Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
గర్భధారణ సమయంలో వచ్చే అనారోగ్య సమస్యలు : తీసుకోవల్సిన జాగ్రత్తలు
మహిళలకు గర్భం ధరించడం సృష్టిలో ఒక అద్భుతమై ఘట్టం. అందులోనే గర్భం ధరించనప్పటి నుండి గర్భధారణ కాలం సురక్షితంగా పూర్తి అయితే ఎటువంటి సమస్యలుండవు. మహిళలు గర్బం ధరించిన తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటుచేస
మహిళలకు గర్భం ధరించడం సృష్టిలో ఒక అద్భుతమై ఘట్టం. అందులోనే గర్భం ధరించనప్పటి నుండి గర్భధారణ కాలం సురక్షితంగా పూర్తి అయితే ఎటువంటి సమస్యలుండవు. మహిళలు గర్బం ధరించిన తర్వాత శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. అవి తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని మీరు చదవాల్సిందే. బరువు పెరగడం, బ్లడ్ ప్రెజర్, తిమ్మిరులు, వైజినల్ డిస్చార్జ్, లీకింగ్ నిప్పల్స్ మరియు ఒళ్ళు నొప్పులు మొదలగునవి మరికొన్ని ఇతర ఆరోగ్య సమస్యలు కూడా గర్భణి స్త్రీలో వచ్చేటటువంటి సాధర ఆరోగ్యసమస్యలు.
గర్భిణీ స్త్రీ పొట్టలో పిండం పెరిగే కొద్ద పొట్ట మరియు బ్రెస్ట్ పెరగడంతో పాటు, శరంల కూడా అనేక మార్పలకు లోనవుతుంది. ఉదాహరణకు: గర్భం ధరించగానే, గర్భిణీలో చర్మం స్ట్రెచ్ (సాగడం మొదలవుతుంది మరియు ఇది తరచూ స్ట్రెచ్ మార్క్స్ (చర్మంలో ఛారలు)ఏర్పడటానికి కారణం అవుతుంది. గర్భం ధరించిన మహిళ చూడటానికి మరింత అందంగా కనిపించడం కానీ లేదా మరింత నీరసంగా, డల్ గా కనిపించడం కానీ జరుగుతుంది. ముఖ్యంగా జుట్టు రాలడం, మనస్సులో గందరగోళం, తరచూ మనస్సు మార్చుకోవడం, మరియు వికారం వంటి సాధారణ సమస్యలు అసౌకర్యానికి గురిచేస్తాయి.
అదేవిధంగా, వికారం, మార్నింగ్ సిక్ నెస్, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు మొదలగు, ఇతర ఆరోగ్యసమస్యలతో బాధపడుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఈ మార్పుల వల్ల అసౌకర్యంగాను మరియు చిరాకుగాను అనిపిస్తుంది. అయితే, కొన్ని సందర్భాలలో వారు చాలా ఆందోళకరమైనవారుగా అనిపించవచ్చు. గర్బిణీ స్త్రీలు ఎదుర్కొనే కొన్ని సాధారణ ఆరోగ్య సమస్యలు మీరు తెలుసుకోవడం కోసం కొన్ని ఇక్కడ అంధిస్తున్నాం...

వికారం:
గర్భం ధరించిన మహిళల్లో ఉదయం పూట వికారం, వాంతి వచ్చేటట్లు ఉండటం, తరచూ మనస్సు మారడం, మనస్సులో గందరగోళం వంటివి మొదటి త్రైమాసికంలో తప్పనిసరిగా ఎదుర్యే సమస్యలు. కొంత మంది గర్భిణీ స్త్రీలలో ఈ లక్షణాలు రెండవ త్రైమాసంలో కూడా ఉంటాయి.

