Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
నార్మల్ డెలివరీ కావడానికి 9వ నెలలో తీసుకోవాల్సిన ఆహారాలు
కన్వీస్ అయిన తర్వాత.. ప్రతి ఒక్కరూ సాధారణ డెలివరీ అయితే బావుంటుందని భావిస్తారు. ఎందుకంటే.. నార్మల్ డెలివరీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫ్యూచర్ అనారోగ్య సమస్యలకు అవకాశం ఉండదు. అలాగే.. ఇది తల్లీ బిడ్డ ఇద్దరికీ సురక్షితం. సిజేరియన్ వల్ల బరువు పెరగడానికి, వెన్నునొప్పి, ఇతర అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంటుంది. అందుకే ప్రతి ఒక్కరూ నార్మల్ డెలివరీకే ప్రాధాన్యత ఇస్తారు.
డెలివరీ డేట్ కంటే ముందుగా డెలివరీ అవడానికి కారణాలేంటి ?
కానీ ప్రస్తుత జీవనశైలి.. కార్పొరేట్ హాస్పిటల్స్ వ్యవహరించే తీరు వల్ల చాలా సందర్భాల్లో సిజేరియన్ డెలివరీలే ఎక్కువగా అవుతున్నాయి. లాస్ట్ ట్రైమ్ స్టర్ లో పొట్ట లావుగా అవుతున్న కొద్దీ.. ప్రెగ్నెన్సీ కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. డెలివరీ డేట్ దగ్గరపడే కొద్దీ.. అసహ్యం, అలసట, ఓపిక నశించడం వంటి రకరకాల సంకేతాలు కనిపిస్తాయి. కానీ.. ఈ సమయంలో చాలా రిలాక్స్ గా ఉండటం చాలా అవసరం.
అలర్ట్: గర్భిణీ స్త్రీలను అవాయిడ్ చేయాల్సిన డేంజరెస్ ఫుడ్స్
డెలివరీ డేట్ దగ్గరపడినప్పుడు లేదా డెలివరీ డేట్ దాటిపోయి ఇబ్బంది పడుతున్న సమయంలో.. కొన్ని రకాల ఆహారాలు, డ్రింక్స్ ని డైట్ లో చేర్చుకోవడం వల్ల.. న్యాచురల్ పద్ధతిలో నార్మల్ డెలివరీ అవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితమైన డైట్ ఫాలో అవడం వల్ల నార్మల్ డెలివరీ పెయిన్ ని తట్టుకునే శక్తి వస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. నార్మల్ డెలివరీకి సహాయపడే ఆహారాలేంటో ఇప్పుడు చూద్దాం..

పైనాపిల్
మీ డెలివరీ డేట్ దాటిపోయి ఉంటే.. పైనాపిల్ తినడం మంచిది. ఇందులో విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బ్రొమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది సర్విక్స్ ని స్మూత్ మార్చి.. నార్మల్ డెలివరీకి ప్రేరేపిస్తుంది.

వెల్లుల్లి
వెల్లుల్లిని రోజు వారీ డైట్ లో చేర్చుకోవాలి. వెల్లుల్లి.. నార్మల్ డెలివరీకి సహాయపడి.. పెయిన్ ని తగ్గించడానికి సహాయపడుతుంది.

పండు మిర్చి
సాధారణ డెలివరీకి సహాయపడే ఆహారాల్లో స్పైసీ ఫుడ్ అద్భుతమైన ఫలితాన్నిస్తుంది. ఒక వేళ మీ డెలివరీ డేట్ దాటిపోయి ఉంటే.. స్పైసీ ఫుడ్ తీసుకోండి. అయితే మరీ ఎక్కువ మోతాదులో తీసుకుంటే.. పొట్టలో ఇబ్బంది తలెత్తుంది.

ఫైబర్ ఫుడ్
నార్మల్ డెలివరీకి సహాయపడేవాటిలో ముఖ్యమైనవి ఫైబర్ ఫుడ్స్. మరీ ఎక్కువ మొత్తంలో ఫైబర్ ఫుడ్ తీసుకుంటే.. కడుపు ఉబ్బరం ఏర్పడవచ్చు. కాబట్టి ఫైబర్ ఫుడ్ తో పాటు, ఫ్లూయిడ్స్ తో బ్యాలెన్స్ చేసుకోవాలి.

రస్ బెర్రీ టీ
ఒక కప్పు రస్ బెర్రీ టీలో ఉండే పోషకాలు.. గర్భాశయంలో సంకోచానికి ప్రేరేపిస్తాయి. అలాగే ఇది శరీరంలో వేడికి కారణమవుతుంది. కాబట్టి.. ఈ టీ తాగడం వల్ల నార్మల్ డెలివరీ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు.

చైనీస్ ఫుడ్
సాస్ లు, మిర్చీ, స్పైస్ కారణంగా.. చైనీస్ ఫుడ్ నార్మల్ డెలివరీని ప్రేరేపిస్తుంది. చైనీస్ ఫుడ్ తీసుకోవడం వల్ల గర్భిణీల్లో చాలా రిలాక్సేషన్ ని ఇస్తుంది.

వంకాయ
డైట్ లో వంకాయలను చేర్చుకోవడం వల్ల.. నార్మల్ డెలివరీని ప్రోత్సహిస్తుంది. డెలివరీ డేట్ దాటిన తర్వాత నార్మల్ డెలివరీ అవడానికి, డెలివరీ పెయిన్ తట్టుకోవడానికి సహాయపడే వంకాయను కంపల్సరీ మీ డైట్ లో చేర్చుకోవాలి.



Click it and Unblock the Notifications