For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో ఫోలిక్ యాసిడ్ ప్రాముఖ్యత

By Super
|

గర్భవతి అవగానే ఫోలిక్ యాసిడ్ అధికంగా వుండే ఆహారాన్ని తప్పక తీసుకోవాలి. ఫోలిక్ యాసిడ్ తల్లికి పుట్టబోయే బిడ్డకు మొదటి త్రైమాసికంలో అత్యవసరం. అసలు ఫోలిక్ యాసిడ్ అంటే ఏమిటి? అని తెలుసుకుంటే, గర్భవతులకు దాని పాత్ర ఎంత అనేది తేలికగా గ్రహించవచ్చు. ఫోలిక్ యాసిడ్ అనేది విటమిన్ బి కాంప్లెక్స్ లో ఒక భాగం. దీనినే విటమిన్ బి 9 అని కూడా అంటారు. శరీరంలో కణాల ఉత్పత్తికి ఇది తోడ్పడుతుంది. పాత కణాలను పునరుజ్జీవిస్తుంది. కనుక ప్రెగ్నెన్సీలో దాని పాత్ర ప్రధానమైంది.

ప్రెగ్నెన్సీలో పునరుజ్జీవ కణాలు పది రెట్లుగా వుండాలి. ఫోలిక్ యాసిడ్ ఎర్ర రక్త కణాలను పుట్టిస్తుంది. అంతే కాక నరాలకవసరమైన సెరోటోనిన్ కూడా ఇస్తుంది. డాక్టర్లు గర్భవతులు ఒక సంవత్సరం ముందుగానే ఫోలిక్ యాసిడ్ తీసుకోవాలని సలహా ఇస్తారు. తర్వాతి దశలలో ఫోలిక్ యాసిడ్ తీసుకోవడం పెరగాలే గాని తగ్గరాదు. గర్భిణీ స్త్రీలకు ఫోలిక్ ఆమ్లం వల్ల ప్రయోజనాలు ఫోలిక్ ఆమ్లం గర్భిణీ స్త్రీలకు ఒక సూపర్ హీరో వంటిది, ఎందుకంటే బిడ్డ యొక్క మెదడు మరియు వెన్నెముక మరియు పుట్టుకలో వచ్చే లోపాలను నిరోధిస్తుంది. దీనిలో B విటమిన్,బలవర్థకమైన తృణధాన్యాలు ఉంటాయి.

 The Importance Of Folic Acid In Pregnancy

ఫోలిక్ ఆమ్లం ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది, మరియు మీ శిశువు యొక్క నాడీ నాళిక అభివృద్ధికి సహాయపడుతుంది. ఒక చీలి పెదవి మరియు అంగిలితో పుట్టిన శిశువులకు జన్మనిచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. సాధారణంగా మీరు గర్భం ధరించటానికి ప్లాన్ వేసుకుంటే దానికి ఒక సంవత్సరం ముందు నుంచి ఫోలిక్ ఆమ్లం సప్లిమెంట్లను వాడితే నెలలు నిండకుండా పుట్టే పిల్లల శాతం 60%శాతానికి పైగా రిస్క్ తగ్గుతుంది.

 The Importance Of Folic Acid In Pregnancy

ఒకవేళ గర్భధారణ ఆకస్మికంగా ఉంటే మీరు గర్భవతి అని తెలిసిన వెంటనే ఫోలిక్ ఆమ్లం మాత్రలను ప్రారంభించండి.గర్భధారణ యొక్క మొదటి 12 వారాల ఫోలిక్ ఆమ్లం మాత్రలు తీసుకోవాలి. ఫోలిక్ ఆమ్లం B విటమిన్ యొక్క ఒక రూపం. ఫోలిక్ ఆమ్లం లోపం వల్ల గర్భస్రావం జరగటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, మరియు పిల్లలు నాడీ ట్యూబ్ డిజార్డర్ ప్రతి 1000 మందిలో ఒకరికి వచ్చేఅవకాశం ఉంది.

 The Importance Of Folic Acid In Pregnancy

సూచనలు:
1. ఫోలిక్ యాసిడ్,కొవ్వు వంటిది కాదు. శరీరం ఫోలిక్ యాసిడ్ ను నిలువచేసుకోలేదు. శరీరంలో అది కొవ్వు వలే నిలువ వుండదు.
2. ప్రెగ్నెన్సీలో బిడ్డ ప్రతి రోజూ ఎదిగిపోవటంతో అధిక కణాలు అవసరమవుతాయి. అంటే తల్లి శరీరం కొత్త కణాలను గతంలో కంటే వేగంగా ఉత్పత్తి చేసి దానికి అందించాలి. కనుక గర్భం దాల్చిన తర్వాత కణాలు అభివృద్ధి చెందాలంటే ఫోలిక్ యాసిడ్ అత్యవసరం.

 The Importance Of Folic Acid In Pregnancy

3. ఫోలిక్ యాసిడ్ విషయంలో ఓవర్ డోసు లేదా తక్కువ డోసు అంటూ ఏమీ లేదు. సైడ్ ఎఫెక్ట్ అసలే వుండదు. అధికంగా తీసుకుంటే నీటిలో కరిగి శరీరంనుండి విసర్జించబడుతుంది. కనుక ఎంత పరిమాణం తీసుకున్నా పరవాలేదు. ఫోలిక్ యాసిడ్ సరిగా సరఫరా కాకుంటే పుట్టబోయే బిడ్డకు కొన్ని సమస్యలు వస్తాయి.

 The Importance Of Folic Acid In Pregnancy

అవేమిటో చూద్దాం-- ఫోలిక్ యాసిడ్ కొరవడితే, బేబీలోని న్యూరల్ ట్యూబ్ దెబ్బతింటుంది. అది నరాల వ్యవస్ధను బలహీన పరుస్తుంది. దీనితో బేబీ కి కాళ్ళకు పాక్షికంగా పెరాలసిస్ వచ్చే ప్రమాదం వుంది. బేబీకి బౌల్ కదలికలు కూడా సరిగా వుండవు. బేబీ వెన్నెముక సరిగా పెరగదు.

ఫోలిక్ యాసిడ్ తగ్గితే, బేబీ పూర్తి ఎదుగుదల లేకుండా త్వరగా పుట్టే అవకాశం వుంది. ఫోలిక్ యాసిడ్ పచ్చని ఆకు కూరలలో వుంటుంది. లేదంటే డైటరీ సప్లిమెంట్లలో కూడా శరీరానికి అందించవచ్చు.

English summary

The Importance Of Folic Acid In Pregnancy

Pregnancy is a special stage in every woman’s life, both physically and mentally. Her health in both aspects affects the growing baby as well. So, in order to have a healthy and happy baby, it is important for the woman to be absolutely fit and healthy.
Story first published: Monday, February 22, 2016, 11:49 [IST]
Desktop Bottom Promotion