Latest Updates
-
కరకరలాడే బెండకాయ చట్నీ ఎప్పుడైనా తిన్నారా? ఒక్కసారి రుచిచూస్తే వదలరు! -
వేడి వేడి ఇడ్లీ, కరకరలాడే దోశల్లోకి అదిరిపోయే టమాటా చట్నీ.. ఇలా చేస్తే రుచి అదుర్స్! -
స్వైపింగ్ ఇక లేదు! బంబుల్ యాప్లో వచ్చిన ఆ మార్పుతో డేటింగ్ స్టైల్ పూర్తిగా మారిపోతుందా? -
ఎండల వల్ల పీరియడ్స్ మిస్ అవుతున్నాయా? మహిళలు తప్పక తెలుసుకోవాల్సిన షాకింగ్ నిజాలు! -
నోట్లో వేస్తే వెన్నలా కరిగిపోయే దహీ లచ్చా పరాఠా.. దీన్ని ఎలా చేయాలో తెలుసా? -
అమ్మకు, భార్యకు మధ్య నలిగిపోతున్నారా? మదర్స్ డే రోజున ఈ బ్యాలెన్స్ ఎలాగో తెలుసా! -
మార్కెట్లో కొనే పనిలేదు.. 100% స్వచ్ఛమైన మామిడి పొడి తయారీ విధానం ఇదే -
ఆమె తెచ్చిన రోజే ఆమెకు భారమైంది.. మాతృదినోత్సవం వెనుక తెలియని నిజాలు! -
ఎండలు మండిపోతున్నాయి! గర్భిణులు ఈ చిన్న పొరపాట్లు చేస్తే ప్రమాదమేనా? -
గుండె పదిలం..కిడ్నీలు శుభ్రం..అంతులేని పోషకాలున్న ఈ జ్యూస్ తాగితే బోలెడు బెనిఫిట్స్!
గర్భం (ఫెర్టిలిటీని )పొందడానికి సహాయపడే మూలికలు
సాధారణంగా పెళ్ళైన సంవత్సరంలోపు పిల్లలు కలగలేదంటే ఇన్ఫెర్టిలిటి అని చెబుతుంటారు. గతంలో 30ఏళ్ళు దాటితే గర్భం పొందడం కష్టమనే వారు. కానీ ప్రస్తుత కాలంలో 25 నుండి 30ఏళ్ళలోపే పిల్లలకోసం ప్లాన్ చేసుకోమని సూచిస్తుంటారు . 35ఏళ్ళ తర్వాత మహిళల్లో ఓవలేషన్ తగ్గితుంది మరియు ఇతర పునరుత్పత్తి సమస్యలు తలెత్తుతాయి . దాంతో గర్భం పొందడం కష్టంగా మారుతుంది.
అయితే కొంత మంది మహిళల్లో వయస్సుతో పాటు వచ్చే హార్మోనల్ అసమతుల్యతలు , ఆటో ఇమ్యూన్ రిలేటెడ్ ఫెర్టిలిటీ సమస్యలు, (పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్), వీక్ యూట్రస్ మొదలగునవి వంటివి ప్రభావం చూపుతాయి.
హార్మోన్ల అసమతౌల్యంను నివారించే ఫెర్టిలిటి ఆహారాలు!
పిల్లలు పుట్టకపోవడానికి కారణమేదైనా , ఇన్ ఫెర్టిలిటీని జయించడానికి కొన్ని హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. అవును ఖచ్చితంగా మీరు చదివింది రైట్..! ఫెర్టిలిటి సమస్యలను నివారించడానికి హెర్బ్స్ ఖచ్చితంగా సహాయపడుతాయి. మరియు వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
ఫెర్టిలిటీ కోసం తీసుకొనే ఈ హెర్బ్స్ , శరీరాన్ని గర్భధారణకు ప్రోత్సహించి, రెడీ చేస్తుంది . అందుకు వీటిలో ఉండే న్యూట్రీషియన్స్ మరియు ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండి సహాయపడుతాయి. గర్భం పొందడానికి ఎఫెక్టివ్ గా ప్రభావం చూపుతాయి. ఈ హెర్బ్స్ ఫెర్టిలిటికి సంబంధించిన అన్ని రకాల సమస్యలను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. కాబట్టి, వీటిని ఇన్ఫెర్టిలిటిలో భాగంగా సూచిస్తున్నారు.
పిల్లల కోసం ప్లాన్ చేసుకొనే వారికి ది బెస్ట్ మేల్ ఫెర్టిలిటి ఫుడ్స్..
మరి ఫెర్టిలిటీని (గర్భం పొందడానికి)పెంచే హెర్బ్స్ కొన్ని మీ కోసం....

