For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రెగ్నెన్సీ టైంలో పాదాల వాపు నివారించే సింపుల్ టిప్స్..

By Swathi
|

ప్రెగ్నన్సీ సమయంలో అనేక సమస్యలు ఎదుర్కొంటుండగా.. పాదాల వాపు అత్యంత భయంకరమైన సమస్య. ఇది నొప్పి లేకపోయినా.. నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయితే.. దీనికి మెడిసిన్స్ చాలానే ఉన్నాయి. అవి గర్భధారణ సమయంలో.. పాదాల వాపు నుంచి మంచి ఉపశమనం కలిగిస్తాయి.

ప్రెగ్నెన్సీ సమయంలో రోజుకి ఆరు నుంచి ఎనిమిది గ్లాసుల నీళ్లు తాగాలి. ఇది చాలా న్యాచురల్ ట్రీట్మెంట్. ఇంత మోతాదులో నీళ్లు ఖచ్చితంగా తాగడం వల్ల.. పాదాల వాపు నివారించవచ్చు. గర్భధారణ సమయంలో.. సరైన మోతాదులో నీళ్లు తాగడం వల్ల గర్భిణీల శరీరంలో మలినాలు తొలగించడం తేలికవుతుంది.

feet swelling during pregnancy

నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల.. ఎక్కువసార్లు బాత్ రూంకి వెళ్లాల్సి ఉంటుంది. శరీరంలో ఎక్కువగా ఉండే నీళ్లు బయటకు పంపడం వల్ల.. పాదాలవాపు తగ్గుతుంది. పాదాలతోపాటు, శరీరం, ముఖంలో వాపులను కూడా గర్భిణీల్లో తగ్గించవచ్చు. అలాగే ఎక్కువ సమయంలో ఒకే భంగిమలో నిలబడం కూడా తగ్గించాలి. ఎక్కువ సమయం నిలబడి ఉండటం వల్ల.. శరీరంలోని కింది భాగాలకు ఫ్లూయిడ్స్ ఫ్లో తగ్గి.. పాదాల్లో పగుళ్లకు కారణమవుతుంది.

గర్భిణీల్లో పాదాల పగుళ్లు నివారించడానికి సాల్ట్ తగ్గించడం కూడా చాలా అవసరం. గర్భిణీల్లో పాదాల వాపులకు ఎక్కువ సాల్ట్ తీసుకోవడం కూడా కారణమవుతుంది. అయితే శరీరంలో పనితీరు సరిగా ఉండాలంటే.. శరీరానికి కావాల్సిన సాల్ట్ అవసరం. కాబట్టి ప్రెగ్నెన్సీ సమయంలో.. సాల్ట్ సరిగా ఉండేలా జాగ్రత్త పడాలి.

అలాగే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం వల్ల కూడా గర్భిణీల్లో పాదాల వాపు నివారించవచ్చు. అలాగే టైట్ గా ఉండే దుస్తులు అంటే జీన్స్, ట్రౌజర్స్ కూడా పాదాలపై ఒత్తిడి పెంచి వాపుకు కారణమవుతాయి. కాబట్టి టైట్ గా ఉండే దుస్తులు వేసుకోకపోవడం మంచిది.

sitting position

గర్భిణీ స్త్రీలు ఒకే దగ్గర, ఒకే విధంగా ఎక్కువ సమయం కూర్చోకూడదు. ఇలా సెటిల్ అయిపోవడం వల్ల.. ఫ్లూయిడ్ సరఫరాకి అంతరాయం ఏర్పడి వాపులు రావడానికి కారణమవుతుంది. కాబట్టి పడుకున్నప్పుడు, కూర్చునప్పుడు కాసేపటికి పొజిషన్ మారుస్తూ ఉండాలి.

శరీరంలో వాపు ముఖ్యం పాదాల్లో వాపు కారణంగా అధిక బరువు, అసహ్యంగా కనిపించడానికి, ఎనర్జీ తగ్గిపోవడానికి కారణమవుతుంది. కాబట్టి.. గర్భిణీ స్త్రీలు పాదాల వాపు రాకుండా, పాదాల వాపు ఉన్నవాళ్లు ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయితే చాలు..

English summary

Simple Tips and Tricks To Reduce Feet Swelling During Pregnancy

Tips To Reduce Feet Swelling During Pregnancy. Out of the many issues that one faces during pregnancy, the worst has to be swollen feet.
Story first published: Monday, June 20, 2016, 10:37 [IST]
Desktop Bottom Promotion