For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో హెయిర్ ఫాల్ తగ్గించుకోవడానికి సులభ మార్గాలు..!

|

మహిళలు గర్భధారణ పొండానికి, గర్భం పొందిన తర్వాత స్త్రీ శరీరంలో అనేక మార్పులు జరుగుతాయి. హార్మోనుల హెచ్చుతగ్గుల మార్పులు సాధరణం. ఈ హార్మోనుల ప్రభావం వల్ల అనేక శరీరంలో అనేక మార్పులతో పాటు గర్భిణీ స్త్రీలో అనేక సందేహాలు కూడా మొదలవుతాయి. ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఎలా ఉండాలి. కడుపు పెరిగే బిడ్డ సంరక్షణ, ప్రసవం, ప్రసవం తర్వాత ఆరోగ్యం, ప్రీనేటల్ వెయిట్, పోస్ట్ నేటల్ వెయిట్ ఇలా అన్నింటిలోనూ సందేహాలు మెదలువుతాయి. అలాగే గర్భధారణ సమయంలో ఏర్పడే స్ట్రెచ్ మార్క్ తొలగింపు, చర్మం సంరక్షణ, జుట్టు సంరక్షణ అన్నింటి గురించి సందేహాలతో పాటు వాటికి పరిష్కార మార్గాలు వెదకడం మొదలు పెడుతారు.

గర్భం పొందిన తర్వాత హార్మోనుల ప్రభావం చేత చాలా మంది మహిళలో జుట్టు, గోళ్ళు వేగంగా పెరగడం గమనించవచ్చు. గర్భిణీ స్త్రీలు ఈ విషయాన్ని గమనించినట్లైతే, కొంత మందిలో జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కేశ సౌందర్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ప్రసవం తర్వాత విటమిన్లు, క్యాల్షియం, ఐరన్ లోపం వల్ల తిరిగి జుట్టు రాలడం మొదలవుతుంది. కాబట్టి, గర్భధారణ సమయంలో జుట్టు సంరక్షణ చాలా క్లిష్టమైనది. గర్భధారణ సమయంలో జుట్టు సంరక్షణ కోసం కొన్ని చిట్కాలు మీకోసం....

1. జుట్టుకు నూనె కంపల్సరీ:

1. జుట్టుకు నూనె కంపల్సరీ:

ప్రెగ్నెన్సీ సమయంలో గర్భిణీ తలకు తప్పని సరిగా నూనె రాయడం చాలా అవసరం. అంతే కాదు వారంలో ఒక మూడు సార్లు క్రమం తప్పకుండా నూనె అప్లై చేయాలి. మరియు హాట్ ఆయిల్ మసాజ్ కూడా గర్భిణీ స్త్రీలకు కొంత రిలాక్స్ ను మరియు జుట్టు ఆరోగ్యానికి పెరుగుదలకు సహాయపడుతుంది. కేశమూలాలకు బలాన్ని చేకూర్చుతుంది.

2. హెయిర్ డై కి గుడ్ బై చెప్పండి:

2. హెయిర్ డై కి గుడ్ బై చెప్పండి:

మీరు హెయిర్ డై లు కనుక ఉపయోగిస్తుంటే, గర్భధారణ సమయంలో హెయిర్ డైలకు నివారించండి. హెయిర్ డైలో ఉండే రసాయనాలు, ఆరోగ్యలక్షణాలను పెరగకుండా అడ్డుకుంటాయి. అయినా కూడా మీరు హెయిర్ డైలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటే కనుక నేచురల్ హెయిర్ డైలను ఎంపిక చేసుకోండి. గర్భధారణ సమయంలో ఖచ్చతంగా పాటించాల్సిన ఒక ముఖ్యమైన హెయిర్ కేర్ చిట్కా.

 3. హెడ్ మసాజ్ :

3. హెడ్ మసాజ్ :

మీలో అలసట, ఒత్తిడి వంటి అసౌకర్యమైన వాటిని దూరం చేయడానికి హెడ్ మసాజ్ బాగా సహాయపడుతుంది. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. కాబట్టి మీఅంత మీరే అప్పుడప్పు ఒక చిన్న పాటి హెడ్ మసాజ్ చేసుకోండి.

4. తడిగా ఉన్న జుట్టును దువ్వకండి:

4. తడిగా ఉన్న జుట్టును దువ్వకండి:

తడిగా ఉన్న జుట్టును ఎట్టిపరిస్థితుల్లోనూ దువ్వకూడద. గర్భధారణ సమయంలో హెయిర్ కేర్ తీసుకోవాలనుకొనేవారు, తడిగా ఉండే జుట్టును ఎప్పటికీ దువ్వకుండా తగుజాగ్రత్త తీసుకోవాలి. కేశాలు పూర్తిగా ఆరిన తర్వాత తలదువ్వుకోవాలి.

