Latest Updates
-
మధ్యాహ్నం 12 లేదా 2 గంటలకే చెక్ ఇన్..హోటల్స్ ఫాలో అయ్యే రూల్ వెనుక అసలు కథ! -
బఠానీ, పెసరపప్పు కాంబినేషన్... ఈ సమోసా రుచి చూస్తే మళ్లీ మళ్లీ తింటారు! -
వ్యాయామం చేసటప్పుడు విపరీతంగా చెమట.. కొవ్వు కరిగిపోతుందని అస్సలు సంబరపడొద్దు.! -
ఉదయం లేవగానే ఒళ్లు నొప్పులు, జాయింట్స్ పట్టేస్తున్నాయా? -
పప్పులు నానబెట్టే పనిలేదు,రుబ్బే శ్రమలేదు..అటుకులు,బంగాళదుంపలతో క్షణాల్లో కరకరలాడే అప్పడాలు.. -
ప్రెగ్నెన్సీలో చర్మం ఎందుకు నల్లబడుతుందో తెలుసా.. పిగ్మెంటేషన్‌ను ఇలా పోగొట్టుకోండి.! -
ఈ 5 రాశుల వారికి నేడు అదృష్టం.. శివయోగం ప్రభావంతో కాసుల వర్షం ఖాయం! -
గర్భస్రావం తర్వాత సంతాన సామర్థ్యం పెరుగుతుందా.. ఇందులో నిజమెంత.? -
జూన్ 24న శివ యోగం: ఈ సమయం నుంచి మీ కెరీర్, అదృష్టం మారుతుందా? -
ఇంట్లో శ్రీ చక్రం ఉంటే ఏమవుతుంది? ఆధ్యాత్మిక నిపుణులు చెప్పిన విషయాలు
ప్రెగ్నెంట్ మహిళలు సమ్మర్ లో తీసుకోవల్సిన జాగ్రత్తలు
ప్రస్తుతం వేసవి ఉక్కపోతతో సామాన్య ప్రజలే ఉక్కిరిబిక్కిర వుతుండగా.. గర్భిణుల పరిస్థితి ఎంటి..? రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఏ పనినీ ప్రశాంతంగా చేయలేకపోతున్నాం.. ఏ పని చేయాలన్నా చిరాకు కలుగుతోంది. గర్భిణీలు తమ బరువుతో పాటు కడుపులో పెరిగే బిడ్డ బరువును కూడా మోస్తున్న వారి పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ వేసవిని ఎలా ఎదుర్కొనేది.. వేసవిలో గర్భిణులు ఎదుర్కొంటున్న సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిట్కాలు పాటించడం వల్ల నుంచి ఫలితాలు సాధించవచ్చని స్త్రీ వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.
వేసవిలో గర్భంతో ఉన్నవారికి కొంచెం ఇబ్బందికరం గానే ఉంటుంది. శరీరంలో హార్మోన్లలో అనేక మార్పులు, ఈస్ట్రోజెన్ ఎక్కువగా పెరగడం వల్ల మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. గర్భిణులకు వేసవి కంటే శీతాకాలమే వారి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. వేసవిలో గర్భం దాల్చిన వారు తప్పనిసరిగా కొన్ని సమ్మర్ టిప్స్‌ను అనుసరించాల్సి ఉంటుంది.
వేసవి కాలంలో ఏ పని చేయాలన్నా చిరాకు కలుగుతుంది. ముఖ్యంగా గర్భిణీలు తల్లిబరువుతో పాటు కడుపులో పెరిగే బిడ్డ బరువు ను కూడా మోస్తుండడంతో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. హార్మోన్ల మార్పులతో శరీరంలో వేడి ఆవిర్లు వంటివి మరింత ఇబ్బంది కల్గిస్తాయి. సాధారణంగా మహిళలు గర్భం పొందిన తర్వాత వారిలో మామూలు కంటే బేసల్ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ బేసల్ టెంపరేచర్‌కు వాతావరణం వేడి కూడా జత అయితే పరిస్థితి అసౌకర్యం గా ఉంటుంది. అయితే చలికాలంలో లాగా మందంగా ఉన్న దుస్తులు ధరించడం, స్కార్ఫులు వంటి వాటితో చాలా ఇబ్బందులు ఎదురవుతుం టాయి. ముఖ్యంగా వేసవికాలంలో గర్భిణీలు సౌకర్యవంతమైన వదులు గా ఉండే దుస్తులను మాత్రమే ధరించాలి. అలాగే చాలా తేలికగా ఉండే ప్రింటెడ్ షిఫాన్, కాటన్ దుస్తులు మీ అందాన్ని మరింత రిఫ్రెష్ చేస్తాయి. అంతేకాకుండా వీటితోపాటు గర్భిణీలు తీసుకోవాల్సిన మరికొన్ని టిప్స్..

