Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ప్రెగ్నెన్సీ సమయంలో బ్యాక్ పెయిన్ నివారించడం ఎలా
గర్భధారణ సమయంలో గర్భిణీలు సాధారణంగా ఎదుర్కొనే సమస్యల్లో బ్యాక్ పెయిన్ ఒకటి. అందుకు ముఖ్య కారణంలో గర్భిణీ స్త్రీలో యూట్రస్ విస్తరించడం మరియు శరీరంలో హార్మోనల్ మార్పుల వల్ల వెన్నునొప్పికి కారణం అవుతుంది. యూట్రస్ విస్తరించే కొద్ది, సెంటర్ గ్రావిటీ పెరుగుతూ స్ట్రెచ్ అవుతుంటుంది. పొట్ట ఉదయం యొక్క కండరాలు విస్తరించడం వల్ల వెన్నెముక యొక్క ఎముకలు బలహీనం చేస్తుంది.
ఈ సమయంలో, బాడీ వెయిట్ మీద పడే ఒత్తిడి వల్ల బ్యాక్ పెయిన్ ప్రారంభమౌతుంది. శరీరంలో హార్మోనల్ మార్పుల వల్ల శరీరంలోని జాయింట్స్ మరియు లిగమెంట్స్ , పెల్విన్ మరియు స్పైనల్ కార్డ్ కు అటాచ్ గా ఉన్న బోన్స్ ను వదులవుతాయి. దాంతో బాడీ స్టెబుల్ గా ఉండదు. మరియు కదలికల సమయంలో నొప్పికి దారితీస్తుంది.
మరి ఈ బ్యాక్ పెయిన్ నివారించడం ఎలా?ప్రెగ్నెన్సీ బ్యాక్ పెయిన్ నివారించడానికి కొన్ని పద్దతులున్నాయి, సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వెన్నునొప్పిని తగ్గించుకోవచ్చు . ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో(5 నుండి 7 నెలలో)వచ్చే నొప్పి క్రమంగా లేకుండా మెలిపెడుతూ నొప్పికి గురిచేస్తుంది. మరి తొమ్మిది నెలల పాటు ఎలాంటి బ్యాక్ పెయిన్ లేకుండా నివారించాలింటే స్ట్రాంగ్ బ్యాక్ ను పొందాలంటే ఎలాంటి మెడికేషన్ అవసరం లేకుండా ఈ క్రింది పద్దతులు గ్రేట్ గా సహాయపడుతాయి.

బెల్లీ సపోర్ట్ బ్యాండ్:
వెన్నునొప్పికి అతి పెద్ద కారణం , బేబీతో పాటు, తల్లి యొక్క బరువు క్రమంగా పెరగడం.అందుకు బెల్లీ సపోర్ట్ బ్యాండ్ ను వేసుకోవడం మంచిది . ఇది బెల్లీ పెరిగేకొద్ది సపోర్టివ్ గా ఉంటుంది. అలాగే బాడీ పోశ్చర్ ను మెరుగుపరుస్తుంది. గర్భధారణ సమయంలో బ్యాక్ పెయిన్ నివారిస్తుంది.

నిద్రకు సపోర్ట్ గా
గర్భధారణ సమయంలో సౌకర్యవంతంగా నిద్రపోవడానికి ఒక మంచి సమయం, ముఖ్యంగా నెలలు పెరిగే కొద్ది, సౌకర్యవంతమైన భంగిమలో నిద్రించాలి. పొట్ట ఉదరానికి సపోర్టివ్ గా పిల్లో పక్కన అమర్చుకొని పడుకోవాలి. ఇలా చేయడం వల్ల వెన్నుయొక్క కండరాలు మీదఒత్తిడి తగ్గుతుంది . మరియు బ్యాక్ పెయిన్ నివారించడానికి సహాయపడుతుంది.

మెడిటేషన్
మెడిటేషన్ వల్ల బ్రెయన్ రిలాక్స్ అవుతుంది మరియు స్ట్రెస్ హార్మోన్లు విడుదలవుతాయి, దాంతో శరీరంలో స్ట్రెస్ లెవల్స్ తగ్గుతాయి . దాంతో శరీరంలో టాలరెన్స్ లెవల్స్ పెరుగుతాయి. అప్పుడు శరీరం బరువును, నొప్పిని ఓర్చుకోకలిగిన శక్తిని అందిస్తుంది. మెడిటేషన్ కన్సీవ్ అయిన తర్వాత ఎప్పుడైనా ప్రయత్నించవచ్చు. మరియు ఇది చేయడం చలా సులభం. ఇది నాడీవ్యవస్థను విశ్రాంతి పరుస్తుంది . దాంతో శరీరం రిలాక్స్ గా మార్చుతుంది.

స్విమ్మింగ్
గర్భిణీ స్త్రీలకు స్విమ్మింగ్ ఒక ఒక ఉత్తమ వ్యాయామంగా సూచిస్తారు. ఎందుకంటే ఇది కండరాలను రిలాక్స్ చేస్తుంది మరియు బ్యాక్ పోర్షన్ ను బలోపేతం చేస్తుంది. వాటర్ లో స్విమ్ చేయడం వల్ల బరువు తగ్గించుకోవచ్చు . బాడీ ఫంక్షన్స్ క్రమంగా జరుగుతాయి . మరియు అన్ని రకాల నొప్పులను నివారిస్తుంది.

సరైన ఫూట్ వేర్
గర్భధారణ సమయంలో సౌకర్య వంతంగా ఉండే స్లిప్పర్స్ వేసుకోవాలి. హైహీల్స్ అంత మంచిది కాదు. వాటిని వేసుకోవడం వల్ల నొప్పి తిరిగి వస్తుంటుంది . హైహీల్స్ వల్ల లోయర్ బ్యాక్ మీద ఎక్కువ ఒత్తిడిని పెంచుతుంది మరియు గర్భధారణ సమయంలో బ్యాక్ మజిల్స్ స్టిఫ్ గా ఉంటాయి . దీని వల్ల కూడా నొప్పి ఎక్కువగా ఉంటుంది.

ప్రీనేటల్ యోగ
బ్యాక్ పెయిన్ నివారించడానికి మరో ఎఫెక్టివ్ మార్గం యోగ, ఇది బ్యాక్ పెయిన్ నివారిస్తుంది . ఇది శరీరం రిలాక్స్ అయ్యేలా చేస్తుంది మరియు మంచి నిద్రకు సహాయపడుతుంది. బ్యాక్ పెయిన్ కాకుండా, జాయింట్స్ సౌకర్యంగా ఉండేందుకు సహాయపడుతుంది . నాడీవ్యవస్థను నొప్పిలేకుండా చేస్తుంది.

మంచి భంగిమ
చివరగా, మంచి భంగిమను ప్రాక్టీస్ చేయడం చాలా అవసరం. బ్యాక్ బోన్స్ హెల్తీగా మరియు స్ట్రాంగ్ గా ఉండాలంటే, కూర్చొన్నప్పుడు, పడుకొన్నప్పుడు మంచి భంగిమ ఉండటం అవసరం.



Click it and Unblock the Notifications