For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రీనేటల్ యోగ వల్ల గర్భిణీస్త్రీలు పొందే ప్రయోజనాలు..!

|

సాధారణంగా మనలో చాలా మందికి ఉండే అభిప్రాయమేమంటే, గర్భం దాల్చిన తర్వాత ఏ పని చేయకూడదు. విశ్రాంతిగా ఉండాలి అని. ఈ విధమైన అపోహతో సరైన వ్యాయామం చేయకపోవటం ద్వారా చాలావరకు సహజ ప్రసవాలు తగ్గిపోయాయి. కారణం, శరీరాన్ని కొన్ని భంగిమలలో మాత్రమే ఉంచటం ద్వారా కండరాల పటుత్వం పెరగకపోవడం, బిడ్డ ఎదుగుదలకు అనువుగా మార్పులు చెందకపోవడం వల్ల అనేకమైన సమస్యలు ఏర్పడి ప్రస వం సమయంలో ఆపరేషన్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడు తుంది.

గర్భిణీలు ప్రత్యే కమైనటువంటి వ్యాయామాలు, యోగ సాధనలు చేసినట్లయితే, సీజెరియన్‌ బాధ లేకుండా సహజ ప్రసవం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రత్యేకమైన వ్యాయామాలు, ప్రాణాయామాలు, వజ్రాసనం ఇలా కొన్ని సులభమైన ఆసనాలు వేయాడం ద్వారా అంతే కాదు తల్లి గర్భంలో ఉన్న బిడ్డకు అన్ని అవయవాలు సక్రమంగా పెరుగుతాయి, బిడ్డ చాలా యాక్టీవ్‌గా ఉంటాడు. ''విజనరీ ప్రెగ్నెంట్‌'' ద్వారా ఆరోగ్యకరమైన, అందమైన, చురుకైన బిడ్డను తల్లిదండ్రులు పొందవచ్చు. గర్భిణీ స్త్రీలు సింపుల్ గా యోగా సాధన చేయడం వల్ల కొన్ని ఎఫెక్టివ్ ప్రయోజనాలను పొందవచ్చు. అయితే నిపు అవేంటో తెలుసుకుందాం..

హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది

హార్మోనులను బ్యాలెన్స్ చేస్తుంది

గర్భిణి శరీరంలో అనేక విధాల హార్మోనల్‌ మార్పులు జరుగుతుంటాయి. హార్మోన్స్‌ మధ్య అసమతుల్యత ఏర్పడుతూ ఉంటుంది. ఇటువంటి సమయంలో శారీరక వ్యాయామాలు గర్భిణీకు చాలా ఉపయోగపడుతాయి.

సురక్షితమైన డెలివరీకి సహాయపడుతుంది

సురక్షితమైన డెలివరీకి సహాయపడుతుంది

గర్భిణీలు డెలివరీ సమయంలో ప్రసవ వేదనను భరించలేక సిజేరియన్‌ వైపు మొగ్గు చూపిస్తారు. కాని సహజ ప్రసవానికి అనుకూలంగా అవసరమైన కండరాలను బలపరచడంలో గర్భిణీ స్త్రీలకు వ్యాయామం సహకరిస్తుంది.

మలబద్ధకం మరియు తల తిప్పడం లాంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తాయి.

మలబద్ధకం మరియు తల తిప్పడం లాంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తాయి.

వ్యాయామాలు మరియు ప్రాణాయామాలు పురిటి నొప్పులు, మలబద్ధకం మరియు తల తిప్పడం లాంటి సమస్యల నుంచి ఉపశమనం ఇస్తాయి.

కండరాల నొప్పులను నివారించడానికి

కండరాల నొప్పులను నివారించడానికి

డెలివరీ తర్వాత శిశువుని ఎత్తుకోవడం, ఎక్కువ సేపు చేతుల్లో పట్టుకోవడంతో చేతి నొప్పులు, భుజాల నొప్పులు వస్తాయి. వీటి నుంచి ఉపశమనం పొందేలా చేతి కండరాలు, భుజాల కండరాలు ధృడంగా చేయడానికి వ్యాయామం సహకరిస్తుంది. అయితే గర్భిణీలు ఏ వ్యాయామం, యోగాసనాలు వైద్యుల సలహా మేరకు ఆచరించాలి.

ఉపయోగం:

ఉపయోగం:

గర్భిణీలు వజ్రాసనం వేయడం వల్ల జీర్ణక్రియ బాగా జరుగుతుంది. ఎక్కువ సార్లు ఊపిరి తీసుకోవడం వల్ల శ్వాసక్రియ వేగంగా జరుగుతుంది. ఏకాగ్రత లభిస్తోంది. కండరాల పటుత్వం పెరిగి సహజ ప్రసవానికి సహకరిస్తుంది.

జాగ్రత్తలు:

జాగ్రత్తలు:

ఏ సమయంలో నైనా ఈ ఆసనం వేయవచ్చు. ప్రారంభంలో మడమలు నొప్పిగా అగుపిస్తాయి. అప్పుడు మడమల కింద మెత్తని కుషన్‌ లేదా స్పాంజీ దిండు ఉంచుకోవాలి

బేబీహెల్త్ కు మంచిది

బేబీహెల్త్ కు మంచిది

గర్భిణీ సమయంలో కలిగే దుష్పరిణామాలను నివారించడమే గాక, తల్లీబిడ్డలకు మధ్య ప్రేమానురాగాలను మరింత ఇనుమడింపజేస్తాయని మారియా ముజిక్ పేర్కొన్నారు.

కడుపులోని పిండం మరింత ఆరోగ్యంగా పెరుగుతుంది

కడుపులోని పిండం మరింత ఆరోగ్యంగా పెరుగుతుంది

పైలట్ స్టడీ రూపంలో నిర్వహించిన ఒక అధ్యయనంలో 12-26 వారాల గర్భిణులు రోజూ 90 నిమిషాల పాటు యోగా చేయడం వల్ల కడుపులోని పిండం మరింత ఆరోగ్యంగా పెరుగుతున్నట్లు తెలిసింది. యోగా చేసే తల్లులు ఈ మార్పులను చాలా సులభంగా గుర్తిస్తున్నట్లుగా కూడా తేలింది.

గర్భిణీలు యోగా చేయడానికి నిపుణులు పర్యవేక్షణ చాలా అవసరం

గర్భిణీలు యోగా చేయడానికి నిపుణులు పర్యవేక్షణ చాలా అవసరం

అయితే గర్భవతులు అనుసరించాల్సిన యోగా ప్రక్రియలను కేవలం నిపుణులైన యోగా టీచర్ల సమక్షంలోనే ఆచరించాలి.

English summary

The benefits of yoga in pregnancy !

The benefits of yoga in pregnancy .!The benefits of yoga in pregnancy !,Yoga is the solution to all your physical as well as mental problems. It is also the best way to keep yourself healthy and your mind relaxed during pregnancy. Prenatal yoga is extremely beneficial for you as well as your baby.
Story first published: Tuesday, July 26, 2016, 11:11 [IST]