5. మార్పులను చూసి సంతోషం చెందండి:

5. మార్పులను చూసి సంతోషం చెందండి:

ప్రెగ్నెన్సీ అంటే మార్పులు. మహిళల్లో పొడవాటి మరియు మందపాటి జుట్టును పొందవచ్చు అంతే కాదు, కర్లీ హెయిర్ కూడా పొందే అవకాశం ఉంది. కాబట్టి గర్భధారణ పీరియడ్ లో ఇటువంటి అద్భుతాలను చూసి ఎంజాయ్ చేయండి. అలాగే హెయిర్ స్టైల్ ను మార్చుకోవచ్చు. ఇదంతా ప్రెగ్నెన్సీ సమయంలో తీసుకొనే హేయిర్ కేర్ వల్లనే సాధ్యం అవుతుంది.

6. హెల్తీ డైట్:

6. హెల్తీ డైట్:

గర్భధారణ సమయంలో హెయిర్ కేర్ తీసుకొనేటప్పుడు, నేచురల్ పదార్థాలకంటే విలువైనవి మరేవీ ఉండవు. కాబట్టి మీ డైట్ లో అరటి పండ్లు, పుచ్చకాయలు వంటి వాటిన తప్పక చేర్చడం వల్ల మీ శరీరంకు అవసరం అయ్యే న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ అందుతాయి. దాంతో మీ ఆరోగ్యానికి సరిపడా పోషకాలు అంది, జుట్టు పెరుగుదలకు ప్రోత్సహిస్తాయి. గర్భధారణ సమయంలో మహిళలు హెల్తీ డైట్ ను అనుసరించాలి. మహిళలు న్యూట్రీషియన్ ఫుడ్స్ ను ఎక్కువగా తీసుకోవడం మంచిది . న్యూట్రీషియన్ ఫుడ్స్ వల్ల తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారు. బిడ్డలో కూడా జుట్టు బాగా పెరుగుతుంది. ఇటువంటి ఫుడ్స్ లో ఉండే విటమిన్స్, మినిరల్స్ గర్భధారణ కాలంలో తల్లిబిడ్డ సురక్షితంగా ఉండటానికి సహాయపడుతాయి.

7.హెయిర్ స్టైలింగ్ లేదా హెయిర్ కట్ :

7.హెయిర్ స్టైలింగ్ లేదా హెయిర్ కట్ :

హెయిర్ కేర్ లో హెయిర్ కట్ కూడా ప్రధానమే. గర్భధారణ సమయంలో జుట్టు పెరిగే కొద్ది, చిన్న చిన్న మార్పులు, హెయిర్ స్టైల్ చేసుకోవడానికి హెయిర్ కట్స్ వంటివి చేసుకోవచ్చు. జుట్టు చివర్లు ట్రిమ్ చేయడం వల్ల మీజుట్టు అందంగా పెరగడానికి ఒక మంచి మార్గం.

8. కెమికల్ హెయిర్ కాస్మోటిక్స్ వాడకూడదు:

8. కెమికల్ హెయిర్ కాస్మోటిక్స్ వాడకూడదు:

మహిళలు మార్కెట్లో వచ్చే ప్రతి కాస్మోటిక్స్ కు అట్రాక్ట్ అవుతుంటారు. వీటిలో కెమికల్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి, గర్భధారణ సమయంలో కెమికల్ కాస్మోటిక్స్ ను వాడకపోవడం మంచిది.

9. మెడిటేషన్:

9. మెడిటేషన్:

గర్భధారణ సమయంలో ఒత్తిడి లేకుండా జీవించాలంటే మెడిటేషన్ గ్రేట్ గా సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో స్ట్రెస్ వల్ల జుట్టు రాలడం అధికంగా ఉంటుంది. కాబట్టి గర్భిణీలు మెడిటేషన్ చేయడం వల్ల గర్భిణీలు హెయిర్ ఫాల్ సమస్యను తగ్గించుకోవచ్చు. స్ట్రెస్ వల్ల తరచూ మూడ్ మారుతుంటుంది. కాబట్టి, రిలాక్స్ గా ఉండటం మంచిది.

English summary

How To Minimise Hair Fall During Pregnancy

Hair loss is a common problem that is faced by women during their pregnancy phase. Many hormonal changes that occur inside the body are responsible for an increased hair loss in women during pregnancy.
Story first published:Saturday, October 15, 2016, 11:13 [IST]
Desktop Bottom Promotion