Latest Updates
-
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో.. -
నీట్ పరీక్ష రోజు పీరియడ్స్ వస్తున్నాయా? కంగారు వద్దు.. ఈ చిట్కాలు మీకోసమే! -
తెలంగాణలో మండుతున్న ఎండలు: గర్భిణులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
పొయ్యి వెలిగించే పనే లేదు.. నోట్లో వెన్నలా కరిగిపోయే పచ్చి కొబ్బరి పాయసం -
భార్య వేధింపులు భరించలేక టెక్కీ ఆత్మహత్య: అసలేం జరిగింది? -
సమ్మర్ లో దొరికే అరుదైన పండు..బీపీ కంట్రోల్, జీర్ణక్రియ నుంచి కాలేయ సంరక్షణ వరకు బోలెడు ప్రయోజనాలు -
వ్యతీపాత యోగంతో ఈ రాశుల వారికి రాజయోగం.. ఈ తప్పులు అస్సలు చేయకండి! -
ఇలా టమాటా రసం చేస్తే పళ్లెంలో అన్నం నిమిషాల్లో ఖాళీ అవ్వాల్సిందే! -
హైదరాబాద్ టెక్కీ రాసిన 19 పేజీల నోట్… ఆ ఒక్క నిర్ణయం వెనుక ఉన్న భయంకరమైన నిజం ఇదే! -
సమీరా రెడ్డి చేసిన గోవా స్పెషల్ మ్యాంగో కొబ్బరి కర్రీ..అన్నంలోకి అమృతమే..మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే..
త్వరగా గర్భం పొందడానికి ఖచ్చింతగా తినాల్సిన నేచురల్ ఫుడ్స్ !!
ఈ మద్యకాలంలో ఇన్ ఫెర్టిలిటి సమస్యలు అధికమవుతున్నాయి. అందుకు ముఖ్య కారణంలో పోషకాహార లోపం, స్ట్రెస్, అన్ హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల పిల్లలు కలగక చాలా మంది నిరాశ చెందుతుంటారు. అలా నిరాశ చెందే వారికి ఒక శుభవార్త. మన కిచెన్ లో సింపుల్ రెమెడీసే గ్రేట్ గా సహాయపడుతాయి.
పెళ్ళైన తర్వాత ప్రతి జంటా పిల్లలు కావలని కోరుకుంటారు. కానీ, తల్లిదండ్రి కాలేప్పుడు నిరాశ చెందడం సహజం. ఎంత ఎఫెర్ట్ పెట్టినా, ఎంత డబ్బు ఖర్చు చేసినా ఫలితం లేకపోతే వారిలో ఆందోళన, డిప్రెషన్ వంటి ఇతర సమస్యలకు కారణమవుతుంది.
పిల్లలు లేనివారు త్వరగా సంతానం కావాలని కోరుకునే వారు మన వంటగదిలో అద్భుతమైన ఆహారాలు వండర్ ఫుల్ గా పనిచేస్తాయని తెలిస్తే ఇక వారి ఆనందానికి హద్దే ఉండదు. పిల్లల కోసం ప్రయత్నించే వారు, మెడికల్ పరంగా ట్రై చేస్తూనే ఇంట్లో ఉండే ఈ పదార్థాలను కూడా ట్రై చేయడం వల్ల వీటిలోని పోషక విలువల కారణంగా త్వరగా గర్భం దాల్చే అవకాశాలుంటాయి.
ఖరీదైన ట్రీట్మెంట్స్ కంటే నేచురల్ పద్దతిలో గర్భం పొందడం అన్ని రకాలుగా సురక్షితమైనది. నేచురల్ పదార్థాలు వాడటం వల్ల మనీతో పాటు, టైమ్ కూడా సేవ్ అవుతుంది. త్వరగా గర్భంపొందాలంటే శరీరానికి సరిపడా పోషకాలను అందివ్వాలి. అలాంటి హెల్తీ పోషకాలు కలిగిన నేచురల్ ఫుడ్స్ మన వంటగదిలో చాలానే ఉన్నాయి. వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల త్వరగా గర్భం పొందే అవకాశాలు ఎక్కువ.

చెన్నా(శెనగలు)
త్వరగా గర్భం పొందాలని కోరుకునే వారు, రెగ్యులర్ డైట్ లో శెనగలను చేర్చుకోవాలి, వీటిలో ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ఇవి ఓవరీస్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.

పన్నీర్ :
పనీర్ మరో హెల్తీ హై ప్రోటీన్ ఫుడ్. ఇది రీప్రొడక్టివ్ ఆర్గాన్స్ (ప్రత్యుత్పత్తి వ్యవస్థకు) స్ట్రాంగ్ గా మార్చుతాయి. ఈ నేచురల్ పదార్థంలోని హైన్యూట్రీషినల్ వ్యాల్యూస్ వల్ల త్వరగా గర్బం పొందుతారు.

ఐస్ క్రీమ్:
వావ్ గుడ్ న్యూస్! : కొన్ని రకాల మిల్క్ ఫ్యాట్స్ ను ఐస్ క్రీమ్ లు కనుగొన్నట్లు రీసెంట్ స్టడీలో వెల్లడించారు. ఇవి ప్రెగ్నెన్సీ హార్మోన్స్ ఉత్పత్తి చేయడానికి సహాయపడుతాయి. . త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతాయి.

గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ :
త్వరగా గర్భం పొందాలంటే, రెగ్యులర్ డైట్ లో గ్రీన్ వెజిటేబుల్స్ ను ఎక్కువగా చేర్చుకోవాలి. ఈ గ్రీన్ వెజిటేబుల్స్ లో ఉండే విటమిన్స్, మినిరల్స్ హార్మోనులు లోపాన్ని నివారించే హార్మోన్స్ బ్యాలెన్స్ చేస్తుంది. త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతుంది.

గుమ్మడి విత్తనాలు:
రెగ్యులర్ గా మన వినియోగించే వెజిటేబుల్స్ లో గుమ్మడి ఒకటి. వీటిలోని విత్తనాలు కూడా రెగ్యులర్ గా తింటుంటే , వీటిలో ఉండే ఐరన్ కంటెంట్ మహిళలో త్వరగా గర్భం పొందడానికి సహాయపడుతాయి.

ఆలివ్ ఆయిల్ :
త్వరగా గర్భం పొందడానికి ఆలివ్ ఆయిల్ నేచురల్ గా సహాయపడుతుంది. ఇది ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దాంతో గర్భం పొందడం సులభమవుతుంది.

చేపలు:
చేపల్లో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి, ఈ ఫ్యాటీ యాసిడ్స్ మరియు విటమిన్ ఇ తర్వగా , ఎఫెక్టివ్ గా గర్భం పొందడానికి సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications