For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీరియడ్స్ మిస్ అయ్యాక: గర్భ నిర్ధారణ లక్షణాలు

|

సాధారణంగా కొంత మంది మహిళలకు తాము గర్భం ధరించామన్న విషయం డాక్టర్ వద్దకు వెళ్ళే వరకూ గుర్తించలేరు. కొంత మంది మహిళల్లో వారు నెలతప్పారని లేదా అకస్మాత్తుగా నీరసం, అనారోగ్యానికి
గురైనప్పుడు మాత్రమే ఈ లక్షణాన్నిగుర్తిస్తారు. అయితే, కొన్ని ప్రత్యేకమైన ప్రెగ్నెన్సీ లక్షణాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఉదాహరణకు, కొంత మంది మహిళల్లో గర్భం ధరించే సమయంలో పొట్ట క్రింద(ఉదరబాగం)లో నొప్పి వస్తుంది. అయితే ఆ ఆబ్డోమినల్ పెయిన్(పొట్ట ఉదరంలో )వచ్చే నొప్పిని సాధారణంగా గ్యాస్ లేదా ఎసిడిటి వల్ల వచ్చే నొప్పి అని నిర్లక్ష్యం చేస్తుంటారు.

Symptoms That Tell You Are Pregnant

మీకు అందుబాటులో ఉండే కొన్ని ప్రెగ్నెన్సీ బుక్స్ ను చదివిన లేదా ఇతరులు ఎంత సమాచారం ఇచ్చినా సరే, కొన్ని ప్రత్యేకమైన ప్రెగ్నెన్సీ లక్షణాలు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. కొన్ని ప్రెగ్నెన్సీ లక్షణాలు తరచూ మనస్సు మారుతుండటం, తలనొప్పి, వికారం, లోయర్ ఆబ్డోమినల్ పెయిన్, జ్వరం, ఎక్కువగా లేదా తక్కువ వైజినల్ బ్లీడింగ్ చాలా మంది మహిళ ఎక్కువగా నిర్లక్ష్యం చేస్తుంటారు. అలాగే పీరియడ్స్ మిస్ అవ్వడం ఒక్కటే ప్రెగ్నెన్సీ లక్షణం అనుకోకూడదు.

ఎందుకంటే ప్రెగ్నెన్సీ లక్షణాలు ఒక మహిళ నుండి మరో మహిళలకు డిఫరెంట్ గా ఉంటాయి. ప్రెగ్నెన్సీ ప్రారంభ దశలో ప్రతి మహిళ ఎదుర్కొనే చాలా సాధరణ లక్షణాలు. మీరు గర్భం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు, మీరు ఈ లక్షణాలలో ఏ ఒక్కటి మీరు గుర్తించానా వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

Symptoms That Tell You Are Pregnant

బ్రెస్ట్ లో మార్పులు:స్తనాలు, చనుమొనలు మెత్తబడతాయి. స్తనాలు ఉబ్బి, ముట్టుకుంటే నొప్పి అనిపిస్తాయి. ఈ లక్షణాలు ప్రెగ్నెన్సీ ఎదిగే కొద్దీ మరింత అధికమవుతాయి. చనుమొనల చుట్టూ వుండే చర్మం మరింత నల్లబడుతుంది. ఆ నలుపు కొద్దిపాటిగా వ్యాపిస్తుంది. చనుమొనల చుట్టూ వున్న రక్తనాళాలు కూడా బాగా కనపడుతూంటాయి.

అసౌకర్యం: బ్రెస్ట్ అసౌకర్యంగా అనిపిస్తుంది. పీరియడ్స్ కు రెండు మూడు రోజుల ముందు ఎలా అసౌకర్యంగా నొప్పితో ఇబ్బంది పడుతారో అలాగే పీరియడ్స్ మిస్ అయిన తర్వాత కూడా అలాగే ఉంటుంది. మొదటి త్రైమాసిక ముగిసిన తర్వాత నొప్పి క్రమంగా తగ్గిపోతుంది . శరీరంలో హార్మోన్ లెవల్స్ క్రమంగా అడ్జెస్ట్ అవ్వడం వల్ల తిరిగి నార్మల్ స్థితికి చేరుకుంటుంది.

Symptoms That Tell You Are Pregnant

అలసట:గర్భధారణ ప్రారంభ లక్షణాల్లో ఇది ఒక సాధారణ ప్రెగ్నెన్సీ లక్షణం. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. రక్తపోటు పెరగడం లేదా తగ్గడం వల్ల అలా జరగవచ్చు మరియు వెయిట్ లాస్ డైట్ కూడా అలసటకు కారణం కావచ్చు. అయితే, అసురక్షితమైన లైంగిక ప్రక్రియ కలిగి ఉన్నా మైకంతో బాధపడుతుంటారు. అటువంటప్పుడు, డాక్టర్ ను సంప్రదించండి.

పీరియడ్స్ మిస్డ్ లేదా లేట్ పీరియడ్స్: కొంత మంది మహిళలు పీరియడ్స్ సమస్యలతో బాధపడుతుంటారు. అటువంటప్పుడు, ఈ సమయంలో పీరియడ్స్ మరింత ఆలస్యం అవుతుంది. మీరు గర్భం పొందాలని నిర్ధారించుకొన్నప్పుడు, ఈ లక్షణాన్ని మీరు నిర్లక్ష్యం చేయకూడదు.ద్దిపాటి రక్తస్రావం అవుతుంది. ఫలదీకరణ చెందిన అండం గర్భాశయంలోకి వచ్చేసరికి బయటకు వచ్చే రకతం కొద్దిపాటిగా వుంటుంది. ఈ రక్తం ఎర్రగా వుండి తర్వాత గోధుమరంగుకు మారుతుంది. ఒకటి లేదా రెండు రోజులుంటుంది. అది త్వరగా ఆగిపోతే, గర్భవతి అయ్యారన్నమాటే.

Symptoms That Tell You Are Pregnant

అసాధారణ వాసన:గర్భపొందిన మొదటి నెలలో ఒకలాంటి వాసన ఉంటుంది. అయితే ఇది కొత్తగా పెళ్లైన వారిలోనే ఇలా అనిపిస్తుంది. ఇలా ఒక విధమైన వాసన వచ్చినప్పుడు ఎర్లీ ప్రెగ్నెన్సీ లక్షణాల్లో ఒకటి గా గుర్తించాలి.

ఫ్రీక్వెంట్ యూరినేషన్: మూత్రం అధికమవుతుంది. ప్రొజెస్టిరోన్ స్ధాయి పెరిగి పిండం హెచ్సిజి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. కటి ప్రదేశానికి రక్త సరఫరా పెరిగి తరచుగా మూత్రం వస్తుంది.

English summary

Symptoms That Tell You Are Pregnant

During pregnancy, a woman's body undergoes many changes, in which some are more noticeable than the others. Cautiously noting early pregnancy symptoms and signs along with at-home and doctor-assisted pregnancy testing will assist you to be ready as early as possible for the changes you'll be experiencing over the months to follow.
Story first published:Monday, April 4, 2016, 12:01 [IST]
Desktop Bottom Promotion