టిషర్ట్స్ అండ్ టాప్స్ వేసుకునే వారు వేసవికి అనుగుణంగా ఉండాలి.
ముఖ్యంగా లైట్‌గా, వదులుగా ఉండాలి. వేసుకునే మెటీరి యల్ సాప్ట్‌గా, సౌకర్యవంతంగా ఉండాలి. ప్రెగెం ట్ మహిళ ధరించే దుస్తులు లైట్ కలర్ ఉండాలి. ఎందుకంటే డార్క్ కలర్ దుస్తులు చాలా త్వరగా వేడిని గ్రహిస్తాయి. కాటన్ లేదా లెనిన్ సౌకర్యవం తంగా ఉంటాయి. ఎందుకంటే ఇవి చెమటను చాలా సులభంగా గ్రహించడమే కాక వేసవి ఎండ తీవ్రతను ఎదుర్కొవడానికి సహాయపడతాయి.

ఇంట్లోనే ఉండాలి
సాధ్యమైనంత వరకూ ఇంట్లోనే ఉండటానికి ప్రయత్నించాలి.

డీహైడ్రేషన్ తప్పించుకోవా లంటే ఎక్కువగా ద్రవాలు, తాజా జ్యూసులు, నీరు ఎక్కువగా తీసుకోవాలి.
వేసవిలో శరీరంలో పట్టే చెమటల కారణంగా గర్భిణీ డీహైడ్రేషన్ తప్పించుకోవా లంటే ఎక్కువగా ద్రవాలు, తాజా జ్యూసులు, నీరు ఎక్కువగా తీసుకోవాలి. కనీసం రోజుకు 3-4లీటర్ల నీరు తీసుకోవాలి. నీరు ఎక్కువగా ఉండే పుచ్చకాయ, కర్భూజ వంటి పండ్లు తీసుకోవాలి. కెఫినేటెడ్, సాప్ట్ డ్రింక్స్‌ని తీసుకోవటం వల్ల డీహైడ్రేషన్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల నెలల నిండకుండానే నొప్పులు రావడం, కాళ్ళు వాపులువచ్చే అవకాశం ఉంది.

విశ్రాంతి చాలా అవసరం
వేసవిలో గర్భిణీలకు విశ్రాంతి చాలా అవసరం. మద్యాహ్నం సమయంలో కూడా కనీ సం ఒక గంట అయినా రెస్ట్ తీసుకో వడం మంచిం ది. రాత్రి 7నుంచి 8గంటల విశ్రాంతి అవసరం.

స్విమ్ చేయడం
చాలా ఎక్కువగా వేడిగా భావిస్తుంటే స్విమ్ చేయడం వల్ల శరీరంను కూల్‌గా మార్చుకోవచ్చు.

గోరు వెచ్చని నీటితో స్నానం
వేసవిలో వేడి నుండి ఉపశమనం పొందాలంటే తరచూ గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచి మార్గం. ఇలా చేయడం వల్ల శరీరానికి తగినంత విశ్రాంతి కూడా దొరుకుతుంది.

ఆహారంలో ఉప్పును తగ్గించాలి.
.గర్భిణీలలో వాటర్ తగ్గడం వల్ల వచ్చే కాళ్ళ వాపులను తగ్గించుకోవాలంటే ఆహారంలో ఉప్పును తగ్గించాలి.

ఫ్లిప్‌ప్లాప్స్ ధరించాలి.
కాళ్ళకు చల్లగా ఉండేలా సౌకర్యవంతమైన ఫ్లిప్‌ప్లాప్స్ ధరించాలి. శాండిల్స్, బూట్లు ధరించకూడదు.

వ్యాయామం చేయాలి
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వ్యాయామం చేయాలి. ఎర్లీ మార్నింగ్, లేట్ ఈవెనింగ్ స మయాల్లో వ్యాయామంను ఎంపిక చేసుకోవాలి.



Click it and Unblock the Notifications