఆముదం:

స్ట్రెచ్ మార్క్స్ నివారించడంలో ఆముదం గ్రేట్ రెమెడీ. ఇది స్ట్రెచ్ మార్క్స్ ను సులభంగా తొలగిస్తుంది. ఆముదం నూనెను చారలున్న ప్రదేశంలో అప్లై చేసి, మర్ధన చేయాలి. ఇలా రెగ్యులర్ గా అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. స్ట్రెచ్ మార్క్స్ తొలగించడం మాత్రమే కాదు, ఇది డార్క్ స్పాట్స్ ను కూడా తొలగిస్తుంది. నల్ల మచ్చలు, డార్క్ సర్కిల్స్ ను తొలగిస్తుంది. ఆముదంలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ స్ట్రెచ్ మార్క్స్ ను తొలగించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నట్లు నిరూపించబడినది.

తేనె:

తేనె:

తేనెలో స్కిన్ మాయిశ్చరైజింగ్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి . వీటితో పాటు హైడ్రేటింగ్ గుణాలు ప్రసవం తర్వాత ఏర్పడే స్ట్రెచ్ మార్క్ లను కనబడనివ్వకుండా చేస్తాయి. స్ట్రెచ్ మార్క్స్ ఉన్న ప్రదేశంలో తేనెను అప్లై చేయాలి. తేనె అప్లై చేసిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచి, డ్రై అయిన తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి . తేనెకు కొద్దిగా గ్లిజరిన్ మిరయు సాల్ట్ మిక్స్ చేసి అప్లై చేయడం వల్ల మరింత బెటర్ ఫలితం ఉంటుంది.

ల్యావెండర్ ఆయిల్ :

ల్యావెండర్ ఆయిల్ :

ప్రసవం తర్వాత గర్భినీ పొట్ట మీద కనబడే స్ట్రెచ్ మార్క్స్ ను నివారించుకోవడానికి ల్యావెండర్ ఆయిల్ గ్రేట్ గా సహాయపడుతుంది . ల్యావెండర్ ఆయిల్లో ఉండే గుణాలు స్ట్రెచ్ మార్క్స్ ను చాలా ఎపెక్టివ్ గా తొలగిస్తుంది. రెగ్యులర్ గా కొన్ని రోజుల పాటు అప్లై చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది.

ఎగ్ వైట్ :

ఎగ్ వైట్ :

చర్మ సంరక్షణలో ఎగ్ వైట్ గ్రేట్ గా సహాయపడుతుంది . ఎగ్ వైట్ లో ఉండే ప్రోటీన్స్ స్కిన్ సెల్స్ ను రీబిల్డ్ చేస్తుంది . దాంతో చర్మం ఫ్రెష్ గా మరియు అందంగా కనబడేలా చేస్తుంది.

బాడీలోషన్:

బాడీలోషన్:

బాడీలోషన్ చేతులు, భుజాలకు మాత్రమే కాదు, శరీరం మొత్తానికి, పొట్టకు, చెస్ట్ కూడా అప్లై చేసి మర్ధన చేసుకోవాలి. చారలను వచ్చిన తర్వాత పోగొట్టడం కంటే రాకుండా నివారించడానికి డెలివరీకి ముందునుండి ఈ బాడీలోషన్ అప్లై చేయడం చాలా మంచిది. బాడీలోషన్ ప్రతి రోజూ ఉదయం పూట రాయడం చాలా మంచిది. తర్వాత స్నానం చేసిన తర్వాత కూడా బాడీ లోషన్ ను అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మానికి మంచి మాయిశ్చరైజర్ లా పనిచేస్తుంది.

మసాజ్:

మసాజ్:

నూనెతో శరీరాన్ని క్రమం తప్పకుండా మర్దన చేసుకోవాలి. అరచేతిలో నూనె పోసుకుని పొట్టమీద మెల్లగా రాసుకోవాలి. ఇలా చేయడం వల్ల చారలు ఏర్పడవు. ఇందుకు కొబ్బరినూనె చాలా బాగా పనిచేస్తుంది. శరీరంలోనికి బాగా ఇంకిపోయి కణాలను స్టాంగ్ గా ఉంచుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీకి ముందే నుండే ఈ ఆయిల్ మసాజ్ ను మొదలు పెట్టడం మంచిది. పెరుగులో పసుపు కలిపి, ఆ మిశ్రమాన్ని పొట్టమీద క్రమం తప్పకుండా రాసుకుంటే... గర్భం ధరించినప్పుడు పొట్టమీద ఏర్పడ్డ చారలు తగ్గిపోతాయి.

నీళ్ళు:

నీళ్ళు:

నీళ్ళు తాగడం వల్ల చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. ప్రతి రోజూ శరీరానికి తగినంత నీటిని తాగడం వల్ల చర్మ సౌందర్యాన్ని రెట్టింపు చేయడమే కాకుండా ప్రెగ్నెన్సీ సమయంలో శరీరం మీద చారలు ఏర్పడకుండా చేస్తుంది.

English summary

Get Rid Of Pregnancy Stertch Marks

After pregnancy, stretch marks are one of the frequent problems that is faced by all women. Whether it was a normal delivery or not, having stretch marks is a common issue, which can be solved with a few home remedies.
Desktop Bottom Promotion