శతావరి:
ఇది యూట్రస్ ఆరోగ్యంగా ఉండటానికి ప్రత్యుత్పత్తి వ్యవస్థను మెరుగుపరచడానికి షతావరి గ్రేట్ గా సహాయపడుతుంది. అంతే కాదు ఓవరీస్ హెల్త్ కూడా గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది సర్వికల్ సెక్రికేషన్ మరియు మహిళల్లో వ్యాధినిరోధక ఫెర్టిలిటి సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది.

ఆముదం నూనె:
పొట్ట ఉదరం ఆముతం నూనెతో బాగా మసాజ్ చేయడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది .ఇది టిష్యులను నయం చేసి ఓవలేషన్ ప్రోత్సహిస్తుంది. ఇలా చేయడం వల్ల రక్తంలో ద్వారా ఆక్సిజన్ యూట్రస్ కు సప్లై అవుతుంది మరియు ఫెర్టిలిటిని ప్రోత్సహిస్తుంది.

ఈవెనింగ్ ప్రైమ్ రోజ్ ఆయిల్:
ఈ నూనెలో ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ మరియు ఓమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ , లినోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఫ్యాటీ యాసిడ్స్ ప్రెగ్నెన్సీ హార్మోనులను క్రమబద్దం చేయడానికి సహాయపడుతాయి. ఈ ఆయిల్స్ సర్వైకల్ మ్యూకస్ పెంచడానికి సహాయపడుతుంది. అలాగే యూట్రస్ లో స్ప్రెర్మ్ సులభంగా ఎంటర్ అవ్వడానికి సహాయపడుతుంది.

లికోరైస్ రూట్:
ఈ హెర్బ్ హార్మోన్స్ ను కరెక్ట్ చేస్తుంది . ఈస్ట్రోజన్ యాక్షన్ కలిగి ఉండటం చేత, గర్భం ధరించడానికి ఉపయోగకరంగా ఉంటుంది . మరియు ఇది శరీరంలోని టాక్సిన్స్ ను తొలగించడానికి సహాయపడుతుంది. ఫెర్టిలిటీని తొలగిస్తుంది.

అశ్వగంద:
అశ్వగంద ఎండోక్రైన్ గ్రంథులను రెగ్యులేట్ చేస్తుంది. దాంతో హార్మోనుల అసమతుల్యతను నివారిస్తుంది. హార్మోనుల సమస్యలనున్న వారిలో ఫెర్టిలిటీని పెంచుతుంది . అలాగే ఆటో ఇమ్యూన్ ఫెర్టిలిటీ సమస్యలను కూడా నివారిస్తుంది.

రెడ్ క్లోవర్:
ఈ హెర్బ్ స్కర్విక్స్ లో మ్యూకస్ స్రవించడానికి మరియు వైజినల్ డ్రైనెస్ ను నివారించడానికి ఈ హెర్బ్ గ్రేట్ గా సహాయపడుతుంది . రెడ్ క్లోవర్ యూట్రస్ లో రక్తప్రసరణను పెంచుతుంది. దాంతో త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతుంది . ఈ హెర్బ్ లో క్యాల్షియం, మరియు మెగ్నీషియం గర్భం పొందడానికి గ్రేట్ గా సహాయపడుతాయి.

దాల్చిన చెక్క:
ఇది ఫెర్టిలిటిని పెంచడానికి సహాయపడుతుంది. హైబ్లడ్ ప్రెజర్ సమస్యలున్న వారిలో ఫెర్టిలిటి సమస్యలను నివారిస్తుంది. మెనుష్ట్ర్యువల్ సమస్యలను నివారిస్తుంది. ఇన్ ఫెర్టిలిటీతో పోరాడే గుణాలు ఇందులో మెండుగా ఉన్నాయి.



Click it and Unblock the Notifications