Latest Updates
-
భరణం కట్టలేక లోన్ ఈఎంఐల సాకు చెబుతున్నారా? సుప్రీంకోర్టు షాకింగ్ తీర్పు ఇదే! -
సీతా నవమి 2026: దంపతులు ఈ పూజ చేస్తే వైవాహిక జీవితంలో అద్భుతమైన మార్పులు! -
వడగాల్పుల ఎండలు మండిపోతున్నాయా? మీ కుటుంబాన్ని కాపాడుకోవడానికి ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
NEET UG 2026: అడ్మిట్ కార్డ్ వచ్చేస్తోంది.. పరీక్షలో విజయం సాధించాలంటే చాణక్యుడు చెప్పిన ఈ సూత్రాలు పాటించండి! -
నేటి గ్రహాల సంచారం: సూర్య-చంద్రుల కలయికతో ఈ రాశుల వారికి అదృష్టం పండబోతోంది! -
పుష్య నక్షత్రం, అమృత కాలం కలయిక.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు! -
స్టవ్ తో పనేలేదు,ఎండ ఉంటే చాలు..వాడిపోయిన నిమ్మకాయలతో అదిరిపోయే ఊరగాయ..పెరుగన్నం,పప్పులోకి కేక -
రాజస్థానీ స్పెషల్ గులాబ్ జామున్ కర్రీ..గిన్నెలు లేపాల్సిందే! -
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా?
పురుషుల్లో సంతానలేమి మేజర్ కారణాలివే...
సంతానం కలగడం అనేది జీవీతంలో అత్యంత మధురమైన అనుభవం. కుటుంబంలో ప్రతీ ఒక్కరూ ఆనందించే మధురఘట్టం. అయితే కొంత మందిలో కొన్ని కారణాల వల్ల సంతానం కలగదు. శరీరంలో హార్మోన్ల సమతుల్యత ఉండడం, సంతానోత్పత్తి అవయవాల పనితీరు చక్కగా ఉండటం, మానసికంగా ఆరోగ్యంగా ఉండడం వంటివన్నీ తోడైతేనే సంతానం కలగటానికి అవకాశం ఉంటుంది. అయితే వీటిలో ఏదైనా సమస్య ఎదురైనపుడు సహజప్రక్రియకు ఆటంకం కలుగుతుంది.
సంతానం కలగలేదంటే అందుకు మహిళను కారణంగా చూపడం మన సమాజంలో పరిపాటి. ఇది కేవలం అపోహ మాత్రమే. సంతానలేమికి కారణాలన్నవి అటు మహిళలలోనూ, ఇటు పురుషులలోనూ లేదా ఒక్కోసారి ఇద్దరిలోనూ ఉండవచ్చు. అంటే... దంపతులిద్దరిలో లోపం ఎవరిలోనైనా ఉండవచ్చునన్నమాట.

పురుషుల్లో వీర్యకణాల సంఖ్య తగినంతగా లేకపోవడం కూడా సంతానలేమికి కారణం కావచ్చు. అలాగే స్త్రీలలోనైతే హార్మోన్ల లోపం, థైరాయిడ్ సమస్య, పీసీఓడీ వంటి అనేక అంశాలు సంతానలేమికి కారణం కావచ్చు.
పురుషుల్లో సంతాన లేమి సమస్యకు ముఖ్యకారణం వీర్యకణాల లోపాలే. సాధారణంగా పురుషుల్లో 20 మిలియన్లు లేదా అంతకంటే ఎక్కువ వీర్యకణాలు ఉండాలి. వాటిలో కదలికలు 70 శాతం ఉండాలి. ఆకృతి 70 శాతం ఉండాలి. అప్పుడు దానిని ఫర్టైల్ సెమన్ అంటారు.

వీర్యకణాల సమస్యలు
-ఎస్పెర్మియా - ఈ సమస్య ఉన్న వారిలో వీర్యం ఉత్పత్తి కాదు
-అజుస్పెర్మియా - వీర్యం ఉంటుంది. కానీ వీర్యకణాలు అసలు ఉండవు
-ఆలిగోస్పెరియా - వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది.
-అస్థినోస్పెరియా - వీర్యకణాలు కదలికలు లేక చురుకుదనం తక్కువగా ఉంటుంది.
-టెరటోస్పెర్మియా - వీర్యకణాల ఆకృతి సరిగ్గా లేకపోవడాన్ని టెరటోస్పెర్మియా అంటారు. కొంతమందిలో ఆలిగో, ఆస్టినో, టెరటోస్పెర్మియాలు కలిసి ఉండవచ్చు. మరికొంతమందిలో సెమన్‌లో ఇన్‌ఫెక్షన్ల వల్ల కూడా కణాల సమస్యలు రావచ్చు.

పురుషుల్లో వంద్యత్వానికి కారణాలు...
-హార్మోన్ల లోపం - వీర్యకణాల ఎదుగుదలకు అవసరమైన హార్మోన్ల లోపం వల్ల వీర్యకణాల సమస్యలు రావచ్చు.
-వీర్యకణాల ఎదుగుదల లేకపోవడం - పైన చెప్పిన విధంగా వీర్యకణాల ఎదుగుదల దశలలో ఎదైనా కారణం చేతనైనా పెరుగుదల ఆగిపోతుంది.
-వేరికోసిస్ - చాలా మందిలో వేరికోసిల్ సమస్య వీర్యకణాల లోపాలనికి కారణమవుతుంది. పొగతాగడం, డ్రగ్స్, మద్యం సేవించడం, కొన్ని రకాల మందులు, ఊబకాయం, థైరాయిడ్ సమస్యలు, మధుమేహం క్రోమోజోముల సమస్యలు, వీర్యం బయటకు వచ్చే నాళాల సమ్స్యలు, శృంగార సమస్యలు అంటే శృంగారపరమైన కోరికలు లేకపోవడం, అంగస్థంభన సమస్యలు, శ్రీఘ్రస్కలనం, గనేరియా, సిఫిలిస్, హెర్పిస్ వంటి సుఖవ్యాధులు కారణమవుతాయి. ఎక్కువగా వేడిగా ఉండే వాతావరణంలో పనిచేయడం, తిరగడం, బిగుతుగా ఉండే లోదుస్తులు ధరించడం కూడా కారణమవుతుంది.

డిప్రెషన్, ఆత్మవిశ్వాసం లేకపోవడం, పెర్ఫార్మెన్స్ యాంగ్జయిటీ కూడాకరణమే. ఒక్కోసారి ఏ కారణం తెలియకుండా వీర్యకణాల లోపం రావచ్చు.



Click it and Unblock the Notifications