Latest Updates
-
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా.. -
మీ మొబైల్ ఫోన్లో ఈ వాల్ పేపర్ ఉంటే.. రోజూ అదృష్టం మీ వెంటే.!
గర్భిణీస్త్రీకి దగ్గు నుండి ఉపశమనం కలిగించే సింపుల్ రెమెడీస్
గర్భం పొందిన తర్వాత పొట్టలో పెరిగే బిడ్డకు ఒక కొత్త జీవితాన్ని అందివ్వడంలో తల్లి యొక్క శరీరంలో వ్యాధినిరోధక శక్తిలో హెచ్చుతగ్గులుంటాయి . అటువంటి పరిస్థితుల్లో బేబీ సురక్షితంగా ఉండటం చాలా అవసరం. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్ కు అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కు, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్, దగ్గు మరియు జలుబుకు గురి అవుతుంటారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఎదుర్కొనే అత్యంత సాధారణ జబ్బుల్లో దగ్గు ఒకటి.
గర్భధారణ సమయంలో దగ్గు నుండి ఉపశమనం పొందడానికి మరియు దగ్గను త్వరగా తగ్గించుకోవడం ఎలాగని ఆందోళ చెందుతుంటారు. అందుకు హోం రెమెడీస్ గ్రేట్ గా సహాయపడుతాయి. గర్భధారణ సమయంలో డాక్టర్స్ సూచించే మెడిసిన్స్ ఉపయోగించడం వల్ల కొన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ కు గురిచేస్తాయి. ఇటువంటి పరిస్థితిలో సెల్ఫ్ మెడికేషన్స్ ను ఉపయోగించకపోవడం మంచిది . ఇలా చేయడం వల్ల తల్లికి మాత్రమే కాదు పొట్టలో పెరిగే బేబీకి కూడా హాని కలిగిస్తుంది.
గర్భాధారణ సమయంలో దగ్గు నివారించడానికి కొన్ని నేచురల్ రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేసి, దగ్గును నివారిస్తాయి. అయితే కాస్త ఆలస్యం అయినా, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. . మరి అలాంటే నేచురల్ కఫ్ రెమెడీస్ ఏంటో ఒకసారి చూద్దాం....

1.తులసి-తేనె:
కొన్ని తులసి ఆకులను మెత్తగా పేస్ట్ చేసి, ఒక టేబుల్ స్పూన్ తులసి తీసుకొని, అందులో ఒక స్పూన్ తేనె మిక్స్ చేసి రోజులో అప్పుడప్పుడు తీసుకోవాలి. ఇది దగ్గు నివారించడంలో చాలా ప్రయోజనకారి. ప్రత్యామ్నాయంగా, కొన్ని తులసి ఆకులను నీటిలో వేసి ఉడికించి, వడగట్టి, అందులో తేనె మిక్స్ చేసి తాగడం వల్ల దగ్గు మరియు గొంతు నొప్పి కూడా నివారించబడుతుంది.

2. లెమన్, సాల్ట్, మరియు బ్లాక్ పెప్పర్:
నిమ్మకాయను నాలుగు బాగాలుగా కట్ చేసి ఒక్కో బాగం తీసుకొని ఉప్పు , మిరియాలపొడిలో డిప్ చేసి, దగ్గు వచ్చినప్పుడు కొద్దిగా నాలుక మీద పెట్టుకొని చప్పరిస్తుండాలి.

3. ద్రాక్ష :
గర్భిణీలో దగ్గు నివారించే రెమెడీస్ లో ఇది ఒకటి. అయితే దీన్ని పరిమితంగా మాత్రమే తినాలి. ద్రాక్ష ఎక్స్ పర్టెంట్ గా పనిచేస్తుంది. ఊపిరితిత్తులమీద పనిచేసి, దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

4. వెల్లుల్లి:
భోజనంతో పాటు ఒకటి రెండు వెల్లుల్లిని తీసుకోవాలి. ఇది కూడా వారంలో రెండు, మూడు సార్లు తీసుకుంటే చాలు. దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

5. కోకోనట్ మిల్క్, గసగసాల గ్రాస్ మరియు తేనె:
గర్భిణీలో డ్రై కఫ్ ఉన్నప్పుడు, 3-4టీస్పూన్లకోకనట్ మిల్క్ కు ఒక టీస్పూన్ గసగసలా గ్రాస్ (గడ్డి)పేస్ట్ చేసి మిక్స్ చేయాలి, దీనికి తేనె మిక్స్ చేసి రాత్రి నిద్రించే ముందు తాగాలి.

6. ఉల్లిపాయ రసం మరియు తేనె:
ఉల్లిపాయ రసానికి కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకుంటే కఫ్ సిరఫ్ గా పనిచేస్తుంది.

7. బాదం, షుగర్ మరియు బట్టర్:
బాదంను రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయం స్కిన్ తొలగించి పేస్ట్ చేసి అందులో షుగర్ మరియు బట్టర్ మిక్స్ చేసి తీసుకోవడం వల్ల డ్రై కఫ్ తగ్గుతుంది.

8. యూకలిప్టస్ లేదా పుదీనా:
యూకలిప్టస్ లేదా మింట్ టీలు లేదా మెంతోలేటెడ్ లోజెన్స్ , గొంతులో చీకాకును , దగ్గు నుండి ఉపశమనం కలిగిస్తుంది.

9. హెర్బల్ టీ:
అల్లంతో తయారుచేసిన బ్లాక్ టీ తాగడం వల్ల గొంతు నొప్పి మరియు దగ్గు నివారించుకోవచ్చు.

10. చికెన్ సూప్:
ఉల్లిపాయల, మరియు ఇతర హెల్తీ వెజిటేబుల్స్ తో తయారుచేసిన చికెస్ సూప్ తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు తగ్గించుకోవచ్చు.

11. గోరువెచ్చటి నీటితో స్నానం:
గోరువెచ్చని నీటితో స్నానం, నీటిని ఆవిరి పట్టడం వల్ల కూడా దగ్గు నుండి ఉపశమనం పొందవచ్చు.

12. మెంతోలేటెడ్ చెస్ట్ రబ్స్ :
మెంథోల్ తో తయారుచేసిన విపరబ్స్ ను చాతీకి మర్దన చేయడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

13. ఉప్పు నీటితో గార్గిలింగ్ చేయడం :
గ్లాసు గోరువెచ్చని నీటిలో ఉప్పు వేసి నోట్లో పోసికొని రోజులో అప్పుడప్పుడు గార్గిలింగ్ చేయండ వల్ల గొంతు నొప్పి, వాపు, మరియు దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

14. స్టీమ్:
ఇన్ హేల్ స్టీమ్ . వేడినీటిలో విక్స్ , విపరబ్స్ వంటివి వేసి ఆవిరి పట్డడం వల్ల నాజల్ మూకస్ ఫ్రీ అవుతుంది. గొంతులో చీకాకు మరియు నొప్పి నివారించబడుతుంది.



Click it and Unblock the Notifications