Latest Updates
-
ఈ 5 రాశుల వారికి కెరీర్లో బంపర్ ఆఫర్.. అకస్మాత్తుగా ధనలాభం ఖాయం! -
విష్కుంభ యోగం ముగింపు.. ప్రీతి యోగంతో ఈ రాశుల వారికి అదృష్టం, పనుల్లో విజయం ఖాయం! -
తిరుపతి లడ్డూ ఎందుకు అంత ప్రత్యేకం? దాని వెనుక ఉన్న పవిత్ర రహస్యం చాలామందికి తెలియదు! -
జూన్ 8 గ్రహాల గోచారం: మీన రాశిలో శని-చంద్రుల కలయిక.. ఈ రాశుల వారికి ఊహించని మార్పులు! -
మేషం, సింహం, ధనుస్సు రాశుల వారికి అద్భుతమైన యోగం..! - సోమవారం, 08 జూన్ 2026 -
కండరాలకు బలాన్నిచ్చే నేచురల్ ప్రోటీన్ పౌడర్..ఇంట్లోనే చేసుకోండిలా.. -
పితృ దోషం వల్లే జీవితంలో సమస్యలొస్తున్నాయా? పూర్వీకుల ఆత్మల గురించి శాస్త్రాలు చెప్పే రహస్యాలు ఇవే! -
2026 అంతర్జాతీయ యోగా దినోత్సవ ప్రత్యేకత ఇదే! -
ప్రేమలో అనుబంధం ఎప్పుడు మానసిక భారంగా మారుతుంది -
మైదా లేదు, భయం లేదు.. ఇంట్లోనే సులభంగా హెల్దీ బ్రెడ్-రవ్వ పిజ్జా..
ప్రెగ్నెన్సీ టైంలో స్పైసీ ఫుడ్ ఇష్టపడుతున్నారా ? ఐతే బీ అలర్ట్..!
గర్భిణీల కారం తినవచ్చా? మీకు స్పైసీ ఫుడ్స్ అంటే అంత ఇష్టమా..కన్సీవ్ అయిన తర్వాత కూడా స్పైసీ ఫుడ్ ను ఇష్టపడుతున్నారా? అయితే గర్భం పొందిన తర్వాత కారం తినొచ్చా.. ఒక వేళ తింటే ఎలాంటి ప్రభాం ఉంటుంది తెలుసుకుందాం...
ప్రతి ఒక్కరి జీవితంలోనూ వివిధ రకాల ఆహారాలను ఇష్టపడే వారు ఉంటారు. కొంత మంది స్వీట్స్, కొంత మంది పుల్లగా , కొంత మంది కారం ఎక్కువగా ఇష్టపడుతారు. అయితే గర్భిణీల విషయంలో ఏవి తినాలన్నా కొంచెం ముందు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం . మన భారతీయ వంటల్లో వివిధ రకాల మసాలాలుతో స్పైసీ వంటలకాలు తయారుచేస్తుంటారు. స్పైసీ ఫుడ్ మినిరల్స్, మరియు విటమిన్స్ అందిస్తాయి. ఒక విధంగా ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
అయితే గర్బిణి స్త్రీలు స్పైసీ ఫుడ్ తినడం వల్ల పొట్టలో జీర్ణం అవ్వడానికి కష్టం అవుతుంది. దాంతో అసిడిక్ రిఫ్లెక్షన్ కు గురి అవుతుంది. మరి గర్భిణీలు స్పైసీ ఫుడ్ తినడం సురక్షితమేనా...?
స్పైసీ ఫుడ్ అంటే సాధారణ వ్యక్తులే కాదు, గర్భం పొందిన మహిళలకు కూడా ఎక్కువగా ఇష్టపడుతారు. స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల తల్లి కానీ, లేదా బిడ్డకు కానీ ఎలాంటి హాని జరగదు. కానీ ఈ సమయంలో స్పైసీ ఫుడ్ తినడం వల్ల గతంలో(సాధారణ స్థితిలో)కంటే గర్భాధారణ సమయంలో అసౌకర్యంగా ఉంటుంది . అందుకు ముఖ్య కారణం..

