Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
ప్రెగ్నెన్సీ సమయంలో దంత సమస్యలను నివారించే నేచురల్ రెమెడీస్
ప్రెగ్నెన్సీ సమయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవటం సహజం. కానీ చాలా మంది మహిళలు ఆ సమయంలో ఎంతో కీలకమైన దంతాల విషయంలో మాత్రం కొంత అలసత్వం చూపుతుంటారు. దంత సమస్యలను తేలికగా తీసుకుంటుంటారు. అలాంటి స్థితి పుట్టబోయే బిడ్డ దంతాలపై కూడా ప్రభావం చూపుతుందంటున్నారు నిపుణులు.
దంతాలు మరియు చిగుళ్ళ సమస్యలు గర్భిణీ స్త్రీలలో చాలా సాధారణ సమస్య . ఈ సమస్యను కొంత మంది మళల్లో మాత్రమే ఉంటుంది . ఇది హార్మోనుల్లో మార్పుల వల్ల ఇలా జరగుతుంది . గర్భిణీల్లో హార్మోనుల మార్పుల వల్ల దంతాలు , చిగుళ్ళు సెన్సిటివ్ గా మారడం మాత్రమే కాదు, త్వరగా ఇన్ఫెక్షన్స్ కు గురి అవుతుంది.
తల్లి ఓరల్ హెల్త్ సమస్యలు బిడ్డ మీద కూడా ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు . తల్లిల్లో ఉత్పత్తి అయ్యే ప్రొజెస్ట్రాన్ , షుగర్ ఫుడ్స్ ఎక్కువగా తినడం మరియు క్యాల్షియం లోపం వల్ల దంత సమస్యలు సాధారణంగా వస్తుంటాయి . ఈ సమస్యను నివారించుకోవడానికి హెల్తీ డైట్ ఫాలో అవ్వాలి. మరియు గర్భిణీల రెగ్యులర్ డైట్ లో ఫ్రూట్ మరియు వెజిటేబుల్స్ ను ఎక్కువగా తీసుకోవాలి .ఇది దంతాలు మరియు ఇతర సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.
చాక్లెట్స్, స్వీట్స్ పరిమితం చేయడంతో పాటు రోజుకు రెండు సార్లు బ్రెష్ చేసుకోవాలి . దంతాలు, చిగుళ్ళ సమస్యలను ఇంట్లోనే నివారించుకోవచ్చు . ఈ సమస్యలను నివారించుకోవడానికి కొన్ని హోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు . మరి దంత , చిగుళ్ళ సమస్యలను నివారించే హోం రెమెడీస్ ఏంటో ఒక సారి చూద్దాం....

గ్రీన్ టీ:
గ్రీన్ టీలోని యాంటీఆక్సిడెంట్స్ చిగుళ్ళ వాపును తగ్గిస్తుంది, మరియు పాచి ఏర్పడకుండా చేస్తుంది. గ్రీన్ టీలో ఉండే ఫాలీ ఫినాల్స్ , దంతక్షయం ఏర్పడకుండా చేస్తుంది

ఆలివ్ ఆయిల్:
ఆలివ్ ఆయిల్ మరో ఎఫెక్టివ్ హోం రెమెడీ. ఇది దంత సమస్యలను నివారిస్తుంది . దీన్ని డైలీ డైట్ లో చేర్చుకోవడం వల్ల దంతాలను బలోపేతం చేస్తుంది. పాచి ఏర్పడకుండా నివారిస్తుంది . ఇందులో యాంటీ బ్యాక్టీరియల్ లక్షనాలుండటం వల్ల గర్భాధారణ సమయంలో దంత సమస్యలను నివారిస్తుంది.

తేనె:
తేనె దంతాలకు సంబంధించిన సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది అన్ని రకాల విటమిన్స్, మినిరల్స్ మరియు న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది. ఇవి దంతాలు మరియు చిగుళ్ళు హెల్తీగా ఉండటానికి సహాయపడుతుంది

కలబంద కలబందలో యాంటీ ఫంగల్,
యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి . మరియు క్లెన్సింగ్ లక్షణాలు కూడా ఉండటం వల్ల ఓరల్ హెల్త్ కు గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది క్యావిటీతో పోరాడుతుంది . ఇది బ్లీడింగ్ మరియు స్వెల్లింగ్ ను తగ్గిస్తుంది దాంతో డెంటల్ సమస్యలను తగ్గించుకోవచ్చు.

బేకింగ్ సోడ:
దంతాలు, చిగుళ్ళ వ్యాధికి కారణం అయ్యే ఎసిడిక్ కు వ్యతిరేకంగా పనిచేస్తుంది . బేకింగ్ సోడాను బ్రెష్ మీద చిలకరించి ప్రతి రోజూ రాత్రి నిద్రించడానికి ముందు బ్రెష్ చేసుకోవాలి. దంతసమస్యల నుండి మంచి ఉపశమనం కలిగించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది.

లవంగాలు:
లవంగం నూనె దంత సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది యాంటీ సెప్టిక్ గా పనిచేస్తుంది . గర్భాధారణ సమయంలో దంత సమస్యలను నివారిస్తుంది . మరియు ఇది బ్యాక్టిరియల్ ఇన్ఫెక్షన్స్ ను నివారిస్తుంది.



Click it and Unblock the Notifications