Latest Updates
-
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.? -
గుడిలో పెట్టే ప్రసాదం రుచితో.. ఈ జన్మాష్టమికి ఇంట్లోనే కమ్మని పంచామృతం చేసుకోండిలా.. -
చుక్క నూనె లేకుండా లంచ్ బాక్స్‌లోకి ఈజీగా చేసెయొచ్చు.. రక్తహీనతని సైతం తరిమికొట్టేస్తుంది.! -
Powerful Krishna Mantras: కృష్ణాష్టమి నాడు ఈ మంత్రాలు జపిస్తే.. మీ కోరికలన్నీ ఇట్టే నెరవేరుతాయి!
ప్రెగ్నన్సీ టైంలో ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడని లక్షణాలు..!!
గర్భం దాల్చడం అనేది చాలా అద్భుతమైన అనుభూతి. అలాగే.. చాలా అలర్ట్ గా ఉండాల్సిన సమయం కూడా. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యిందంటే.. ఏ తల్లికైనా ఆనందమే. కానీ.. చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం కూడా. కాబట్టి ఏ చిన్న కదలికలు, లక్షణాలు మీలో కనిపించినా.. వెంటనే అలర్ట్ అవ్వాలి. ప్రెగ్నెంట్ అయిన మొదటి రోజుల నుంచి తొమ్మిదో నెల వరకు ప్రతి విషయంలోనూ.. ప్రతి లక్షణంలోనూ జాగ్రత్త వహించాలి.
మీ గర్భం దాల్చిన తర్వాత ఈ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. వెంటనే డాక్టర్ ని సంప్రదించండి. ఏ మాత్రం అనుమానం కలిగినా.. ఆలస్యం, నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి. అలా కాకుండా మీకు తోచిన మెడిసిన్స్ ఉపయోగిస్తే మాత్రం రిస్క్ పడతారు. సో బీ అలర్ట్ అని సూచించే లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం..

జ్వరం
ఒకవేళ మీకు జ్వరంగా ఉండి.. టెంపరేచర్ 37.5 డిగ్రీలు ఉంది అంటే.. డాక్టర్ ని సంప్రదించాలి. వెంటనే యాంటీ బయాటిక్స్ సూచిస్తారు. అదే మీ టెంపరేచర్ 39 కంటే ఎక్కువ ఉందంటే.. బేబీకి హానికరమని గుర్తించండి.

పొట్ట పైభాగం లేదా కింది భాగంలో నొప్పి
ప్రెగ్నెన్సీ సమయంలో పొట్ట భాగంలో కొంచెం నొప్పిగా ఉన్నా.. ఎక్కువ నొప్పిగా ఉన్నా అలర్ట్ అవ్వాల్సిందే. దీనికి అనేక కారణాలుంటాయి. జీర్ణం సరిగా అవకపోవడం, ఎసిడిటీ, ఫుడ్ పాయిజనింగ్ కారణమవవచ్చు. మీ సెకండ్ హాఫ్ ప్రెగ్నెన్సీ సమయంలో ఈ నొప్పి కనిపించింది అంటే.. ప్రీ ఎక్లంప్సియా అంటారు. కాబట్టి అలర్ట్ గా ఉండాలి. ఏమాత్రం పొట్టలో నొప్పిగా అనిపించినా వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

బ్లర్ గా కనిపించడం
సెకండ్ హాఫ్ ప్రెగ్నన్సీ సమయంలో కంటి చూపుపై ప్రభావం ఉంటుంది. డబుల్ విజన్, బ్లర్, డిమ్, ఫ్లాష్ స్పాట్స్ కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి చూపు సమస్యలు ప్రీఎక్సలంప్సియాను సూచిస్తాయి.

చేతులు, పాదాల వాపు
ప్రెగ్నెన్సీ సమయంలో చేతులు, పాదం, ముఖం, కళ్ల వాపు సాధారణం. కానీ.. ఉన్నట్టుండి వాపు రావడం, తలనొప్పి, చూపు సమస్యలు వచ్చాయి అంటే.. డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

బ్లీడింగ్ స్పాటింగ్ లేదా కొంచెం బ్లీడింగ్
గర్భం దాల్చిన మొదట్లో కామన్. కానీ.. ఇది సివియర్ బ్లీడింగ్ కి సంకేతం కావచ్చు. కాబట్టి ఏ మాత్రం బ్లీడింగ్ కనిపించినా.. వెంటనే డాక్టర్ వద్దకు వెళ్లి సలహా తీసుకోవడం తప్పనిసరి. ఈ బ్లీడింగ్ విషయంలో ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి ఎలాంటి సమస్య కాకపోయినా.. కొందరికి ఇబ్బందులు తీసుకొస్తాయి.

విపరీతమైన తలనొప్పి
రెండు మూడు గంటల కంటే.. ఎక్కువ సమయం తలనొప్పి ఉండటం, అలాగే చూపులో సమస్యలు కనిపించడం, బాడీలో వాపులు కనిపించాయంటే.. వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి. ఇలాంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకండి.

యూరిన్ పెయిన్
యూరిన్ పెయిన్ యూరిన్ ఇన్ఫెక్షన్ కి సంకేతం. యూరిన్ కి వెళ్లినప్పుడు నొప్పిగా ఉండటం, ఎరుపు రంగులో యూరిన్ రావడం, దుర్వాసన రావడం వంటివి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ ని సూచిస్తాయి. వీటిలో ఏ ఒక్క లక్షణం మీలో కనిపించినా.. డాక్టర్ ని సంప్రదించాలి.



Click it and Unblock the Notifications