హార్మోన్ల మార్ప:
స్పైసీ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల అనేక ఇతర దుష్ప్రభావాలతో పాటు, హార్మోనుల్లో మార్పు వల్ల పొట్ట కండరాల మీద కూడా ప్రభావం చూపుతుంది . ఆహారంను జీర్ణం అవ్వడానికి పేగులో ముందుకు నెట్టడానికి పొట్ట కండరాలను ఆలస్యం చేస్తుంది .

అసిడిక్ రిఫ్లెక్షన్ :
పొట్ట నుండి ఫుడ్ పైప్ లోనికి ఆహారాన్ని నెట్టడం అసిడిక్ రిఫ్లెక్షన్ వల్ల కష్టం అవుతుంది . గర్భం పొందిన తర్వాత ప్రొజెస్టెరాన్ అనే హార్మోన్ శరీరంలో డరాలను మరియు ఇతర కణజాలను విశ్రాంతి పరుస్తుంది.

అసిడిక్ రిఫ్లెక్షన్
కండరాలు కణజాలాలు ఎక్కువ విశ్రాంతికి గురైనప్పుడు, మనం తీసుకొన్న ఆహారం పొట్ట నుండి జీర్ణాశయం, ఫుడ్ పైప్ లోకి వెళ్లకుండా ఆలస్యం అయినప్పుడు అసిడిక్ లెవల్ పెరగడం వల్ల , స్పైసీ ఫుడ్స్ తినప్పుడు, ఈ అసిడిక్ రిఫ్లెక్షన్ మరింత ఎక్కువ అంతుంది.

హార్ట్ బర్న్ కు గురిచేస్తుంది.
గర్భధారణ సమయంలో గర్భిణీలో హార్మోనుల మార్పులు వల్ల మరియు బేబీ గ్రోత్ వల్ల పొట్టతో పాటు బాడీ కూడా క్రమంగా పెరుగుతుంది. అటువంటి సమయంలో గర్భిణీ తీసుకొన్న ఆహారం ఫుడ్ పైప్ లోకి నెట్టనప్పుడు, తిన్న ఆహారం పైనే ఉండటం వల్ల హార్ట్ బర్న్ కు గురిచేస్తుంది.

హార్ట్ బర్న్:
హార్ట్ బర్న్ సమస్య సాధారణంగా 4 నెల నుండి ప్రారంభమౌతుంది. హార్ట్ బర్న్ అంటే ఛాతీలో మంటగా ఉండటం. ఇది ఛాతీ బోన్ క్రింద మొదలై గొంతు వరకూ పాకుతుంది,. ఇది అసౌకర్యంగా ఉంటుంది. గర్భధారణలో హార్ట్ బర్న్ కు ఇతర కారణాలు కూడా ఉన్నాయి..

ఆనియన్ మరియు గార్లిక్
పచ్చివి లేదా ఉడికించిన ఉల్లి మరియు గార్లిక్ ఘాటైన వాసన కలిగి ఉండటం వల్ల వీటిని తినడం వల్ల అంత టేస్ట్ అనిపంచకపోయినా, హార్ట్ బర్న్ కు గురిచేస్తుంది.

ఆయిల్ ఫుడ్స్
ఆయిల్ ఫుడ్స్ మరియు గ్రీసీ ఫుడ్స్ తిన్నప్పుడు, అది ఫుడ్ పైప్ లోని సులభంగా నెట్టుతుంది, అప్పుడు కూడా హార్ట్ బర్న్ కు గురి అవుతుంది.

కెఫిన్ ఉన్న పానీయాలు
అలాగే కెఫిన్ ఉన్న పానీయాలు తీసుకొన్నప్పుడు హార్ట్ బర్న్ కు గురి అవుతుంది.

మందుల వల్ల కూడా
గర్భిణీ తీసుకొనే మందుల వల్ల కూడా హార్ట్ బర్న్ కు కారణం అవుతుంది.

వికారం లేదా మార్నింగ్ సిక్ నెస్:
స్పైసీ ఫుడ్స్ తినడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ కు దారితీస్తుంది. మసాలాలు వేయించినప్పుడు , వాటిని నుండి వచ్చే వాసన వల్ల వికారం మరియు మార్నింగ్ సిక్ నెస్ కు దారితీస్తుంది. వికారం హార్ట్ బర్నింగ్ కు రెట్టింపు చేస్తుంది. దాంతో మరింత అసౌకర్యం కలుగుతుంది.



Click it and Unblock the Notifications