అజీర్ణం -
ఒకే సారి అధిక భోజనం కాకుండా, కొద్ది మొత్తాలలో తరచుగా తినాలి. భోజన సమయంలో నిదానంగా నమిలితినాలి. ఆహారం తీసుకునే సమయంలో ద్రవాలు అధికంగా తీసుకోరాదు. భోజనం తర్వాత వంగటం లేదా కింద పడుకోవటం చేయవద్దు. ప్రతి రాత్రి భోజనం బెడ్ టైమ్ కు రెండు గంటలముందు తినాలి.

అలసట -
దీనికి పరిష్కారం విశ్రాంతి మాత్రమే. ఎక్కడ కూర్చున్నా కాళ్ళు పైనపెట్టి కూర్చోండి. నిద్ర ఎపుడు వచ్చినా పడుకోండి. కుటుంబంలో మీరు ఒక రాణిలా మర్యాదలు పొందండి.

నుడుము నొప్పి:
గర్భం ధరించిన మహిళల శరీరంలో రోజురోజుకు పిండం పెరిగేకొద్ది, శరీరంలో ఇతర ఎలిమెంట్స్ తో పాటు, చర్మం కూడా చాలా సాప్ట్ గా మరియు స్ట్రెచ్చీగా మార్పు చెందుతాయి. మరియు ఇది మిమ్మల్ని ప్రసవానికి సిద్దం చేయడానికి నిధానంగా ఇలా మార్పు చెందుంతుంటాయి . పిండం పెరుగుదల, గర్భంలో స్థల ఏర్పడటానికి కండరాలు సడలించడం వల్ల లోయర్ బ్యాక్ పెయిన్ మరియు పెల్విస్ జాయింట్స్ లో నొప్పి ఏర్పడటానికి కారణం అవుతంది.

తరచూ మూత్రవిసర్జన:
బేబీ బంప్ పెరిగే కొద్దీ బ్లాడర్ మీద ఒత్తిడి పెరిగి, మూత్తపిండాలు నిండి, ఒత్తిడి కలిగి వెంటనే మూత్రవిసర్జన చేయాలనిపిస్తుంది. కాబట్టి, వెంటనే మీరు మూత్రవిసర్జన చేయాల్సి ఉంటుంది. అలాగే స్టోర్ చేసుకోకూడదు.

తిమ్మిర్లు -
మడమ, కాళ్ళు వంటివి ప్రతిరోజూ మెల్లగా వ్యాయామాలు చేస్తే రక్త సరఫరా మెనరుగుపడి తిమ్మిర్లవంటివి తగ్గుతాయి.

మలబద్దకం:
గర్భిణీ స్త్రీలలో అతి సాధారణ సమస్య మలబద్దకం. కాబట్టి అధిక ఫైబర్ కంటెంట్ కలిగిన ఆహారాలు తీసుకుంటూ, అధికంగా నీరు త్రాగాల్సి ఉంటుంది.

తలనొప్పి
కొంత మంది గర్భణీ స్త్రీలు తలనొప్పికి కూడా గురిఅవుతుంటారు . ప్రెగ్నెన్సీ మొదటి వారంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మరియు హార్మోనులు అసమతుల్యలత, వాంతి వంటివి తలనొప్పికి కారణం అవుతాయి .

గుండెమంట -
చల్లటి పాలు ఒక గ్లాసెడు తాగితే పరిష్కారమే. గుండె మంట రాకుండా అధిక, నూనెలు కల ఆహారాలు రాత్రి డిన్నర్ లో మానండి. యాంటాసిడ్ టాబ్లెట్ లు వైద్యుల సలహా లేకుండా వాడకండి.

అధిక రక్తపోటు -
రెగ్యులర్ వ్యాయామం చేయాలి. పోషకాహారం తీసుకోవాలి. తాజా పండ్లు, కూరగాయలు తినాలి. ఉప్పు అధికంగా వుండే పచ్చళ్ళు అప్పడాలు, ఇతర ఆహారాలు తినరాదు.



Click it and Unblock the Notifications