For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీ స్త్రీలు తాగాల్సిన డిఫరెంట్ టైప్ హెల్తీ సూప్స్ ....

|

గర్భధారణ సమయంలో, మహిళలు తమ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. రెగ్యులర్ వారు తీసుకునే ఆహారం పట్లే ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలి. ఈ సమయం గర్భిణీకి అంత సౌకర్యవంతమైన సమయం కాదు. ముఖ్యంగా మూడవ త్రైమాసిక చాలా జాగ్రత్తగా ఉండాలి. గర్భం పొందిన తర్వాత పొట్టలో బిడ్డ పెరిగే కొద్దీ గర్భీణీ శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. మార్పులతో పాటు కొన్ని సహజంగా వచ్చే ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయి . గర్భాధారణ సమయంలో మహిళలు మలబద్దక సమస్యను ఎదుర్కుంటుంటారు. తీసుకొనే ప్రతి ఒక్క ఆహారం ఆరోగ్యానికి సహాయపడుతుందనుకోకూడదు. ఈ సమయంలో తీసుకొనే కొన్ని ఆహారాల వల్ల మబద్దక సమస్యను ఎదుర్కోవల్సి వస్తుంది.

అందుకే గర్భిణీలు తీసుకొనే కొన్ని ఘనాహారాలకు బదులుగా కొన్ని రకాల సూప్స్ ను ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు . ఈ సూప్స్ తయారుచేయడం చాలా సులభం మరియు టేస్ట్ గా కూడా ఉంటాయి. మూడవ త్రైమాసికంలో ఈ సూప్స్ తాగడం వల్ల గర్భిణీ స్త్రీల ఆరోగ్యం మెరుగుపడుతుంది . ఈ సూప్స్ ను గర్భిణీలకు నచ్చిన విధంగా వారికి ఇష్టమయ్యే ఫ్లేవర్స్ తో తయారుచేసుకోవచ్చు. ఈ సూప్స్ లో అన్ని రకాల న్యూట్రీషియన్స్ మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి.

గర్భధారణ సమయంలో సూప్స చాలా తేలికగా జీర్ణమవుతాయి. సూప్స్ తాగడం వల్ల జీర్ణ సమస్యలు, మలబద్దక సమస్యలుండవని చాలా మంది గర్భిణీ స్త్రీలు చెబుతున్నారు . అయితే గర్భిణీలు సూపులలో ఏవి పడితే అవి తీసుకోకుండా, హెల్తీగా తయారుచేసిన వివిధ రకాల వెజిటేబుల్స్ , లెగ్యుమ్స్, లీన్ మీట్స్ తో తయారుచేసని సూప్స్ ను తీసుకోవాలని సూచిస్తున్నారు . ఇవి క్యాలరీలను తగ్గిస్తాయి. శరీరానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ ను అందిస్తాయి.

గర్భధారణ సమయంలో గర్భిణీలు తీసుకోవల్సిన కొన్ని రకాల హెల్తీ సూప్స్ ఈ క్రింది విధంగా...

1. గుమ్మడి సూప్:

1. గుమ్మడి సూప్:

గర్భిణీలు గుమ్మడి సూప్ తాగవచ్చు. ఇందులో విటమిన్స్, మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి . టేస్టీగా కూడా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు తీసుకొనే సూప్స్ లో ఇది ఒక హెల్తీ లోఫ్యాట్ సూప్ .

2. బ్రొకోలీ సూప్:

2. బ్రొకోలీ సూప్:

బ్రొకోలీ అంటే అందరూ ఇష్టపడరు, కానీ ఈ సూప్ లో వివిధ రకాల న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి గర్భిణీ స్త్రీకి చాలా అవసరం అవుతుంది. ముఖ్యంగా బ్రొకోలీలో ఉండే ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలకు చాలా ఆరోగ్యకరమైనది. కాబట్టి, టేస్టీ మీల్ కంప్లీట్ చేయడానికి బ్రొకోలీ సూప్ ఒకటి.

 3. టమోటో సూప్:

3. టమోటో సూప్:

టమోటో ఒక క్లాసిక్ సూప్, గర్భిణీలు తీసుకొనే హెల్లీ సూప్స్ లో ఇది ఒకటి, . ఎందుకంటే టమోటోల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఫీటస్ పెరుగుదలకు ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి . . టమోటో సూప్ లో కొన్ని పెసరపప్పు మరియు ప్రోటీన్స్ ను జోడించుకోవచ్చు.

4. లెమన్ మరియు కోరియాండర్ సూప్:

4. లెమన్ మరియు కోరియాండర్ సూప్:

హెల్తీ సూప్స్ లో లెమన్ సూప్ ఒకటి . ఇది గర్భినీలకు విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ ను అందిస్తుంది. ప్రీరాడికల్స్ ను తొలగిస్తుంది.

5. మిక్స్డ్ వెజిటేబుల్ సూప్:

5. మిక్స్డ్ వెజిటేబుల్ సూప్:

గర్భిణీ స్త్రీలో క్యాలరీలు పెరుగుతుండటాన్ని కంట్రోల్ చేయడానికి ఈ హెల్తీ సూప్ గ్రేట్ గా సహాయపడుుతంది . అదే విధంగా ఈ సూప్ లోని న్యూట్రీషియన్స్ కడుపులో పెరిగే బిడ్డకు తల్లికు ఎక్కువగా సహాయపడుతాయి.

6. మష్రుమ్ సూప్స్:

6. మష్రుమ్ సూప్స్:

గర్భిణీలు మష్రుమ్ సూప్ తాగడానికి ముందు, అలర్జీలేమైనా ఉన్నయో లేదో కనుక్కోవాలి . ఈ మష్రుమ్ సూప్ లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉండటం వల్ల గర్భిణీకి చాలా ఆరోగ్యకరమైనవి.

7. చికెన్ సూప్:

7. చికెన్ సూప్:

చికెన్ సూప్ లో మిక్స్ వెజిటేబుల్స్ మరియు చికెన్ స్టాక్ తో తయారుచేసుకొనవచ్చు, ప్రెగ్నెన్సీ డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవల్సినది . చికెన్ మరియు వెజిటేబుల్స్ చాలా తేలికగా జీర్ణమవుతాయి .

8. క్యారెట్ సూప్:

8. క్యారెట్ సూప్:

పచ్చిక్యారెట్స్ తినడానికి ఇష్టపడని వారు, గర్భధారణ సమయంలో క్యారెట్ సూప్ తాగొచ్చు. ప్రెగ్నెన్సీ డైట్ లో క్యారెట్స్ సూప్ వల్ల తల్లి బిడ్డ ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

Healthy Soups To Drink During Pregnancy

Soups are quite easily digested by the pregnant woman’s digestive system. With the digestive problems they face, not many pregnant women will say no to some warm soup. Healthy soups for pregnancy should contain a variety of vegetables, legumes and lean meat. It will keep the calories down while providing you with the necessary nutrients.
Story first published:Monday, June 13, 2016, 14:51 [IST]
Desktop Bottom Promotion