Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
గర్భధారణ సమయంలో టీ మరియు కాఫీ ఏది సురక్షితం ?
ముఖ్యంగా మేము నిద్రాణస్థితిలో మరియు బద్దకంగా ఉన్నప్పుడు కాఫీ మరియు టీ గొప్ప మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా అలసట మరియు నిద్ర అనుభూతి ఉన్నప్పుడు కాఫీ మరియు టీలను ఇష్టపడతారు. కానీ, కాఫీ లేదా టీ వినియోగం అనేది గర్భధారణ సమయంలో ఎంతవరకు సురక్షితంగా ఉంది?
ఈ వ్యాసం లో, మీరు ఈ కీలకమైన ప్రశ్నకు సమాధానంను కనుగొంటారు. తల్లి తాగే పానీయాలు మాయ ద్వారా పిండానికి చేరతాయి. తల్లి మరియు బిడ్డ మధ్య ఒక బలహీనమైన మావి అవరోధంగా ఉంది.
ఇది శిశువు ఆహార మరియు పోషకాల సరఫరాకు సహాయపడుతుంది మరియు అదే సమయంలో శిశువు రక్తంలోకి ఎంటర్ అయ్యే కొన్ని విష పదార్థాలను నిరోధిస్తుంది.అయితే, ఇది గర్భంలోని శిశువులోకి అన్ని విష పదార్థాలను ప్రవేశించకుండా నివారించగల బలమైన అవరోధం మాత్రం కాదు.
ఇప్పుడు, గర్భధారణ సమయంలో కాఫీ మరియు టీ వినియోగం గురించి తెలుసుకుందాం. అవును, గర్భధారణ సమయంలో కాఫీ మరియు టీ తీసుకోవటం హానికరం. అయితే అది కూడా ఎక్కువగా తీసుకుంటే మాత్రమే. అయితే కాఫీ ఎంత పరిమాణంలో తీసుకోవాలి.

ఎంత కాఫీ తీసుకోవాలి
ఒక రోజు లో కెఫిన్ 200 mg కంటే ఎక్కువ మించకూడదు. మీరు రెండు కప్పుల కాఫీకి బదులు ఒక కప్పు ఇన్ స్టంట్ బ్రూ కాఫీ త్రాగటం మంచిది. కాఫీ చాలా తక్కువగా తీసుకోవాలి. నిజం చెప్పాలంటే గర్భధారణ సమయంలో కాఫీ నుంచి దూరంగా ఉండటం సురక్షితం.

ఎన్ని మిల్లీ లీటర్ ల కాఫీ త్రాగాలి
ఎక్కువ కెఫీన్ కలిగిన పొడి కాఫీ, ఫిల్టర్ కాఫీ, ఎస్ప్రెస్సో లను నివారించండి. 200 ml పరిమాణంలో తేలికపాటి కప్పుతో కాఫీ త్రాగాలి. ఎక్కువ పరిమాణంలో కాఫీ త్రాగటం హానికరం. ఎక్కువ పరిమాణం అయితే కెఫీన్ ప్రభావం పెరుగుతుంది.

గర్భస్రావం మరియు తక్కువ బరువు పిల్లలు పుట్టటం
కాఫీ 200 mg కంటే ఎక్కువగా క్రమం తప్పకుండా త్రాగితే గర్భస్రావ అపాయాన్ని పెంచుతుంది.అలాగే తక్కువ బరువుతో శిశువుకు జన్మనిచ్చే అవకాశాలు ఉన్నాయి. బలహీనమైన మరియు తక్కువ బరువుతో పుట్టిన పిల్లలు పెరిగినప్పుడు ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతాయి.

కాఫీ లో కెఫీన్ పిండం మీద ప్రభావం
కాఫీ వలన పెరుగుతున్న పిండం మీద అనేక హానికరమైన ప్రభావాలు ఉన్నాయి. కెఫిన్ మావి పొర ద్వారా సులభంగా శిశువు రక్తంలోకి ప్రవేశిస్తుంది. అందువలన, మీరు గర్భధారణ సమయంలో కాఫీని నివారించాలి.
గర్భధారణ సమయంలో మీరు కాఫీ కన్నా టీ త్రాగటం కొంచెం ఉత్తమం అని చెప్పవచ్చు. అంతేకాక టీని తేలికపాటిగా త్రాగితే మంచిది. గర్భధారణ సమయంలో గ్రీన్ టీని నివారించండి. దీనిలో కెఫిన్ మరియు అనేక ఇతర సమ్మేళనాలు కలిసి ఉండుట వలన గర్భస్రావంనకు దారితీస్తుంది



Click it and Unblock the Notifications