For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భిణీలు ఉల్లిపాయలు తినడం వల్ల అద్భుత ప్రయోజనాలు

ఉల్లిపాయల్లో విటమిన్ సి, బయోటిన్, మాంగనీస్, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ బి6, ఫొల్లెట్, మొదలగునివి ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ అనేక ప్రయోజనాలను అందిస్తాయి.

By Super Admin
|

సహజంగా చాలా మందికి భోంచేసే సమయంలో ప్లేట్ లో పక్కన ఒక ఉల్లిపాయ ముక్క నంజుకోవడం గమనిస్తుంటాము. ఇటువంటి అలవాటు చాల తక్కువ మందికి మాత్రమే ఉంటుంది. అయితే కొంత మంది బిర్యాని, పలావ్ వంటి వంటలకు సైడ్ డిష్ లుగా రైతా, పెరుగుపచ్చళ్లు, సలాడ్స్ వంటి వాటిలో పచ్చి ఉల్లిపాయలను జోడించి తీసుకోవడం సహజం. ఇలా పచ్చి ఉల్లిపాయను తినడం గర్భిణీ స్త్రీలకు సురక్షితమా? పచ్చి ఉల్లిపాయల్లో సలర్ఫ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పుట్టబోయే బిడ్డకు సురక్షితమా ? ఇటువంటి సందేహం మీకు కూడా ఉంటే. ఈ ఆర్టికల్ పూర్తిగా చదవాల్సిందే..

ఉల్లిపాయల్లో ఆరోగ్య ప్రయోజనాలు అనేకం ఉన్నాయి. అయితే గర్భిణీలు వీటిని తినడం ఎంత మాత్రం సురక్షితం? నిజానిజాలేంటో తెలుసుకుందాం...

ఉల్లిపాయ అల్లియం కుటుంబానికి చెందిన హెర్బ్ , వెజిటేబుల్. కొన్ని వేల సంవత్సరాల నుండి, ఉల్లిపాయలను పండిస్తున్నారు. ఉల్లిపాయల్లో ఉండే ఘాటైన వాసన , ముఖ్యమైన ప్రయోజనాల వల్ల వైద్యపరంగా దీన్ని ఉపయోగిస్తున్నారు.

ఉల్లిపాయల్లో విటమిన్ సి, బయోటిన్, మాంగనీస్, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, విటమిన్ బి6, ఫొల్లెట్, మొదలగునివి ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఇవన్నీ అనేక ప్రయోజనాలను అందిస్తాయి. గర్శిణీలకు కూడా సురక్షితమైనవే. కాబట్టి, గర్భిణీలు ఉల్లిపాయలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనాలను పొందవచ్చో తెలుసుకుందాం..

గర్భధారణ సమయంలో ఉల్లిపాయలను తినడం వల్ల పొందే ప్రయోజనాలు:

 శరీరంను డిటాక్షిఫై చేస్తుంది:

శరీరంను డిటాక్షిఫై చేస్తుంది:

శరీరంలో ఎక్కువ మెటల్ కంటెంట్ ఉండటం తల్లి,బిడ్డకు హానికరం. ఉల్లిపాయల్లో ఉండే అమినో యాసిడ్స్,సిస్టైన్ మరియు మెథినైన్ లు శరీరంను నిర్విశీకరణం చేయడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

వ్యాధినిరోధక పెంచుతుంది:

వ్యాధినిరోధక పెంచుతుంది:

ఉల్లిపాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. అలాగే వివిధ రకాల న్యూట్రీషియన్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్ లక్షణాలు తల్లిలో వ్యాధినిరోధకతను పెంచి, కడుపులో పెరిగే బిడ్డకు రక్షణ కల్పిస్తుంది.

 మలబద్దకం నివారిస్తుంది:

మలబద్దకం నివారిస్తుంది:

ఉల్లిపాయల్లో డైటరీ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది బౌల్ మూమెంట్ ను రెగ్యులేట్ చేస్తుంది. మలబద్దకంతో బాధపడుతున్న గర్భిణీలు, పచ్చి ఉల్లిపాయలను తినడం వల్ల , గర్భిణీ స్త్రీలలో టాయిలెట్ సమస్యను నివారిస్తుంది.

 బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:

బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:

ఉల్లిపాయల్లో ఫైటోన్యూట్రీషియన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇవి బ్లడ్ ప్రెజర్ ను రెగ్యులేట్ చేస్తుంది. గర్భిణీల రెగ్యులర్ డైట్ లో ఉల్లిపాయలను చేర్చుకోవడం వల్ల గర్భధారణ సమయంలో వచ్చే బ్లడ్ ప్రెజర్ సమస్యలను రెగ్యులేట్ చేస్తుంది. నిద్రలేమి సమస్యలలు, జెష్టేషనల్ హైపర్ టెన్షన్, ప్రీమెచ్యుర్ డెలవీర వంటి సమస్యలను నివారిస్తుంది.

గర్బధారణ సమయంలో వచ్చే డయాబెటిస్ ను నివారిస్తుంది:

గర్బధారణ సమయంలో వచ్చే డయాబెటిస్ ను నివారిస్తుంది:

ఉల్లిపాయల్లో క్రోమియం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇల్యూసిన్ ను నివారిస్తుంది మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను రెగ్యులేట్ చేస్తుంది. జస్టేషనల్ డయాబెటిస్ ను నివారించడంలో ఉల్లిపాయలు ఒక సూపర్ ఫుడ్.

బరువు పెరగకుండా చేస్తుంది:

బరువు పెరగకుండా చేస్తుంది:

గర్భధారణ సమయంలో మహిళలు ఎక్సట్రా బరువు పెరగడం సహజం.కాబట్టి, గర్భధారణ సమయంలో ఉల్లిపాయలు తినడం వల్ల క్యాలరీలు , ఫ్యాట్ తక్కువగా ఉంటాయి. కాబట్టి, సలాడ్స్, సాండ్విచ్ లలో ఉల్లిపాయలు చేర్చుకోవడం వల్ల బరువు కంట్రోల్ అవుతుంది, ఆకలి తగ్గుతుంది.

దంత సమస్యలను, నివారించుకోవడానికి

దంత సమస్యలను, నివారించుకోవడానికి

గర్భిణీలో వచ్చే హార్మోనులు మార్పుల వల్ల దంత సమస్యలు ఉంటాయి. పాచి పెరుగుతుంది. ఇన్ఫ్లమేషన్, బ్లీడింగ్ సమస్యలు ఉంటాయి. కాబట్టి దంత సమస్యలను, నివారించుకోవడానికి యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్న ఉల్లిపాయలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఓరల్ హెల్త్ ను కాపాడుకోవచ్చు.

గొంతు నొప్పి నయం అవుతుంది:

గొంతు నొప్పి నయం అవుతుంది:

గర్భధారణ సమయంలో గొంతునొప్పితో బాధపడుతున్నట్లైతే ఇది యాంటీబయోటిక్ గా పినచేస్తుంది. గొంతులో ఇన్ఫెక్షన్స్ ఎఫెక్టివ్ గా తగ్గించుకోవడానికి ఉల్లిపాయ రసంలో తేనె చేర్చి తీసుకోవాలి.

English summary

Is It Safe To Eat Onions During Pregnancy?

Is It Safe To Eat Onions During Pregnancy?,Are you craving onions while pregnant? Do you want to ensure the safety of your unborn baby while enjoying onions? If you have been nodding your head along, you should consider reading our post. Onions offer a host of health benefits. But is craving onions during pre
Desktop Bottom Promotion