Latest Updates
-
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.? -
కుక్కర్ విజిల్ వేసినప్పుడు పప్పు పొంగుతోందా? ఈ పాతకాలపు చిట్కాతో చెక్..! -
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే!
గర్భిణీలో కడుపుబ్బరం తగ్గించే ఎఫెక్టివ్ హోం రెమెడీస్ ..
గర్భధారణ సమయంలో కడుపుబ్బరం అనేది చాలా సాధారణ సమస్య. కడుపుబ్బరం అసౌకర్యానికి గురిచేస్తుంది. ముఖ్యంగా గర్భం పొందిన ప్రారంభదశలో గర్భిణీలకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. హార్మోనులు అసమతుల్యతల వల్ల గర్భాధారణ సమయంలో కడుపుబ్బరానికి గురిచేస్తుంది.
కాబట్టి, గర్భిణీలు ఎప్పటికప్పుడు శరీరాన్ని తగినంత హైడ్రేషన్ లో ఉంచుకోవాలి. కొన్ని సింపుల్ రెమెడీస్ తో ఇలాంటి అసౌకర్యాన్ని తొలగిస్తుంది . అయితే, ఈ క్రింది తెలిపిన హోం రెమెడీస్ ను మీరు తీసుకోవాలనుకున్నప్పుడు డాక్టర్ ను తప్పనిసరిగా సంప్రదించాలి .
గర్భాధారణ సమయంలో ఈ సమస్యను నుండి బయటపడటానికి వివిధ రకాల మార్గాలున్నాయి . షుగర్ ఫుడ్స్ తీసుకోవడం మానేయడం, భోజనం తక్కువగా తీసుకోవడం, వీటికి ప్రత్యామ్నాయంగా ఫైబర్ ఫుడ్స్ అధికంగా తీసుకుంటూ..ప్రతి రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది . అలాగే డీప్ ఫ్రై చేసిన ఆహారాలు నివారించి, ఒత్తిడి లేని జీవితాన్ని పొందాలనుకుంటే హెల్తీ ఫుడ్స్ ను ఎంపిక చేసుకోవాలి.
వీటితో పాటు, గర్భధారణ సమయంలో మీరు తీసుకోవల్సిన మరికొన్ని హోం రెమెడీస్ ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఇవి కడుపుబ్బరాన్ని నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. మరి గర్భాధారణ సమయంలో కడుపుబ్బరాన్ని నివారించే ఆహారాలేంటో తెలుసుకుందాం...

ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవాలి:
ముఖ్యంగా గర్భాధారణ సమయంలో కడుపుబ్బరం మరియు మలబద్దకం సమస్యలను నివారించుకోవడానికి, అసౌకర్యాన్ని తగ్గించుకోవడానికి ఫైబర్ రిచ్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

అల్లం:
అల్లం స్టొమక్ అప్ సెట్ నివారిస్తుంది మరియు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. . ఇది జీర్ణశక్తిని పెంచే అద్భుత హెర్బ్ . అందుకు మీరుచేయాల్సిందల్లా , అల్లంను టీ రూపంలో తీసుకోవడం . ఇది వికారం, బ్లోటింగ్, మరియు స్టొమక్ అప్ సెట్ ను నివారిస్తుంది.

అరటి:
అరటిపండులో ఫైబర్ అధికంగా ఉంది. అరటిపండ్లు మలబద్దానికి కారణమయ్యే గ్యాస్ మరియు కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయి . కాబట్టి, అరటిపండ్లలో ఉండే పొటాషియం అనే మినిరల్స్ శరీరంలో ఫ్లూయిడ్ లెవల్స్ రెగ్యులేట్ చేస్తుంది. బ్లోటింగ్ నుండి ఉపశమనం కలిగిస్తుంది.

నట్స్:
నట్స్ లో నియాసిన్ కాంపౌడ్ మనకు అవసరం అయిన న్యూట్రీషియంట్స్ జీర్ణవ్యవస్థను యాక్టివ్ గా ఉంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . పొట్టలో గ్యాస్ ను నివారించడానికి రోజులో అప్పుడప్పుడు నట్స్ తింటుండాలి. అంతే కాదు, తల్లికి అవసరం అయ్యే పోషకాలన్నీ ఈ నట్స్ ద్వారా పొందవచ్చు.

పుదీనా తినాలి
పుదీనా ఉబ్బరం తగ్గించడం మరియు కడుపు నొప్పి తగ్గటానికి ఉపయోగకరంగా ఉంటుంది. కడుపు ఉబ్బరం కారణంను పరిక్షించినపుడు ఉబ్బరం బాధ ఏ సమయంలో నైన రావచ్చు. పుదీనాను టీ లేదా ఒక క్రషర్ రూపంలో తీసుకోవచ్చు.పుదీనాను ఒక బుడగలు వచ్చే పానీయంతో కలిపి తీసుకోవటం అనేది చాలా మంచి పరిష్కారం అని చెప్పవచ్చు. పుదీనాతో పాటు ఉబ్బరం నొప్పులు తక్షణ ఉపశమనం కలిగించటానికి అల్లం,నల్ల ఉప్పు,నిమ్మరసం మొదలైనవి ఉన్నాయి. ఈ ఆహారాలను తీసుకోవటం వలన ఉబ్బరం నొప్పి తగ్గి మళ్ళీ కడుపును తేలికగా చేస్తుంది.

మెంతులు:
మెంతులు ఒక ఉత్తమ హోం రెమెడీ. కడుపుబ్బరాన్ని నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . గుప్పెడు మెంతులను ఒక గ్లాసు నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి . తర్వాత రోజు ఉదయం మెంతులు నానబెట్టిన నీటిని వడగట్టి పరగడుపున త్రాగాలి.

ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి:
ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల శరీరం హైడ్రేషన్ లో ఉంటుంది . మరియు ప్రొపర్ బౌల్ మూమెంట్ ఉంటుంది, దాంతో కడుపుబ్బరం తగ్గించుకోవచ్చు మరియు మలబద్దకం నివారించబడుతుంది. ఎక్కువగా నీరు మరియు ఫ్రెష్ జ్యూస్ లు తీసుకోవడం వల్ల కడుపుబ్బరం నివారించుకోవచ్చు.



Click it and Unblock the Notifications